జూలై 14-20
సామెతలు 22
పాట 79, ప్రార్థన | ఆరంభ మాటలు (1 నిమి.)
1. పిల్లల్ని పెంచడానికి తెలివైన సలహాలు
(10 నిమి.)
జీవితంలో వచ్చే సవాళ్ల కోసం మీ పిల్లల్ని సిద్ధం చేయండి (సామె 22:3; w20.10 27 ¶7)
పసితనంలోనే శిక్షణ ఇవ్వడం మొదలుపెట్టండి (సామె 22:6; w19.12 26 ¶17-19)
ప్రేమతోనే క్రమశిక్షణ ఇవ్వండి (సామె 22:15; w06 4/1 9 ¶5)
2. దేవుని వాక్యంలో రత్నాలు
(10 నిమి.)
-
సామె 22:29—ఈ సామెతను మనం సంఘంలో ఎలా పాటించవచ్చు? దాన్నుండి వచ్చే ప్రయోజనాలు ఏంటి? (w21.08 22 ¶11)
-
ఈ వారం చదివిన బైబిలు అధ్యాయంలో మీరు ఏ రత్నాలు కనుక్కున్నారు?
3. చదవాల్సిన బైబిలు భాగం
(4 నిమి.) సామె 22:1-19 (th అధ్యాయం 10)
4. మొదటిసారి మాట్లాడేటప్పుడు
(3 నిమి.) ఇంటింటి పరిచర్య. (lmd పాఠం 5 పాయింట్ 4)
5. మొదటిసారి మాట్లాడేటప్పుడు
(4 నిమి.) అనియత సాక్ష్యం. jw.org వెబ్‌సైట్‌లో తల్లిదండ్రులకు సహాయపడే సమాచారాన్ని ఎలా వెదకాలో చూపించండి. (lmd పాఠం 1 పాయింట్ 4)
6. ప్రసంగం
(5 నిమి.) ijwyp ఆర్టికల్ 100—అంశం: మమ్మీడాడీ పెట్టిన రూల్‌ని బ్రేక్ చేశాను—ఇప్పుడెలా? (th అధ్యాయం 20)
పాట 134
7. ఓపిక చూపించండి, కానీ చూసీచూడనట్టు వదిలేయకండి
(15 నిమి.) చర్చ.
పిల్లల్ని పెంచాలంటే చాలా ఓపిక కావాలి. తల్లిదండ్రులు తమ పిల్లల జీవితంలో ఏం జరుగుతుందో పట్టించుకోవాలి, వాళ్లతో క్రమంగా సమయం గడపాలి, ఆ టైంలో వేరే పనులు పెట్టుకోకూడదు. (ద్వితీ 6:6, 7) పిల్లల మనసులో ఏముందో తెలుసుకోవడానికి, తల్లిదండ్రులు ప్రశ్నలు అడగాలి, వాళ్లు ఇచ్చే జవాబుల్ని శ్రద్ధగా వినాలి. (సామె 20:5) అంతేకాదు, పిల్లలు ఏదైనా ఒక విషయాన్ని అర్థం చేసుకుని పాటించాలంటే, తల్లిదండ్రులు దాని గురించి వాళ్లకు మళ్లీమళ్లీ చెప్పాల్సిరావచ్చు.
తల్లిదండ్రులు ఓపిక చూపించాలి, కానీ పిల్లలు ఏదైనా తప్పు చేస్తే దాన్ని చూసీచూడనట్టు వదిలేయకూడదు. పిల్లలకు రూల్స్ పెట్టే అధికారాన్ని యెహోవా తల్లిదండ్రులకు ఇచ్చాడు, పిల్లలు మాట వినకపోతే వాళ్లకు క్రమశిక్షణ ఇవ్వమని కూడా చెప్పాడు.—సామె 6:20; 23:13.
ఎఫెసీయులు 4:31 చదవండి. తర్వాత ఇలా అడగండి:
-
తల్లిదండ్రులు తాము కోపంగా ఉన్నప్పుడు పిల్లలకు ఎందుకు క్రమశిక్షణ ఇవ్వకూడదు?
గలతీయులు 6:7 చదవండి. తర్వాత ఇలా అడగండి:
-
తప్పు చేస్తే తిప్పలు తప్పవని పిల్లలకు తల్లిదండ్రులు చెప్పడం ఎందుకు ప్రాముఖ్యం?
‘ఓర్పు చూపిస్తూ, ప్రేమతో ఒకరినొకరు భరించుకుంటూ ఉండండి’—మీ పిల్లలు అనే వీడియో చూపించి, ఇలా అడగండి:
-
వీడియో నుండి మీరేం పాఠాలు నేర్చుకున్నారు?
8. సంఘ బైబిలు అధ్యయనం
(30 నిమి.) lfb “పరిపాలక సభ నుండి ఉత్తరం,” 1వ సెక్షన్‌కు పరిచయం, లెసన్ 1