మన క్రైస్తవ జీవితం
మీ నమ్మకాల్ని ఇతరులకు వివరించగలరా?
‘దేవుడే అన్నిటినీ సృష్టించాడని మీరెందుకు నమ్ముతున్నారు’ అని ఎవరైనా మిమ్మల్ని అడిగితే, ఏం చెప్తారు? వాళ్లకు ధైర్యంగా జవాబు చెప్పాలంటే మీరు రెండు పనులు చేయాలి. మొదటిగా, దేవుడే అన్నిటిని సృష్టించాడన్నది నిజమని మీకైమీరు పరీక్షించి తెలుసుకోవాలి. (రోమా 12:1, 2) రెండవదిగా, మీ నమ్మకాల గురించి ఇతరులకు ఎలా వివరించాలో ఆలోచించాలి.—సామె 15:28.
కీళ్ల-ఎముకల శస్త్రవైద్యురాలు ఆమె నమ్మకాల గురించి వివరిస్తుంది, అలాగే ఒక జీవశాస్త్రవేత్త తన నమ్మకాల గురించి వివరిస్తున్నాడు అనే రెండు వీడియోలు చూసి, దేవుడే అన్నిటినీ సృష్టించాడని ఇతరులు ఎందుకు నమ్ముతున్నారో తెలుసుకోండి. దాని తర్వాత కిందున్న ఈ ప్రశ్నలకు జవాబులు చెప్పండి:
-
ఈరన్ హోఫ్ లొరన్‌సొ పరిణామ సిద్ధాంతాన్ని కాకుండా, దేవుడే అన్నిటినీ సృష్టించాడని ఎందుకు నమ్ముతుంది?
-
యారోస్లావ్ డోవనిచ్ పరిణామ సిద్ధాంతాన్ని కాకుండా, దేవుడే అన్నిటినీ సృష్టించాడని ఎందుకు నమ్ముతున్నాడు?
-
దేవుడే అన్నిటినీ సృష్టించాడని మీరెలా వివరిస్తారు?
-
దేవుడే సమస్తాన్ని సృష్టించాడని మీకైమీరు పరీక్షించి తెలుసుకోవడానికి, అలాగే ఇతరులకు వివరించడానికి యెహోవా సంస్థ అందిస్తున్న ఏ ప్రచురణలు, వీడియోలు మీ భాషలో ఉన్నాయి?