కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

మన క్రైస్తవ జీవితం

పరిచర్యలో నైపుణ్యాలు మెరుగుపర్చుకుందాం​—⁠టెలిఫోన్‌ ద్వారా సాక్ష్యమివ్వడం

పరిచర్యలో నైపుణ్యాలు మెరుగుపర్చుకుందాం​—⁠టెలిఫోన్‌ ద్వారా సాక్ష్యమివ్వడం

ఎందుకు ప్రాముఖ్యం: “మంచివార్త గురించి పూర్తిస్థాయిలో” సాక్ష్యమివ్వడానికి టెలిఫోన్‌ సాక్ష్యం చక్కగా ఉపయోగపడుతుంది. (అపొ 20:24) * పరిస్థితుల వల్ల మనం ప్రజల్ని నేరుగా కలిసి ప్రకటించలేనప్పుడు, ఈ పద్ధతి సహాయపడుతుంది.

ఎలా చేయాలి:

  • సిద్ధపడండి. సరైన అంశాన్ని ఎంచుకోండి. మీరేం మాట్లాడాలని అనుకుంటున్నారో క్లుప్తంగా రాసుకోండి. కొన్నిసార్లు వాయిస్‌ మెసేజ్‌ ఇవ్వాల్సి రావచ్చు కాబట్టి, మీరు ఫోన్‌ చేయడానికి గల ఉద్దేశాన్ని వివరిస్తూ చిన్న సందేశాన్ని తయారుచేసి పెట్టుకోండి. మీరు కూర్చున్న టేబుల్‌ దగ్గర వీటిని ఉంచుకోవడం, అలాగే ఎలక్ట్రానిక్‌ పరికరాల్లో JW లైబ్రరీ లేదా jw.org వంటి వాటిని తెరిచి పెట్టుకోవడం ఉపయోగకరంగా ఉంటుంది

  • ప్రశాంతంగా ఉండండి. సహజంగా మాట్లాడండి. మీ చిరునవ్వు, హావభావాలు ఎదురుగా ఉన్న వ్యక్తితో మాట్లాడుతున్నట్లు ఉండాలి. తడబడుతున్నట్లు మాట్లాడకండి. మీ పక్కన ఇంకో ప్రచారకుడిని ఉంచుకోవడం సహాయకరంగా ఉంటుంది. ఇంటివ్యక్తి ఏదైనా ప్రశ్న అడిగితే, ఆ ప్రశ్నను బిగ్గరగా బయటికి చెప్పండి. అలా చేస్తే, దానికి జవాబును వెతకడానికి మీతోపాటు ఉన్న ప్రచారకుడు సహాయం చేయగలుగుతాడు

  • రిటన్‌ విజిట్‌కు ఏర్పాటు చేసుకోండి. ఇంటివ్యక్తి ఆసక్తి చూపిస్తే ఒక ప్రశ్న వేసి, ఇంకోసారి ఫోన్‌ చేసినప్పుడు దానికి జవాబు ఇస్తామని చెప్పండి. ఏదైనా ప్రచురణను ఈ-మెయిల్‌ ద్వారా గానీ, వేరొకరితో గానీ పంపిస్తామని లేదా మీరే స్వయంగా కలిసి ఇస్తామని చెప్పవచ్చు. అంతేకాదు మీరు ఏదైనా వీడియోను గానీ, ఆర్టికల్‌ను గానీ మెసేజ్‌ లేదా ఈ-మెయిల్‌ చేయవచ్చు. పరిస్థితి అనుకూలిస్తే, మన వెబ్‌సైట్‌లో ఉన్న దేని గురించైనా చెప్పండి

^ పేరా 3 మీ ప్రాంతంలో టెలిఫోన్‌ సాక్ష్యం చేయడానికి అనుమతి ఉంటే, వ్యక్తిగత సమాచారానికి సంబంధించిన నియమాలను పాటించాలి.