కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

దేవుని వాక్యంలో ఉన్న సంపద | ఆదికాండము 3-5

నాశనకరమైన పర్యవసానాలకు దారితీసిన మొట్టమొదటి అబద్ధం

నాశనకరమైన పర్యవసానాలకు దారితీసిన మొట్టమొదటి అబద్ధం

3:1-6, 15-19

సాతాను హవ్వతో అబద్ధం చెప్పినప్పటి నుండి మనుషులను మోసం చేస్తూనే ఉన్నాడు. (ప్రక 12:9) సాతాను వ్యాప్తిచేసే ఈ అబద్ధాలు ప్రజల్ని యెహోవాకు దగ్గరవ్వకుండా ఎలా అడ్డుకుంటున్నాయి?

  • అసలు దేవుడే లేడు

  • దేవుడు అంతుచిక్కని త్రిత్వం

  • దేవునికి పేరు లేదు

  • దేవుడు మనుషుల్ని నరకంలో నిరంతరం చిత్రహింసలు పెడతాడు

  • ఏం జరిగినా అది దేవుని నిర్ణయమే

  • దేవుడు మనుషుల్ని పట్టించుకోడు

దేవుని గురించి ఇలాంటి అబద్ధాల్ని వింటుంటే మీకెలా అనిపిస్తుంది?

సాతాను చెప్తున్నవన్నీ అబద్ధాలని మీరెలా నిరూపిస్తారు?