సామెతలు 22:1-29

  • గొప్ప సంపదల కన్నా మంచిపేరు నయం (1)

  • చిన్నప్పటి శిక్షణ జీవితాంతం పనికొస్తుంది (6)

  • సోమరి బయట సింహం ఉందని భయపడతాడు (13)

  • క్రమశిక్షణ మూర్ఖత్వాన్ని తీసేస్తుంది (15)

  • నైపుణ్యం ఉన్న వ్యక్తి రాజుల దగ్గర సేవ చేస్తాడు (29)

22  గొప్ప సంపదల కన్నా మంచిపేరును,*వెండిబంగారాల కన్నా దయను* ఎంచుకోవడం మంచిది.+  2  ధనవంతుడికి, పేదవాడికి మధ్య ఈ పోలిక ఉంది: ఆ ఇద్దర్నీ యెహోవాయే చేశాడు.+  3  వివేకం* గలవాడు అపాయాన్ని చూసి దాక్కుంటాడు,అనుభవం లేనివాడు నేరుగా ముందుకెళ్లి పర్యవసానాలు* అనుభవిస్తాడు.  4  వినయం, యెహోవా పట్ల భయభక్తులు ఉంటేఐశ్వర్యం, ఘనత, జీవం వస్తాయి.+  5  కపట స్వభావం ఉన్నవాడి దారిలో ముళ్లు, ఉరులు ఉంటాయి;తన ప్రాణాన్ని విలువైనదిగా ఎంచేవాడు వాటికి దూరంగా ఉంటాడు.+  6  బాలుడు* నడవాల్సిన దారిని అతనికి నేర్పించు;+అతను ముసలివాడైనప్పుడు కూడా దాన్నుండి తొలగిపోడు.+  7  ధనవంతుడు పేదవాణ్ణి ఏలతాడు,అప్పు చేసినవాడు అప్పిచ్చినవాడికి దాసుడు.+  8  అవినీతిని విత్తేవాడు నాశనాన్ని కోస్తాడు,+అతని ఆగ్రహ దండం విరిగిపోతుంది.+  9  ఉదారంగా ఇచ్చేవాడు దీవించబడతాడు,ఎందుకంటే అతను పేదవాళ్లతో తన ఆహారాన్ని పంచుకుంటాడు.+ 10  ఎగతాళి చేసేవాణ్ణి వెళ్లగొట్టు,అప్పుడు గొడవ సద్దుమణుగుతుంది;వివాదాలు,* అవమానాలు ఆగిపోతాయి. 11  హృదయ శుద్ధిని ప్రేమిస్తూ, దయగా మాట్లాడే వ్యక్తికిరాజు స్నేహితుడౌతాడు.+ 12  యెహోవా కళ్లు జ్ఞానాన్ని కాపాడతాయి,అయితే మోసగాళ్ల మాటల్ని ఆయన వ్యర్థం చేస్తాడు.+ 13  సోమరి, “బయట సింహం ఉంది! అది సంతవీధి మధ్యలో నన్ను చంపుతుంది!” అని అంటాడు.+ 14  దిగజారిన* స్త్రీ నోరు లోతైన గొయ్యి.+ యెహోవా శిక్షను పొందిన వ్యక్తి దానిలో పడతాడు. 15  బాలుడి* హృదయంలో సహజంగానే మూర్ఖత్వం ఉంటుంది,+క్రమశిక్షణ అనే బెత్తం దాన్ని అతని నుండి దూరం చేస్తుంది.+ 16  పేదవాళ్లను మోసగించి ఆస్తులు పెంచుకునేవాడు,+ధనవంతులకు బహుమతులు ఇచ్చేవాడుఇద్దరూ చివరికి పేదవాళ్లౌతారు. 17  తెలివిగలవాళ్ల మాటల్ని చెవిపెట్టి విను,+నా జ్ఞానం గురించి నీ హృదయంలో లోతుగా ఆలోచించు;+ 18  అవన్నీ ఎల్లప్పుడూ నీ పెదాల మీద ఉండేలా+వాటిని నీ హృదయంలో ఉంచుకుంటే నువ్వు సంతోషంగా ఉంటావు.+ 19  నువ్వు యెహోవా మీద నమ్మకం ఉంచేలాఈ రోజు నేను నీకు జ్ఞానాన్ని ఉపదేశిస్తున్నాను. 20  సలహాను, జ్ఞానాన్ని అందిస్తూనేను ఇప్పటికే నీకు ఎన్నో విషయాలు రాశాను; 21  నిన్ను పంపినవాడి దగ్గరికి నువ్వు ఖచ్చితమైన నివేదిక తీసుకొచ్చేలానిజమైన, నమ్మదగిన మాటలు నీకు నేర్పించడానికి అలా రాశాను. 22  పేదవాడు కదా అని పేదవాణ్ణి దోచుకోకు,+నగర ద్వారం దగ్గర దీనుణ్ణి నలగ్గొట్టకు.+ 23  ఎందుకంటే యెహోవాయే వాళ్ల తరఫున వాదిస్తాడు,+వాళ్లను మోసం చేసేవాళ్ల ప్రాణాలు తీస్తాడు. 24  కోపిష్ఠితో సహవాసం చేయకు,త్వరగా కోపగించుకునే వాడితో పొత్తు పెట్టుకోకు; 25  లేదంటే నువ్వు అతని మార్గాల్ని నేర్చుకొనిఉరిలో చిక్కుకుంటావు.+ 26  చేతిలో చెయ్యి వేసి ఒప్పందం చేసుకునేవాళ్ల మధ్య,ఇతరుల అప్పులకు హామీ* ఉండేవాళ్ల మధ్య ఉండకు.+ 27  ఇవ్వడానికి నీ దగ్గర ఏమీ లేకపోతే,నీ కిందున్న పరుపును కూడా తీసుకెళ్లిపోతారు! 28  నీ పూర్వీకులు పెట్టినపురాతన సరిహద్దు రాయిని జరపకు.+ 29  తన పనిలో నైపుణ్యం ఉన్న వ్యక్తిని చూశావా?అతను సామాన్యుల ముందు కాదు రాజుల ముందు నిలబడతాడు.+

అధస్సూచీలు

లేదా “గౌరవాన్ని.”
అక్ష., “పేరును.”
లేదా “యుక్తి.”
లేదా “శిక్ష.”
లేదా “పిల్లవాడు; యౌవనుడు.”
లేదా “వ్యాజ్యాలు.”
అక్ష., “అపరిచిత.” సామెతలు 2:16 చూడండి.
లేదా “పిల్లవాడి; యౌవనుడి.”
లేదా “జామీను.”