“మీరు చాలా పిచ్చుకల కన్నా విలువైనవాళ్లు”
లూకా 12:6, 7 లో ఉన్న మాటలను యేసు ఏ సందర్భంగా చెప్పాడు? వాళ్లను వ్యతిరేకించే వాళ్లకు లేదా చంపాలని చూసేవాళ్లకు కూడా భయపడవద్దని యేసు తన అనుచరులకు చెప్పినట్లు మనం 4వ వచనంలో చదువుతాము. తర్వాత వాళ్లు ఎదుర్కోబోయే వ్యతిరేకతకు యేసు తన శిష్యులను సిద్ధం చేస్తున్నాడు. యెహోవా తన సేవకుల్లో ప్రతి ఒక్కరిని విలువైనవాళ్లుగా చూస్తాడనే భరోసాను, ఆయన వాళ్లకు ఏ శాశ్వత హాని రానివ్వడనే భరోసాను యేసు ఇచ్చాడు.
హింసించబడుతున్న వాళ్ల విషయంలో యెహోవాకున్న శ్రద్ధను మనం ఎలా అనుకరించవచ్చు?
విశ్వాసం వల్ల జైళ్లలో వేయబడిన యెహోవాసాక్షుల గురించి అప్‌డేట్ అయిన సమాచారాన్ని మనం ఎక్కడ చూడవచ్చు?
ఇప్పుడు ఎంతమంది సహోదరులు, సహోదరీలు జైళ్లలో ఉన్నారు?