చక్కగా సువార్త ప్రకటిద్దాం | శిష్యుల్ని చేసే పనిలో ఆనందం పొందండి
హృదయాన్ని చేరుకునేలా మాట్లాడండి
దేవునికి లోబడాలనే కోరిక హృదయంలో నుండి రావాలి. (సామె 3:1) కాబట్టి మనం చెప్పే విషయాలు వినేవాళ్ల హృదయాలను చేరుకునేలా బోధించాలి. అదెలా చేయవచ్చు?
మీ విద్యార్థికి బైబిలు సత్యాలు బోధించడమే కాదు. నేర్చుకున్న విషయాలు వాళ్ల జీవితాలను ఎలా మెరుగుపర్చగలవో, యెహోవాతో ఉన్న సంబంధాన్ని ఎలా బలపర్చగలవో అర్థం చేసుకునేలా సహాయం చేయండి. బైబిలు ప్రమాణాలు దేవుని ప్రేమను, మంచితనాన్ని, నీతిని ఎలా వివరిస్తాయో కూడా గ్రహించేలా సహాయం చేయండి. నేర్చుకుంటున్న విషయాలపై వాళ్ల అభిప్రాయం తెలుసుకోవడానికి నేర్పుగా, గౌరవపూర్వకంగా ప్రశ్నలు వేయండి. ఏదైనా చెడు ఆలోచనను లేదా అలవాటును మార్చుకుంటే వాళ్ల జీవితం ఎంత బాగుంటుందో అర్థం చేసుకోవడానికి సహాయం చేయండి. మీ విద్యార్థి యెహోవాను హృదయపూర్వకంగా ప్రేమించినప్పుడు, మీ ఆనందం రెట్టింపు అవుతుంది.
శిష్యుల్ని చేసే పనిలో ఆనందం పొందండి—మీ నైపుణ్యాల్ని మెరుగుపర్చుకోండి—హృదయాన్ని చేరుకునేలా మాట్లాడడం వీడియో చూడండి, తర్వాత ఈ ప్రశ్నలకు జవాబు చెప్పండి:
-
“సోమవారం మాట్లాడుకున్న దాని గురించి ఆలోచించావా” అని నీతా జాస్మిన్‌ను ఎందుకు అడిగింది?
-
బైబిలు ప్రమాణాలు యెహోవా ప్రేమతో ఇచ్చాడని జాస్మిన్ అర్థం చేసుకోవడానికి నీతా ఎలా సహాయం చేసింది?
-
దేవునిపై ఉన్న ప్రేమను చూపించడానికి జాస్మిన్‌కు నీతా ఎలా సహాయం చేసింది?