జూన్ 9-15
సామెతలు 17
పాట 157, ప్రార్థన | ఆరంభ మాటలు (1 నిమి.)
1. మీ వివాహ జీవితంలో ప్రశాంతతను ఆనందించండి
(10 నిమి.)
భార్యాభర్తలు గొడవలు పడకుండా కలిసిమెలిసి ఉండాలంటే చాలా కృషి చేయాలి, కానీ అలాచేస్తే జీవితం బాగుంటుంది (సామె 17:1; చిత్రం చూడండి)
చిన్నచిన్న విషయాలకు గొడవలు మొదలుపెట్టకండి (సామె 17:9; g-E 9/14 11 ¶2)
మీ ఫీలింగ్స్‌ని అదుపులో పెట్టుకోండి (సామె 17:14; w08 5/1 10 ¶6–11 ¶1)
2. దేవుని వాక్యంలో రత్నాలు
(10 నిమి.)
-
సామె 17:24—ఈ లేఖనంలో చెప్పిన మూర్ఖునిలా ఉండకూడదంటే మనం ఏం చేయాలి? (w06 9/15 19 ¶10)
-
ఈ వారం చదివిన బైబిలు అధ్యాయంలో మీరు ఏ రత్నాలు కనుక్కున్నారు?
3. చదవాల్సిన బైబిలు భాగం
(4 నిమి.) సామె 17:1-17 (th అధ్యాయం 10)
4. మొదటిసారి మాట్లాడేటప్పుడు
(3 నిమి.) అనియత సాక్ష్యం. (lmd పాఠం 3 పాయింట్ 5)
5. మొదటిసారి మాట్లాడేటప్పుడు
(4 నిమి.) బహిరంగ సాక్ష్యం. బైబిలు స్టడీ గురించి చెప్పండి. (lmd పాఠం 6 పాయింట్ 4)
6. ప్రసంగం
(5 నిమి.) ijwbv ఆర్టికల్ 60—అంశం: సామెతలు 17:17 అర్థమేంటి?(th అధ్యాయం 13)
పాట 113
7. మనసువిప్పి మాట్లాడుకోవడానికి సహాయం చేసే అలవాట్లను పెంచుకోండి
(15 నిమి.) చర్చ.
కుటుంబంలో సంతోషం ఉండాలంటే మనసువిప్పి మాట్లాడుకోవడం చాలా ప్రాముఖ్యం. ఇంట్లో అందరూ ఏదీ దాచకుండా చక్కగా మాట్లాడుకుంటే, తాము అనుకున్నవి కలిసికట్టుగా చేయగలుగుతారు, కష్టాలు వచ్చినప్పుడు ఒకరికొకరు సహాయం చేసుకోగలుగుతారు. (సామె 15:22) కుటుంబంలో అందరూ మనసువిప్పి మాట్లాడుకునేలా మీరేం చేయవచ్చు?
కలిసి సమయం గడపండి. (ద్వితీ 6:6, 7) కుటుంబంలో అందరూ కలిసి ఇంటిపనులు చేసినప్పుడు, మీటింగ్‌కి-ప్రీచింగ్‌కి వెళ్లినప్పుడు, సరదాగా సమయం గడిపినప్పుడు ఒకరి మీద ఒకరికి ఉన్న ప్రేమ, నమ్మకం పెరుగుతాయి. మనసు విప్పి మాట్లాడుకునే అవకాశాలు కూడా దొరుకుతాయి. కొన్నిసార్లు, కుటుంబంలోని ఇతరుల కోసం మీ ఇష్టాలను త్యాగం చేయాల్సి రావచ్చు, కానీ అలాచేస్తే మీ మధ్య బంధాలు బలపడతాయి! (ఫిలి 2:3, 4) మీరు కలిసి గడిపే సమయాన్ని మరింత చక్కగా ఉపయోగించుకోవడానికి మీరేం చేయవచ్చు?—ఎఫె 5:15, 16.
కుటుంబంలో శాంతి ఉండాలంటే ఏం చేయాలి?—మనసువిప్పి మాట్లాడుకోండి అనే వీడియో చూపించండి. తర్వాత ఇలా అడగండి:
-
మీరు ఎప్పుడూ ఫోన్ లేదా టీవీ ముందే కూర్చుంటే కుటుంబంలో ఏం జరిగే అవకాశం ఉంది?
-
మనసు విప్పి మాట్లాడుకోవడం గురించి ఈ వీడియోలో మీరు ఇంకా ఏం నేర్చుకున్నారు?
శ్రద్ధగా వినండి. (యాకో 1:19) తాము చెప్పేవాటిని అమ్మానాన్నలు తప్పుగా అర్థం చేసుకోరు, కోపగించుకోరు అనే నమ్మకం పిల్లల్లో ఉంటే వాళ్లు తమ మనసులో ఉన్నది ఫ్రీగా చెప్పగలుగుతారు. కాబట్టి మిమ్మల్ని కంగారుపెట్టే ఏదైనా విషయాన్ని మీ పిల్లలు చెప్తే, వాళ్లను వెంటనే ఏదోకటి అనేయకండి. (సామె 17:27) బదులుగా, వాళ్ల మనసును అర్థం చేసుకుంటూ జాగ్రత్తగా వినండి. వాళ్ల ఫీలింగ్స్‌ని, ఆలోచనల్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. అప్పుడు ప్రేమతో వాళ్లకు సహాయం చేయగలుగుతారు, ధైర్యం చెప్పగలుగుతారు.
8. సంఘ బైబిలు అధ్యయనం
(30 నిమి.) bt 27వ అధ్యాయంలో 19-22 పేరాలు, 212వ పేజీ బాక్సు