కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

మన క్రైస్తవ జీవితం

“ఉన్నవాటితో సంతృప్తిగా జీవించండి”

“ఉన్నవాటితో సంతృప్తిగా జీవించండి”

మన దగ్గర ఎక్కువ డబ్బులు లేకపోతే, రాజీపడిపోయే పరిస్థితులు రావచ్చు. అప్పుడు యెహోవాతో మనకున్న స్నేహాన్ని పాడుచేసుకునే ప్రమాదం ఉంది. ఉదాహరణకు, యెహోవా సేవను పణంగా పెట్టి ఎక్కువ డబ్బు సంపాదించే అవకాశం మనకు రావచ్చు. అలాంటప్పుడు, హెబ్రీయులు 13:5 గురించి ధ్యానించడం మనకు సహాయం చేస్తుంది.

“డబ్బును ప్రేమించకండి”

  • ప్రార్థన చేసుకుని, మీరు డబ్బుకు ఎంత విలువ ఇస్తున్నారో చూసుకోండి, అలాగే మీ పిల్లలకు ఎలాంటి ఆదర్శం ఉంచుతున్నారో ఆలోచించండి.—g 10/15 6వ పేజీ.

“ఉన్నవాటితో సంతృప్తిగా జీవించండి”

“నిన్ను ఎప్పుడూ విడిచిపెట్టను, నిన్ను ఎన్నడూ వదిలేయను”

  • రాజ్యానికి మొదటి స్థానం ఇస్తూ ఉంటే, మీ కనీస అవసరాలు తీర్చుకోవడానికి యెహోవా సహాయం చేస్తాడని నమ్మండి. —w14 4/15 21వ పేజీ, 17వ పేరా.

మన సహోదరులు శాంతిగా ఉన్నారు ... ఆర్థిక ఇబ్బందులు ఉన్నా  అనే వీడియో చూసి, ఈ ప్రశ్నకు జవాబు చెప్పండి:

మిగ్వెల్‌ నోవా అనుభవం నుండి మీరు ఏం నేర్చుకున్నారు?