దినవృత్తాంతాలు మొదటి గ్రంథం 2:1-55
2 ఇశ్రాయేలు కుమారులు: రూబేను,+ షిమ్యోను, లేవి,+ యూదా,+ ఇశ్శాఖారు,+ జెబూలూను,+
2 దాను,+ యోసేపు,+ బెన్యామీను,+ నఫ్తాలి,+ గాదు,+ ఆషేరు.+
3 యూదా కుమారులు: ఏరు, ఓనాను, షేలహు. వీళ్లు షూయ కూతురు ద్వారా యూదాకు పుట్టారు, ఆమె కనానీయురాలు.+ యూదా పెద్ద కుమారుడైన ఏరు యెహోవా దృష్టిలో చెడుగా ప్రవర్తించాడు కాబట్టి ఆయన అతన్ని చంపాడు.
4 యూదా కోడలు తామారు యూదాకు పెరెసును,+ జెరహును కన్నది. యూదాకు మొత్తం ఐదుగురు కుమారులు.
5 పెరెసు కుమారులు: ఎస్రోను, హామూలు.
6 జెరహు కుమారులు: జిమ్రీ, ఏతాను, హేమాను, కల్కోలు, దార. మొత్తం ఐదుగురు.
7 కర్మీ కుమారుడు* ఆకారు;* ఇతను, నాశనం చేయబడాల్సినవాటి విషయంలో నమ్మకద్రోహానికి పాల్పడి ఇశ్రాయేలీయుల మీదికి విపత్తు* తీసుకొచ్చాడు.+
8 ఏతాను కుమారుడు* అజర్యా.
9 ఎస్రోను కుమారులు: యెరహ్మెయేలు, రాము,+ కెలూబై.*
10 రాము అమ్మీనాదాబును కన్నాడు. అమ్మీనాదాబు నయస్సోనును కన్నాడు. నయస్సోను+ యూదా వంశస్థులకు ప్రధానుడు.
11 నయస్సోను శల్మాను కన్నాడు.+ శల్మా బోయజును కన్నాడు.
12 బోయజు ఓబేదును కన్నాడు. ఓబేదు యెష్షయిని+ కన్నాడు.
13 యెష్షయి తన పెద్ద కుమారుడు ఏలీయాబును, రెండో కుమారుడు అబీనాదాబును, మూడో కుమారుడు షిమ్యాను,+
14 నాలుగో కుమారుడు నెతనేలును, ఐదో కుమారుడు రద్దయిని,
15 ఆరో కుమారుడు ఓజెమును, ఏడో కుమారుడు దావీదును+ కన్నాడు.
16 వాళ్ల సహోదరీలు సెరూయా, అబీగయీలు.+ సెరూయా ముగ్గురు కుమారుల పేర్లు అబీషై,+ యోవాబు,+ అశాహేలు.+
17 అబీగయీలు అమాశాను+ కన్నది. అమాశా తండ్రి ఇష్మాయేలీయుడైన యెతెరు.
18 ఎస్రోను కుమారుడైన కాలేబు* తన భార్య అజూబా ద్వారా, యెరీయోతు ద్వారా యేషెరును, షోబాబును, అర్దోనును కన్నాడు.
19 అజూబా చనిపోయిన తర్వాత కాలేబు ఎఫ్రాత్‌ను+ పెళ్లి చేసుకున్నాడు; ఆమె అతనికి హూరును+ కన్నది.
20 హూరు ఊరిని కన్నాడు. ఊరి బెసలేలును+ కన్నాడు.
21 తర్వాత ఎస్రోను, గిలాదు తండ్రైన మాకీరు+ కూతుర్ని పెళ్లి చేసుకుని ఆమెతో కలిశాడు. అప్పుడు అతనికి 60 ఏళ్లు. ఆమె అతనికి సెగూబును కన్నది.
22 సెగూబు యాయీరును+ కన్నాడు; యాయీరుకు గిలాదు ప్రాంతంలో+ 23 నగరాలు ఉండేవి.
23 తర్వాత గెషూరువాళ్లు,+ సిరియావాళ్లు+ వీళ్ల దగ్గర నుండి హవోత్-యాయీరును,+ కెనాతును,+ దాని చుట్టుపక్కల పట్టణాల్ని, అలా మొత్తం 60 నగరాల్ని తీసుకున్నారు. వీళ్లందరూ గిలాదు తండ్రైన మాకీరు వంశస్థులు.
24 కాలేబు-ఎఫ్రాతాలో ఎస్రోను+ చనిపోయిన తర్వాత, ఎస్రోను భార్య అబీయా అతనికి అష్షూరును+ కన్నది. అష్షూరు తెకోవకు+ తండ్రి.*
25 ఎస్రోను మొదటి కుమారుడైన యెరహ్మెయేలు కుమారులు: మొదటి కుమారుడైన రాము అలాగే బూనా, ఓరెను, ఓజెము, అహీయా.
26 యెరహ్మెయేలుకు ఇంకో భార్య ఉండేది, ఆమె పేరు అటారా. ఆమె ఓనాముకు తల్లి.
27 యెరహ్మెయేలు మొదటి కుమారుడైన రాము కుమారులు: మయజు, యామీను, ఏకెరు.
28 ఓనాము కుమారులు: షమ్మయి, యాదా. షమ్మయి కుమారులు: నాదాబు, అబీషూరు.
29 అబీషూరు భార్య పేరు అబీహాయిలు; ఆమె అతనికి అహ్బానును, మొలీదును కన్నది.
30 నాదాబు కుమారులు: సెలెదు, అప్పయీము. అయితే సెలెదు పిల్లలు లేకుండా చనిపోయాడు.
