కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

సామెతలు పుస్తకం

అధ్యాయాలు

విషయసూచిక

  • 1

    • సామెతల ఉద్దేశం (1-7)

    • చెడు సహవాసం వల్ల ప్రమాదాలు (8-19)

    • నిజమైన తెలివి బహిరంగంగా కేకలు వేస్తుంది (20-33)

  • 2

    • తెలివి విలువ (1-22)

      • దాచబడిన సంపదల్లా తెలివిని వెదకడం (4)

      • ఆలోచనా సామర్థ్యం కాపాడుతుంది (11)

      • అనైతికత నాశనం చేస్తుంది (16-19)

  • 3

    • తెలివి కలిగి యెహోవా మీద నమ్మకం ఉంచాలి (1-12)

      • విలువైనవాటితో యెహోవాను ఘనపర్చాలి (9)

    • తెలివి సంతోషాన్ని తెస్తుంది (13-18)

    • తెలివివల్ల సురక్షితంగా ఉంటారు (19-26)

    • ఇతరులతో సరిగ్గా నడుచుకోవడం (27-35)

      • వీలైనప్పుడు ఇతరులకు మేలు చేయాలి (27)

  • 4

    • తండ్రి తెలివైన ఉపదేశం (1-27)

      • అన్నిటికన్నా ముఖ్యంగా తెలివి ​సంపాదించుకోవాలి (7)

      • దుష్టుల మార్గాలకు దూరంగా ఉండాలి (14, 15)

      • నీతిమంతుల దారి తేజరిల్లుతుంది (18)

      • “నీ హృదయాన్ని భద్రంగా కాపాడుకో” (23)

  • 5

    • అనైతిక స్త్రీల గురించి హెచ్చరిక (1-14)

    • నీ భార్యతో సంతోషించు (15-23)

  • 6

    • అప్పుకు హామీ ఉండే విషయంలో జాగ్రత్త (1-5)

    • “సోమరీ, చీమల దగ్గరికి వెళ్లు” (6-11)

    • పనికిమాలిన దుష్టుడు (12-15)

    • యెహోవా ద్వేషించే ఏడు విషయాలు (16-19)

    • చెడ్డ స్త్రీ విషయంలో జాగ్రత్త (20-35)

  • 7

    • దేవుని ఆజ్ఞలు పాటించి బ్రతుకు (1-5)

    • అనుభవంలేని యువకుడు ​మోసపోయాడు (6-27)

      • “పశువు వధకు పోయినట్టు” (22)

  • 8

    • తెలివి మాట్లాడుతోంది (1-36)

      • ‘దేవుని పనుల్లో నేను మొట్టమొదటి వాణ్ణి’ (22)

      • ‘ప్రధానశిల్పిగా దేవుని పక్కన’ (30)

      • ‘మనుషుల్ని బట్టి ఆనందించేవాణ్ణి’ (31)

  • 9

    • నిజమైన తెలివి పిలుస్తోంది (1-12)

      • “నా వల్ల నీ ఆయుష్షు పెరుగుతుంది” (11)

    • మూర్ఖురాలు పిలుస్తోంది (13-18)

      • “దొంగిలించిన నీళ్లు తీపి” (17)

  • సొలొమోను సామెతలు (10:1–24:34)

    • 10

      • తెలివిగల కుమారుడు తండ్రిని సంతోషపెడతాడు (1)

      • కష్టపడి పనిచేసేవాళ్లు ధనవంతులౌతారు (4)

      • ఎక్కువ మాటల్లో దోషం ఉంటుంది (19)

      • యెహోవా ఆశీర్వాదం ధనవంతుణ్ణి చేస్తుంది (22)

      • యెహోవాకు భయపడితే ఎక్కువకాలం జీవిస్తారు (27)

    • 11

      • అణకువ గలవాళ్ల దగ్గర తెలివి ఉంటుంది (2)

      • భక్తిహీనుడు ఇతరుల్ని నాశనం చేస్తాడు (9)

      • ‘ఎక్కువమంది సలహాదారుల వల్ల విజయం వస్తుంది’ (14)

      • ఉదారంగా ఇచ్చేవాళ్లు వర్ధిల్లుతారు (25)

      • సంపదల్ని నమ్ముకునేవాడు నాశనమౌతాడు (28)

    • 12

      • గద్దింపును అసహ్యించుకునేవాడు మూర్ఖుడు (1)

      • “ఆలోచించకుండా మాట్లాడే మాటలు కత్తిపోట్ల లాంటివి” (18)

