కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

దేవుని వాక్యంలో ఉన్న సంపద | ఆదికాండం 42-43

యోసేపు చాలా ఆత్మనిగ్రహం చూపించాడు

యోసేపు చాలా ఆత్మనిగ్రహం చూపించాడు

42:5-7, 14-17, 21, 22

హఠాత్తుగా తన అన్నలు ఎదురుపడినప్పుడు యోసేపుకు ఎలాంటి భావోద్వేగాలు కలిగివుంటాయో మీరు ఊహించగలరా? కావాలనుకుంటే, వెంటనే తానెవరో చెప్పేసి, వాళ్లను హత్తుకోవడమో లేదా వాళ్లమీద పగ తీర్చుకోవడమో చేయవచ్చు. కానీ యోసేపు అలా చేయలేదు, అతను తన భావోద్వేగాల్ని అణచుకున్నాడు. కుటుంబ సభ్యులు లేదా వేరేవాళ్లు మీకు అన్యాయం చేస్తే మీరేం చేస్తారు? మోసకరమైన హృదయానికి, అపరిపూర్ణ భావోద్వేగాలకు లొంగిపోయే బదులు ఆత్మనిగ్రహం చూపించడం, ప్రశాంతంగా ఉండడం ఎంత ప్రాముఖ్యమో యోసేపు ఉదాహరణ నేర్పిస్తుంది.

మీకు ఎదురయ్యే పరిస్థితుల్లో యోసేపులా ఆత్మనిగ్రహాన్ని ఎలా చూపించవచ్చు?