పాట 60
జీవాన్నిచ్చే వార్త చాటిద్దాం
-
1. తప్పక వస్తుంది
యెహోవా తీర్పు రోజు
అందుకే చెప్పాలి
రాజ్యవార్త వెంటనే.
(పల్లవి)
విని వాళ్లు లోబడితే
పొందవచ్చు జీవాన్ని.
వాళ్లే కాదు మనం కూడా
జీవిస్తాము ఈ వార్తను
చాటిస్తే.
-
2. ఆలస్యం చేయద్దు
ప్రతీ ప్రాణం ప్రాముఖ్యం
అందర్నీ రమ్మందాం
దాటేద్దాం ఈ లోకాంతం.
(పల్లవి)
విని వాళ్లు లోబడితే
పొందవచ్చు జీవాన్ని.
వాళ్లే కాదు మనం కూడా
జీవిస్తాము ఈ వార్తను
చాటిస్తే.
(బ్రిడ్జ్)
ఈ రోజే, అవకాశం
అంతం వచ్చే లోపే, చెప్దాం.
నేర్పిస్తే జీవమార్గం
నడవరా నిరంతరం!
(పల్లవి)
విని వాళ్లు లోబడితే
పొందవచ్చు జీవాన్ని.
వాళ్లే కాదు మనం కూడా
జీవిస్తాము ఈ వార్తను
చాటిస్తే.
(2 దిన. 36:15; యెష. 61:2; యెహె. 33:6; 2 థెస్స. 1:8 కూడా చూడండి.)