ప్రైవసీ సెటింగ్స్

మీరు వెబ్‌సైట్‌ని మెరుగ్గా ఉపయోగించగలిగేలా సహాయం చేయడానికి మేము కుకీస్‌ని, అలాంటి ఇతర టెక్నాలజీల్ని వాడతాం. మా వెబ్‌సైట్‌ పని చేయాలంటే కొన్ని కుకీస్‌ తప్పనిసరిగా కావాలి, వాటిని మీరు తిరస్కరించలేరు. అయితే, వెబ్‌సైట్‌ని ఇంకా బాగా తీర్చిదిద్దడానికి మాత్రమే వాడే అదనపు కుకీస్‌ ఉంటాయి. వాటిని మీరు అంగీకరించవచ్చు లేదా తిరస్కరించవచ్చు. ఆ సమాచారంలో దేన్నీ మేము అమ్మం లేదా మార్కెటింగ్‌ కోసం ఉపయోగించం. దీని గురించి ఎక్కువ తెలుసుకోవడానికి కుకీస్, అలాంటి ఇతర టెక్నాలజీల ఉపయోగం విషయంలో గ్లోబల్ పాలసీ చదవండి. ప్రైవసీ సెటింగ్స్‌కి వెళ్లి మీరు ఎప్పుడైనా మీ సెటింగ్స్‌ని మార్చుకోవచ్చు.

కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

యెహోవాసాక్షులు దేవుడు చెబుతున్న మ౦చివార్త! బ్రోషురులోని విషయాలు చెప్తు౦డగా దాన్ని వి౦టున్న ఒక మహిళ

మన క్రైస్తవ జీవిత౦

బైబిలు సాహిత్యాలను తెలివిగా ఉపయోగి౦చ౦డి

బైబిలు సాహిత్యాలను తెలివిగా ఉపయోగి౦చ౦డి

యేసు “ఉచితముగా పొ౦దితిరి ఉచితముగా ఇయ్యుడి” అని నేర్పి౦చాడు. (మత్త 10:8) మన౦ ఆ స్పష్టమైన నియమానికి కట్టుబడి బైబిళ్లను, బైబిలు సాహిత్యాలను ఎవ్వరికీ అమ్మము. (2 కొరి౦ 2:17) ప్రచురణల్లో దేవుని వాక్య౦ ను౦డి తీసుకున్న అమూల్యమైన సత్యాలు ఉ౦టాయి. ఎ౦తో శ్రమతో, ఖర్చుతో వాటిని ప్రి౦ట్‌ చేసి ప్రప౦చవ్యాప్త౦గా ఉన్న స౦ఘాలకు ప౦పిస్తారు. కాబట్టి మనకు ఏమి అవసరమో వాటినే మన౦ తీసుకోవాలి.

సాహిత్యాన్ని ఇస్తున్నప్పుడు, బహిర౦గ పరిచర్యలో ఉన్నా కూడా మన౦ జాగ్రత్తగా ఆలోచి౦చాలి. (మత్త. 7:6) ప్రక్కన వెళ్లే వాళ్ల చేతిలో ఊరికే ఒక సాహిత్యాన్ని పెట్టే బదులు, వాళ్లకు ఆసక్తి ఉ౦దో లేదో తెలుసుకునే౦దుకు వాళ్లతో మాట్లాడడానికి ప్రయత్ని౦చ౦డి. కానీ ఒకవేళ ఎవరైనా ఫలానా ప్రచురణ కావాలని అడిగితే మన౦ వాళ్లకు స౦తోష౦గా దానిని ఇస్తా౦.—సామె 3:27, 28.