నా కుమ్మరివై
1. యెహోవా నేనో బంకమట్టి
ఉంది నాలో చెత్తాచెదారం
కోపమే నాకు లోపమైంది
మాటలతోనే నోరు జారుతా
చేతలతో దెబ్బ కొడతా
నీ కంట్లో నీళ్లు తెప్పిస్తాను
(అనుపల్లవి)
దేవా వదిలేయకు
నీ చేతుల్లో నన్ను పెట్టుకో
(పల్లవి)
చేస్తూనేవుండు మార్పులు
దాంతో అవ్వాలి నేను
మట్టిలోని మాణిక్యంలాగా
నీ కళ్లు మెరిసేలా
నీ ముఖం మురిసేలా
మలుస్తూనేవుండు
నా కుమ్మరివై
నా కుమ్మరివై
2. టైం తీసి బైబిల్నే చదువుతా
ప్రార్థనతో నిన్ను చేరుతా
తలొగ్గి నమ్మకంగా ఉంటా
నీ ఓర్పు నేర్పులతోనేగా
సరికొత్తగా మలిచావుగా
కొత్తగా మొదలుపెడతా
(అనుపల్లవి)
దేవా వదిలేయకు
నీ చేతుల్లో నన్ను పెట్టుకో
(పల్లవి)
చేస్తూనేవుండు మార్పులు
దాంతో అవ్వాలి నేను
మట్టిలోని మాణిక్యంలాగా
నీ కళ్లు మెరిసేలా
నీ ముఖం మురిసేలా
మలుస్తూనేవుండు
నా కుమ్మరివై
నా కుమ్మరివై
(ముగింపు చరణం)
మెత్తని మట్టిలా
ఉండేలా నే రోజూ
మలుస్తూనేవుండు
నా కుమ్మరివై
నా కుమ్మరివై