మన క్రైస్తవ జీవితం
తల్లిదండ్రులారా, దేవుణ్ణి ఎలా సంతోషపెట్టాలో మీ పిల్లలకు నేర్పించండి
యెహోవా పిల్లల్ని చాలా అమూల్యంగా చూస్తాడు. వాళ్ల ఆధ్యాత్మిక ఎదుగుదలను, సహనాన్ని ఆయన గమనిస్తాడు. (1స 2:26; లూకా 2:52) వాళ్లు చిన్న పిల్లలైనా సరే, తమ మంచి ప్రవర్తన ద్వారా యెహోవా హృదయాన్ని సంతోషపెట్టవచ్చు. (సామె 27:11) యెహోవా తన సంస్థ ద్వారా చక్కని పనిముట్లు ఇచ్చాడు. వాటి సహాయంతో, తల్లిదండ్రులు తమ పిల్లలకు యెహోవాను ప్రేమించడం, ఆయనకు లోబడడం నేర్పించవచ్చు.
పిల్లలారా—మీరు పట్టువిడవకుండా ముందుకు సాగితే యెహోవా సంతోషిస్తాడు! అనే వీడియో చూసి, ఈ ప్రశ్నలకు జవాబులు చెప్పండి:
-
యెహోవా గత కొన్ని సంవత్సరాలుగా పిల్లలకు ఎలా సహాయాన్ని, నిర్దేశాన్ని ఇచ్చాడు?
-
తల్లిదండ్రులకు సహాయం చేయడానికి ఇప్పుడు ఏ పనిముట్లు అందుబాటులో ఉన్నాయి?
-
మీరు పిల్లలైతే, యెహోవా ఇచ్చిన ఏ బహుమతి మీకు బాగా ఉపయోగపడింది? ఎందుకు?