      • శాంతి కోసం కృషి చేస్తే సంతోషం ఉంటుంది (20)

      • అబద్ధాలాడే పెదాలు యెహోవాకు అసహ్యం (22)

      • ఆందోళన హృదయాన్ని కృంగదీస్తుంది (25)

    • 13

      • సలహా కోసం వెదికేవాళ్లు తెలివిగలవాళ్లు (10)

      • ఎదురుచూసింది ఆలస్యమైతే బాధ (12)

      • నమ్మకమైన రాయబారి మేలు చేస్తాడు (17)

      • తెలివిగలవాళ్లతో తిరిగేవాడు తెలివిగలవాడౌతాడు (20)

      • క్రమశిక్షణ ప్రేమకు గుర్తు (24)

    • 14

      • హృదయంలో ఉన్న బాధ దానికే తెలుస్తుంది (10)

      • సరైనదిగా కనిపించే మార్గం మరణానికి తీసుకెళ్లవచ్చు (12)

      • అనుభవం లేనివాడు ప్రతీ మాట నమ్ముతాడు (15)

      • ధనవంతుడికి చాలామంది స్నేహితులు (20)

      • ప్రశాంతమైన హృదయం శరీరానికి ఆరోగ్యం (30)

    • 15

      • సౌమ్యంగా ఇచ్చే జవాబు కోపాన్ని చల్లారుస్తుంది (1)

      • యెహోవా కళ్లు ప్రతీచోట ఉన్నాయి (3)

      • నిజాయితీపరుల ప్రార్థనలు దేవునికి ఇష్టం (8)

      • సంప్రదించుకోకపోతే ప్రణాళికలు విఫలమౌతాయి (22)

      • జవాబిచ్చే ముందు ధ్యానించాలి (28)

    • 16

      • యెహోవా ఉద్దేశాల్ని పరిశీలిస్తాడు (2)

      • నీ పనులన్నీ యెహోవాకు అప్పగించు (3)

      • న్యాయమైన త్రాసు యెహోవాది (11)

      • నాశనానికి ముందు గర్వం ఉంటుంది (18)

      • తలనెరపు అందమైన కిరీటం (31)

    • 17

      • మేలుకు ప్రతిగా కీడు చేయకు (13)

      • గొడవ మొదలవ్వకముందే వెళ్లిపో (14)

      • నిజమైన స్నేహితుడు ఎల్లప్పుడూ ప్రేమిస్తాడు (17)

      • “సంతోష హృదయం మంచి ఔషధం” (22)

      • వివేచన గలవాడు మాటల్ని అదుపులో ఉంచుకుంటాడు (27)

    • 18

      • వేరుగా ఉండేవాడు స్వార్థపరుడు, తెలివితక్కువవాడు (1)

      • యెహోవా పేరు బలమైన బురుజు (10)

      • డబ్బు ఇచ్చే భద్రత భ్రమ (11)

      • ఇరు పక్షాల వాదన వినడం తెలివైన పని (17)

      • సహోదరుడి కన్నా ఎక్కువగా ప్రేమించే స్నేహితుడు (24)

    • 19

      • లోతైన అవగాహన కోపాన్ని చల్లారుస్తుంది (11)

      • కయ్యాలమారి భార్య కురిసే పైకప్పు లాంటిది (13)

      • బుద్ధిగల భార్య యెహోవా ఇచ్చే బహుమతి (14)

      • చెయ్యి దాటిపోకముందే పిల్లవాణ్ణి క్రమశిక్షణలో పెట్టాలి (18)

      • సలహా వినడం తెలివైన పని (20)

    • 20

      • ద్రాక్షారసం నవ్వులపాలు చేస్తుంది (1)

      • సోమరి చలికాలంలో పొలం దున్నడు (4)

      • మనిషి హృదయంలోని ఆలోచనలు లోతైన నీళ్లలాంటివి (5)

      • తొందరపడి ఒట్టేయడం గురించి హెచ్చరిక (25)

      • యౌవనుల బలమే వాళ్లకు సౌందర్యం (29)

    • 21

      • రాజు హృదయాన్ని యెహోవా తిప్పుతాడు (1)

      • బలుల కన్నా న్యాయం మేలు (3)

      • శ్రద్ధ వల్ల విజయం (5)

      • దీనుల మొర విననివాళ్ల ప్రార్థనకు జవాబు రాదు (13)

      • యెహోవాకు వ్యతిరేకంగా నిలిచే తెలివి ఏదీ లేదు (30)

    • 22

      • గొప్ప సంపదల కన్నా మంచిపేరు నయం (1)

