అప్రమత్తంగా ఉండండి!
కమ్ముకున్న యుద్ధ మేఘాలు వీడేదెప్పుడు?—బైబిలు ఏం చెప్తుంది?
2024, ఏప్రిల్ 13 శనివారం రోజున ఇజ్రాయిల్ మీద ఇరాన్ చేసిన దాడి గురించి మాట్లాడుతూ, UN సెక్రెటరీ-జనరల్ ఆంటోనియో గుటెరెస్ ఇలా అన్నాడు: ‘ఇది కయ్యానికి కాలు దువ్వాల్సిన సమయం కాదు, ప్రశాంతంగా ఆలోచించాల్సిన సమయం.’
మిడిల్ ఈస్ట్ దేశాల్లోనే కాదు ప్రపంచమంతటా ఎన్నో గొడవలు, కొట్లాటలు జరుగుతూనే ఉన్నాయి.
“రెండో ప్రపంచ యుద్ధం నుండి రక్తపాతం, హింస అంతకంతకూ పెరిగిపోతున్నాయి. దానివల్ల 200 కోట్లమంది, అంటే ప్రపంచ జనాభాలో నాలుగో వంతు మంది ఇబ్బందులు పడుతున్నారు.”—ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి, జనవరి 26, 2023.
రక్తపు మరకలతో నిండిన దేశాల్లో కొన్ని ఏంటంటే: ఇజ్రాయిల్, గాజా, సిరియా, అజర్బైజాన్, యుక్రెయిన్, సూడాన్, ఇతియోపియా, నైజర్, మయన్మార్, హయిటీ. a
ఈ యుద్ధాలు ఆగేదెప్పుడు? లోక నాయకులు శాంతిని తీసుకురాగలరా? బైబిలు ఏం చెప్తుంది?
యుద్ధపు అంచుల్లో ప్రపంచం
ప్రపంచంలో జరుగుతున్న గొడవలు, కొట్లాటలు అతి త్వరలో యుద్ధాలకు ఫుల్ స్టాప్ పడుతుందని రుజువు చేస్తున్నాయి. అదెలా? మనకాలంలో జరుగుతున్న యుద్ధాల గురించి బైబిలు ముందే చెప్పింది. మన కాలాన్ని, “ఈ వ్యవస్థ ముగింపు” అని బైబిలు పిలుస్తుంది.—మత్తయి 24:3.
“మీరు యుద్ధాల గురించి, యుద్ధ వార్తల గురించి వింటారు. . . . ఒక దేశం మీద మరో దేశం, ఒక రాజ్యం మీద మరో రాజ్యం దాడిచేస్తాయి.”—మత్తయి 24:6, 7.
మనకాలంలో జరుగుతున్న యుద్ధాలు, బైబిలు ముందే చెప్పినదాన్ని ఎలా నెరవేరుస్తున్నాయో తెలుసుకోవడానికి, “‘చివరి రోజులు’ లేదా ‘అంత్యదినముల’ సూచన ఏమిటి?” అనే ఆర్టికల్ చదవండి.
యుద్ధాల్ని ఆపే చివరి యుద్ధం
మనుషులు చేసే యుద్ధాలు ఇక ముగిసిపోతాయి అని బైబిలు ముందే చెప్పింది. అదెలా సాధ్యం? అది మనుషుల వల్ల కాదుగానీ, “సర్వశక్తిమంతుడైన దేవుని మహారోజున జరిగే” హార్మెగిద్దోన్ యుద్ధం వల్ల సాధ్యమౌతుంది. (ప్రకటన 16:14, 16) ఆ యుద్ధం తర్వాత, భూమ్మీద శాంతి-సంతోషాలు విలసిల్లుతాయి. అలా దేవుడు ఇచ్చిన మాట నెరవేరుతుంది.—కీర్తన 37:10, 11, 29.
యుద్ధాల్ని పూర్తిగా ఆపేసే ఆ మహా యుద్ధం గురించి ఇంకా ఎక్కువ తెలుసుకోవడానికి “హార్మెగిద్దోను యుద్ధం అంటే ఏమిటి?” అనే ఆర్టికల్ చదవండి.
a ACLED కన్ఫ్లిక్ట్ ఇండెక్స్, “ర్యాంకింగ్ వయలెంట్ కన్ఫ్లిక్ట్ లెవెల్స్ ఎక్రాస్ ది వరల్డ్,“ జనవరి 2024