పాట 76
మీకు సంతోషంగా ఉంటుందా?
-
1. సంతోషమేస్తుందా?
ప్రకటిస్తే, బోధిస్తే;
మనస్ఫూర్తిగా మనం
ఆ పని చేస్తుంటే.
సత్యం అనే ముత్యం
ప్రజలకు అందిస్తే,
చూసి మురిసిపోడా
మన యెహోవాయే.
(పల్లవి)
ఆనందంగా నిరంతరం
మనసుతో, హృదయంతో
మా పెదాలతో అర్పిస్తాం
దేవునికి స్తుతి.
-
2. సంతోషమేస్తుందా?
ఈ సత్యం ఇష్టమంటే,
జీవాన్నిచ్చే మాటల్ని
విని ఆలోచిస్తే?
కొందరు వద్దన్నా
లేదా తప్పిపోయినా,
సాక్షులై యెహోవాకి
ఉందాం మనందరం.
(పల్లవి)
ఆనందంగా నిరంతరం
మనసుతో, హృదయంతో
మా పెదాలతో అర్పిస్తాం
దేవునికి స్తుతి.
-
3. సంతోషమేస్తుందా?
తండ్రి పని చేస్తుంటే
మర్యాదగా ఉంటూనే
ధైర్యం చూపిస్తుంటే.
మన బాధ్యతను
చక్కగా పూర్తి చేస్తూ,
అర్హులైనవాళ్లను
వెదుకుతూ ఉందాం.
(పల్లవి)
ఆనందంగా నిరంతరం
మనసుతో, హృదయంతో
మా పెదాలతో అర్పిస్తాం
దేవునికి స్తుతి.
(అపొ. 13:48; 1 థెస్స. 2:4; 1 తిమో. 1:11 కూడా చూడండి.)