      • చిన్నప్పటి శిక్షణ జీవితాంతం పనికొస్తుంది (6)

      • సోమరి బయట సింహం ఉందని భయపడతాడు (13)

      • క్రమశిక్షణ మూర్ఖత్వాన్ని తీసేస్తుంది (15)

      • నైపుణ్యం ఉన్న వ్యక్తి రాజుల దగ్గర సేవ చేస్తాడు (29)

    • 23

      • ఆతిథ్యం తీసుకునేటప్పుడు జాగ్రత్త (2)

      • ఆస్తి కోసం ప్రయాసపడకు (4)

      • ఆస్తి నీ దగ్గర నుండి ఎగిరిపోవచ్చు (5)

      • తాగుబోతుల మధ్య ఉండకు (20)

      • మద్యం పాములా కాటేస్తుంది (32)

    • 24

      • చెడ్డవాళ్లను చూసి ఈర్ష్యపడకు (1)

      • తెలివి వల్ల ఇల్లు కట్టబడుతుంది (3)

      • నీతిమంతుడు పడినా లేస్తాడు (16)

      • ప్రతీకారం తీర్చుకోకు (29)

      • కునికిపాట్ల వల్ల పేదరికం వస్తుంది (33, 34)

  • హిజ్కియా రాజు మనుషులు నకలు రాసిన సొలొమోను సామెతలు (25:1–29:27)

    • 25

      • విషయాన్ని రహస్యంగా ఉంచడం (9)

      • సరిగ్గా ఎంచుకున్న మాటలు (11)

      • వేరేవాళ్ల ఇంటికి పదేపదే వెళ్లకు (17)

      • శత్రువు తలమీద నిప్పులు కుప్పగా పోయడం (21, 22)

      • మంచి కబురు చల్లటి నీళ్ల లాంటిది (25)

    • 26

      • సోమరి వర్ణన (13-16)

      • వేరేవాళ్ల గొడవల్లో తలదూర్చకు (17)

      • ఆటపట్టించకూడదు (18, 19)

      • కట్టెలు లేకపోతే మంట ఆరిపోతుంది (20, 21)

      • లేనిపోనివి కల్పించి చెప్పేవాడి మాటలు రుచికరమైన ఆహారం ముద్దలు (22)

    • 27

      • స్నేహితుడి గద్దింపులు ప్రయోజనకరం (5, 6)

      • నా కుమారుడా, నా హృదయాన్ని సంతోషపెట్టు (11)

      • ఇనుము ఇనుముకు పదునుపెడుతుంది (17)

      • నీ పశువుల స్థితి తెలుసుకో (23)

      • డబ్బు శాశ్వతం కాదు (24)

    • 28

      • ధర్మశాస్త్రానికి స్పందించని వాళ్ల ప్రార్థన అసహ్యం (9)

      • దోషాన్ని ఒప్పుకునేవాడి మీద కరుణ (13)

      • ధనవంతుడు అవ్వడానికి తొందరపడేవాడు నిర్దోషిగా ఉండడు (20)

      • పొగడ్త కన్నా గద్దింపు మేలు (23)

      • ఉదారంగా ఇచ్చేవాడికి ఏ లోటూ ఉండదు (27)

    • 29

      • అదుపులో పెట్టని పిల్లవాడు తల్లికి అవమానం తెస్తాడు (15)

      • దర్శనం లేనిచోట ప్రజలు అదుపులేకుండా ప్రవర్తిస్తారు (18)

      • కోపిష్ఠి గొడవలు రేపుతాడు (22)

      • వినయ స్వభావం గలవాడు ఘనత పొందుతాడు (23)

      • మనుషుల భయం ఉరి (25)

  • 30

    • ఆగూరు మాటలు (1-33)

      • పేదరికాన్ని గానీ ఐశ్వర్యాన్ని గానీ ఇవ్వకు (8)

      • ఎప్పటికీ తృప్తి చెందనివి (15, 16)

      • జాడ కనుక్కోలేనివి (18, 19)

      • వ్యభిచార స్త్రీ (20)

      • స్వాభావికంగా తెలివైన ప్రాణులు (24)

  • 31

    • లెమూయేలు రాజు మాటలు (1-31)

      • సమర్థురాలైన భార్య దొరకడం అరుదు (10)

      • కష్టపడుతుంది, ప్రయాసపడుతుంది (17)

      • దయగా మాట్లాడుతుంది (26)

      • పిల్లలు, భర్త పొగుడుతారు (28)

      • అందం, సౌందర్యం నశించిపోతాయి (30)