మన క్రైస్తవ జీవితం
‘శరీరంలో ముల్లు’ లాంటి సమస్య ఉన్నా మీరు విజయం సాధించవచ్చు!
కష్టమైన ఈ చివరి రోజుల్లో దేవుని సేవకులందరికీ ముల్లు లాంటి సమస్యలు ఉంటాయి. (2 తిమో 3:1) మనం యెహోవా మీద ఆధారపడుతూ అలాంటి సమస్యల్ని ఎలా తట్టుకోవచ్చు? టలీట అల్నషి, ఆమె తల్లిదండ్రులు ఏంచేశారో తెలుసుకోవడానికి, “గ్రుడ్డివారి కన్నులు తెరవబడును” వీడియో చూడండి. తర్వాత ఈ ప్రశ్నలకు జవాబు చెప్పండి:
-
టలీటకి ‘శరీరంలో ముల్లులా’ ఉన్న సమస్య ఏమిటి?
-
సానుకూల వైఖరి కాపాడుకోవడానికి టలీటకు, ఆమె తల్లిదండ్రులకు ఏ బైబిలు వాగ్దానాలు సహాయం చేశాయి?
-
టలీటకి ఆపరేషన్ అయిన తర్వాత, ఆమె తల్లిదండ్రులు యెహోవా మీద ఆధారపడుతున్నామని ఎలా చూపించారు?
-
టలీటలో దేవుని మీద ప్రేమ నాటడానికి ఆమె తల్లిదండ్రులు సంస్థ ఏర్పాట్లను ఎలా చక్కగా ఉపయోగించుకున్నారు?
-
‘శరీరంలో ముల్లు’ ఉన్నా, తాను ఆధ్యాత్మికంగా ప్రగతి సాధిస్తున్నానని టలీట ఎలా చూపించింది?
-
టలీట అనుభవం మిమ్మల్ని ఎలా ప్రోత్సహించింది?