మన క్రైస్తవ జీవితం
కుటుంబంలో ప్రేమ చూపించండి
కుటుంబంలో ఉన్న ప్రతీఒక్కరిని ప్రేమ దగ్గర చేస్తుంది. ప్రేమ లేకపోతే ఒకరినొకరు పట్టించుకోకుండా ఎవరి పని వాళ్లు చూసుకుంటారు. భర్త, భార్య, తల్లిదండ్రులు కుటుంబంలో ప్రేమను ఎలా చూపించవచ్చు?
ప్రేమగల భర్త తన భార్య అవసరాలను, భావాలను పట్టించుకుంటాడు; ఆమె అభిప్రాయాలను గౌరవిస్తాడు. (ఎఫె 5:28, 29) ఆయన తన కుటుంబ సభ్యుల అవసరాలు తీరుస్తాడు. వాళ్లు యెహోవాకు దగ్గరవడానికి సహాయం చేస్తాడు, ప్రతీవారం కుటుంబ ఆరాధన చేస్తాడు. (1తి 5:8) ప్రేమగల భార్య తన భర్తకు లోబడి ఉంటుంది. ఆయనకు “ప్రగాఢ గౌరవం” చూపిస్తుంది. (ఎఫె 5:22, 33; 1పే 3:1-6) భార్యాభర్తలు ఒకరినొకరు క్షమించుకోవడానికి సిద్ధంగా ఉండాలి. (ఎఫె 4:32) ప్రేమగల తల్లిదండ్రులు తమ పిల్లల్లో ప్రతి ఒక్కరి మీద శ్రద్ధ చూపిస్తారు. యెహోవాను ప్రేమించడం వాళ్లకు నేర్పిస్తారు. (ద్వితీ 6:6, 7; ఎఫె 6:4) తమ పిల్లలు స్కూల్లో ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారో, వాళ్లు తోటివాళ్ల ఒత్తిడిని ఎలా తట్టుకుంటున్నారో తెలుసుకుంటారు. కుటుంబంలో ప్రేమ ఉన్నప్పుడు తాము భద్రంగా, సురక్షితంగా ఉన్నామనే భావన కుటుంబ సభ్యులందరిలో కలుగుతుంది.
కుటుంబంలో ప్రేమ చూపిస్తూ ఉండండి వీడియో చూడండి, తర్వాత ఈ ప్రశ్నలకు జవాబు చెప్పండి:
-
ప్రేమగల భర్త తన భార్య అవసరాలను తీర్చడానికి, ఆమెను సంతోషంగా ఉంచడానికి ఏం చేస్తాడు?
-
ప్రేమగల భార్య తన భర్త పట్ల ప్రగాఢ గౌరవం ఎలా చూపిస్తుంది?
-
ప్రేమగల తల్లిదండ్రులు తమ పిల్లల హృదయాల్లో దేవుని వాక్యాన్ని ఎలా నాటుతారు?