31 అప్పయీము కుమారుడు* ఇషీ. ఇషీ కుమారుడు* షేషాను, షేషాను కుమారుడు* అహ్లయి.
32 షమ్మయి సహోదరుడైన యాదా కుమారులు: యెతెరు, యోనాతాను. అయితే యెతెరు పిల్లలు లేకుండా చనిపోయాడు.
33 యోనాతాను కుమారులు: పేలెతు, జాజా. వీళ్లు యెరహ్మెయేలు వంశస్థులు.
34 షేషానుకు కూతుళ్లే గానీ కుమారులు లేరు. షేషానుకు యర్హా అనే సేవకుడు ఉన్నాడు, అతను ఐగుప్తీయుడు.
35 షేషాను తన సేవకుడైన యర్హాకు తన కూతుర్ని ఇచ్చి పెళ్లిచేశాడు. ఆమె అతనికి అత్తయిని కన్నది.
36 అత్తయి నాతానును కన్నాడు. నాతాను జాబాదును కన్నాడు.
37 జాబాదు ఎప్లాలును కన్నాడు. ఎప్లాలు ఓబేదును కన్నాడు.
38 ఓబేదు యెహూను కన్నాడు. యెహూ అజర్యాను కన్నాడు.
39 అజర్యా హేలెస్సును కన్నాడు. హేలెస్సు ఎలాశాను కన్నాడు.
40 ఎలాశా సిస్మాయీని కన్నాడు. సిస్మాయీ షల్లూమును కన్నాడు.
41 షల్లూము యెకమ్యాను కన్నాడు. యెకమ్యా ఎలీషామాను కన్నాడు.
42 యెరహ్మెయేలు సహోదరుడైన కాలేబు*+ కుమారులు: జీఫుకు తండ్రైన మేషా కాలేబు మొదటి కుమారుడు; అలాగే హెబ్రోనుకు తండ్రైన మారేషా కుమారులు.
43 హెబ్రోను కుమారులు: కోరహు, తప్పూయ, రేకెము, షెమ.
44 షెమ యోర్కెయాము తండ్రైన రహమును కన్నాడు. రేకెము షమ్మయిని కన్నాడు.
45 షమ్మయి కుమారుడు మాయోను. మాయోను బేత్సూరుకు+ తండ్రి.
46 కాలేబు ఉపపత్ని అయిన ఏయిఫా హారానును, మోజాను, గాజేజును కన్నది. హారాను గాజేజును కన్నాడు.
47 యెహ్దయి కుమారులు: రెగెము, యోతాము, గేషాను, పెలెటు, ఏయిఫా, షయపు.
48 కాలేబు ఉపపత్ని మయకా షెబెరును, తిర్హనాను కన్నది.
49 కొంతకాలం తర్వాత ఆమె షయపును కన్నది. షయపు మద్మన్నాకు+ తండ్రి; ఆమె షెవాను కూడా కన్నది. షెవా మక్బేనాకు, గిబ్యాకు+ తండ్రి. కాలేబు కూతురి పేరు అక్సా.+
50 వీళ్లు కాలేబు వంశస్థులు.
ఎఫ్రాతా+ మొదటి కుమారుడైన హూరు+ కుమారులు: కిర్యత్యారీము+ తండ్రైన శోబాలు,
51 బేత్లెహేము+ తండ్రైన శల్మా, బేత్గాదేరు తండ్రైన హారేపు.
52 కిర్యత్యారీము తండ్రైన శోబాలు కుమారులు: హారోయే, మనుహోతు ప్రజల్లో సగంమంది.
53 కిర్యత్యారీము కుటుంబాలు ఇవి: ఇత్రీయులు,+ పూతీయులు, షుమ్మాతీయులు, మిష్రాయీయులు. వాళ్ల నుండే సొరాతీయులు,+ ఎష్తాయులీయులు+ వచ్చారు.
54 శల్మా కుమారులు: బేత్లెహేము వాళ్లు,+ నెటోపాతీయులు, అతారోతు-బేత్-యోవాబు వాళ్లు, మానహతు వాళ్లలో సగంమంది, జారీయులు.
55 యబ్బేజులోని శాస్త్రుల కుటుంబాలు ఇవి: తిరాతీయులు, షిమ్యాతీయులు, శూకోతీయులు. వీళ్లు కేనీయులు,+ రేకాబు ఇంటివాళ్లకు+ తండ్రైన హమాతు వంశస్థులు.
అధస్సూచీలు
^ అక్ష., “కుమారులు.”
^ “విపత్తు తీసుకొచ్చేవాడు; కష్టం తీసుకొచ్చేవాడు” అని అర్థం. యెహోషువ 7:1లో ఆకాను అని కూడా పిలవబడ్డాడు.
^ లేదా “కష్టం.”
^ అక్ష., “కుమారులు.”
^ 18, 19, 42 వచనాల్లో కాలేబు అని కూడా పిలవబడ్డాడు.
^ 9వ వచనంలో కెలూబై అని కూడా పిలవబడ్డాడు.
^ ఈ అధ్యాయంలోని కొన్ని పేర్లు, మనుషుల్ని కాకుండా స్థలాల్ని సూచించవచ్చు. ఆ సందర్భాల్లో “తండ్రి” అనే మాట, స్థాపించిన వ్యక్తిని సూచిస్తుండవచ్చు.
^ అక్ష., “కుమారులు.”
^ అక్ష., “కుమారులు.”
^ అక్ష., “కుమారులు.”
^ 9వ వచనంలో కెలూబై అని కూడా పిలవబడ్డాడు.