మన క్రైస్తవ జీవితం
యెహోవా ప్రజల మంచి కోసం పాటుపడే కాపరులు
అధికారంలో ఉన్నవాళ్లను చాలామంది నమ్మరు. ఎందుకో మనందరికీ తెలుసు, చరిత్రంతటిలో చాలామంది తమ అధికారాన్ని స్వార్థం కోసమే ఉపయోగించారు. (మీకా 7:3) కానీ యెహోవా ప్రజలకు మంచి చేసేలా తమ అధికారాన్ని ఎలా ఉపయోగించాలో సంఘపెద్దలు శిక్షణ పొందారు. అలాంటి సంఘపెద్దలు ఉన్నందుకు మనం ఎంత కృతజ్ఞులమో కదా!—ఎస్తే 10:3; మత్త 20:25, 26.
సంఘపెద్దలు, లోకంలో ఉన్న అధికారులకు పూర్తి వేరుగా ఉన్నారు. వాళ్లు యెహోవా మీద, ఆయన ప్రజల మీద ప్రేమతోనే పర్యవేక్షకులుగా సేవచేస్తారు. (యోహా 21:16; 1పే 5:1-3) పెద్దలు యేసు నిర్దేశం కింద, ప్రతీ ప్రచారకుడు యెహోవా కుటుంబంలో ఒకరని అనుకునేలా, యెహోవాకు దగ్గరగా ఉండేలా సహాయం చేస్తారు. దేవుని మందను లేఖనాలతో ప్రోత్సహించడానికి, వైద్యపరమైన అత్యవసర పరిస్థితి లేదా విపత్తులు వచ్చినప్పుడు వాళ్లు సహాయం చేయడానికి వెంటనే ముందుకొస్తారు. మీకు సహాయం అవసరమైనప్పుడు, మీ సంఘంలో ఉన్న ఏ పెద్దతోనైనా మాట్లాడడానికి వెనకాడకండి.—యాకో 5:14.
మందను శ్రద్ధగా చూసుకునే కాపరులు వీడియో చూసి, ఈ ప్రశ్నలకు జవాబులు చెప్పండి:
-
పెద్దలు ఇచ్చిన సహాయం నుండి మారియానా ఎలా ప్రయోజనం పొందింది?
-
పెద్దలు ఇచ్చిన సహాయం నుండి ఎలియాస్ ఎలా ప్రయోజనం పొందాడు?
-
ఈ వీడియో చూసిన తర్వాత, సంఘపెద్దలు చేసే పని గురించి మీకేం అనిపిస్తుంది?