మన క్రైస్తవ జీవితం
నిజంకాని వార్తలను ప్రచారం చేయకండి
ఈ రోజుల్లో సమాచారాన్ని కేవలం క్షణాల్లో లక్షలమందికి చేరవేయవచ్చు. అది పేపరు, పత్రికల ద్వారా కావచ్చు, లేదా రేడియో, టీవీ, ఇంటర్నెట్ ద్వారా కావచ్చు. “సత్య” దేవున్ని ఆరాధించేవాళ్లు కనీసం పొరపాటుగానైనా తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేయాలనుకోరు. (కీర్త 31:5; నిర్గ 23:1) అబద్ధాలు వ్యాప్తి చేయడం వల్ల చాలా హాని జరిగే అవకాశం ఉంది. ఏదైనా సమాచారం నిజమో కాదో నిర్ధారించుకుంటున్నప్పుడు వీటి గురించి ఆలోచించండి:
-
‘ఈ సమాచారం చెప్పినవాళ్లు నమ్మదగినవాళ్లేనా?’ సమాచారం చెప్పేవాళ్లకు నిజాలన్నీ తెలిసుండకపోవచ్చు. ఏదైనా సమాచారాన్ని ఒకరు ఇంకొకరికి చెప్తున్నప్పుడు అందులోని కొన్ని విషయాలు మార్చి చెప్పవచ్చు. కాబట్టి ఆ సమాచారం ఎవరి దగ్గర నుండి వచ్చిందో ఖచ్చితంగా తెలియనప్పుడు జాగ్రత్తగా ఉండండి. సంఘంలో బాధ్యతలు ఉన్నవాళ్లు చెప్పే సమాచారాన్ని అందరూ నమ్ముతారు కాబట్టి, ఏదైనా విషయాన్ని ఇతరులకు చెప్తున్నప్పుడు అది నిజమో కాదు వాళ్లు నిర్ధారించుకోవాలి
-
‘ఈ సమాచారం ఎవరి పేరునైనా పాడు చేస్తుందా?’ అది ఒకరి పేరును లేదా కొంతమంది పేరును పాడు చేస్తుంటే, దాన్ని ఇతరులకు చెప్పకపోవడమే మంచిది.—సామె 18:8; ఫిలి 4:8.
-
‘ఈ సమాచారం నమ్మదగినదేనా?’ సంచలనాత్మకమైన విషయాలను, అనుభవాల్ని వింటున్నప్పుడు జాగ్రత్తగా ఉండండి
నేను పుకార్లను ఎలా ఆపవచ్చు? అనే వీడియో చూసి, ఈ ప్రశ్నలకు జవాబులు చెప్పండి:
-
సామెతలు 12:18 ప్రకారం మాటలు ఎంత హాని చేయగలవు?
-
ఇతరుల గురించి ఏదైనా మాట్లాడే ముందు సరిగ్గా ఆలోచించడానికి ఫిలిప్పీయులు 2:4 ఎలా సహాయం చేస్తుంది?
-
ఇతరుల గురించి ఎవరైనా వెటకారంగా లేదా చెడుగా మాట్లాడితే మనం ఏం చేయాలి?
-
ఇతరుల గురించి ఏదైనా మాట్లాడే ముందు, మనం ఏ ప్రశ్నల గురించి ఆలోచించాలి?