జ్ఞాపకార్థ ఆచరణ ప్రచార కార్యక్రమం
యేసు—యుద్ధం అనే మాటే వినబడకుండా చేస్తాడు
యేసు భూమ్మీద ఉన్నప్పుడు, తనకు ప్రజల మీద చాలా ప్రేమ ఉందని చూపించాడు. ఎంతంటే, వాళ్ల కోసం తన ప్రాణాన్నే త్యాగం చేశాడు. (మత్తయి 20:28; యోహాను 15:13) ముందుముందు, ప్రజల మీద తనకు ప్రేమ ఉందని మళ్లీ చూపిస్తాడు. ఎలా? దేవుని రాజ్యానికి రాజుగా తనకున్న అధికారంతో, “భూవ్యాప్తంగా యుద్ధాలు జరగకుండా చేస్తాడు.”—కీర్తన 46:9.
యేసు ఏమి చేస్తాడని బైబిలు చెప్తుందో గమనించండి:
“సహాయం కోసం మొరపెట్టే పేదవాళ్లను, దీనుల్ని, నిస్సహాయుల్ని ఆయన రక్షిస్తాడు. దీనుల మీద, పేదవాళ్ల మీద ఆయన జాలి చూపిస్తాడు, పేదవాళ్ల ప్రాణాల్ని కాపాడతాడు. అణచివేత నుండి, దౌర్జన్యం నుండి ఆయన వాళ్లను రక్షిస్తాడు.”—కీర్తన 72:12-14.
ఇప్పటివరకు యేసు మనకోసం చేసినవాటి మీద, ముందుముందు చేయబోయేవాటి మీద కృతజ్ఞత ఉందని ఎలా చూపించవచ్చు? లూకా 22:19 లో యేసు తన మరణాన్ని గుర్తుచేసుకోమని చెప్పాడు. అందుకే, ప్రతీ సంవత్సరం యెహోవాసాక్షులు యేసు చనిపోయిన రోజున కలుసుకుని, ఆయన మరణాన్ని గుర్తుచేసుకుంటారు. 2024, మార్చి 24, ఆదివారం రోజున జరిగే యేసు మరణ జ్ఞాపకార్థ ఆచరణకు మాతో పాటు మీరు కూడా రావాలని ఆహ్వానిస్తున్నాం.