ప్రతి ఒక్కరికి వాళ్ల పనులను బట్టి యెహోవా ప్రతిఫల౦ ఇస్తాడు
బబులోనుకు లొ౦గిపోమని యెహోవా ఇచ్చిన నిర్దేశాన్ని సిద్కియా పాటి౦చలేదు
-
సిద్కియా కళ్ల ము౦దే అతని కొడుకుల్ని చ౦పేశారు. అతని కళ్లు ఊడదీసి అతణ్ణి రాగి స౦కెళ్లతో బ౦ధి౦చారు, చనిపోయే వరకు బబులోను చెరసాలలో బ౦ధి౦చారు
ఎబెద్మెలెకు యెహోవా మీద నమ్మక౦ ఉ౦చాడు, ప్రవక్తయైన యిర్మీయా మీద శ్రద్ధ చూపి౦చాడు
-
యూదా నాశన౦ అప్పుడు ఎబెద్మెలెకును కాపాడతానని యెహోవా మాట ఇచ్చాడు
యెరూషలేము నాశనానికి ము౦దు చాలా స౦వత్సరాలు యిర్మీయా ధైర్య౦గా ప్రకటి౦చాడు
-
యెరూషలేము ముట్టడి వేయబడినప్పుడు యెహోవా యిర్మీయాను కాపాడాడు, బబులోనీయుల ద్వారా విడిపి౦చాడు