153వ పాట
మీకు సంతోషంగా ఉంటుందా?
-
సంతోషమేస్తుందా?
ప్రకటిస్తే బోధిస్తే,
మనస్ఫూర్తిగా ఉత్సా-
హంగా ప్రయత్నిస్తే?
మీరు కృషి చేస్తే
హృదయాల్లో ఏముందో
తెలిసిన దేవుడు
సహాయం చేస్తాడు.
(పల్లవి)
ఆనందంగా నిరంతరం
మనసుతో, హృదయంతో,
పెదవులతో అర్పిస్తాం
దేవునికి స్తుతి.
-
సంతోషమేస్తుందా?
మీరు చెప్పే మాటల్ని
జీవాన్ని కోరేవాళ్లు
విని ఆలోచిస్తే?
కొందరు ఒద్దన్నా
లేదా తప్పిపోయినా,
మనము దేవునికి
సాక్షులుగా ఉందాం.
(పల్లవి)
ఆనందంగా నిరంతరం
మనసుతో, హృదయంతో,
పెదవులతో అర్పిస్తాం
దేవునికి స్తుతి.
-
సంతోషమేస్తుందా?
దేవుని సహాయంతో
మాతో కలిసి మీరు
పరిచర్య చేస్తే?
ఎంతో గౌరవంగా,
ధైర్యంగా ప్రకటిస్తూ,
అర్హులైనవాళ్లను
వెదుకుతూ ఉందాం.
(పల్లవి)
ఆనందంగా నిరంతరం
మనసుతో, హృదయంతో,
పెదవులతో అర్పిస్తాం
దేవునికి స్తుతి.
(అపొ. 13:48; 1 థెస్స. 2:4; 1 తిమో. 1:11 కూడా చూడండి.)