సంఖ్యాకాండం 29:1-40

  • ఆయా అర్పణలు అర్పించాల్సిన పద్ధతి (1-40)

    • బాకా ఊదే రోజు (1-6)

    • ప్రాయశ్చిత్త రోజు (7-11)

    • పర్ణశాలల పండుగప్పుడు (12-38)

29  “ ‘ఏడో నెల మొదటి రోజున మీరు పవిత్ర సమావేశం జరుపుకోవాలి. ఆ రోజు మీరు కష్టమైన ఏ పనీ చేయకూడదు.+ అంతేకాదు ఆ రోజు మీరు బాకా శబ్దం చేయాలి.+ 2  యెహోవాకు ఇంపైన* సువాసన వచ్చేలా దహనబలి అర్పించడానికి వీటిని మీరు తీసుకురావాలి: ఒక కోడెదూడ, ఒక పొట్టేలు, ఏడు ఏడాది మగ గొర్రెపిల్లలు. వాటిలో ఏ లోపం ఉండకూడదు. 3  వాటి ధాన్యార్పణగా నూనె కలిపిన మెత్తని పిండిని తీసుకురావాలి. కోడెదూడకైతే ఈఫాలో మూడు పదోవంతుల పిండిని, పొట్టేలుకైతే ఈఫాలో రెండు పదోవంతుల పిండిని, 4  ఏడు మగ గొర్రెపిల్లల్లో ఒక్కోదానికి ఒక్కో పదోవంతు పిండిని తీసుకురావాలి. 5  అలాగే మీ కోసం ప్రాయశ్చిత్తం చేయడానికి పాపపరిహారార్థ బలిగా ఒక మగ మేకపిల్లను తీసుకురావాలి. 6  ప్రతీనెల అర్పించే దహనబలి, దాని ధాన్యార్పణ,+ పానీయార్పణలతో పాటు; ప్రతీరోజు అర్పించే దహనబలి, దాని ధాన్యార్పణ,+ పానీయార్పణలతో+ పాటు వీటిని అర్పించాలి. ఎప్పుడూ అర్పించే పద్ధతిలోనే వాటిని అర్పించాలి. ఇది యెహోవాకు అగ్నితో అర్పించే అర్పణ, ఇంపైన* సువాసన. 7  “ ‘ఏడో నెల, పదో రోజున మీరు పవిత్ర సమావేశం జరుపుకోవాలి,+ మీ పాపాల విషయంలో దుఃఖాన్ని వ్యక్తం చేయాలి,* ఆ రోజున మీరు ఏ పనీ చేయకూడదు.+ 8  యెహోవాకు ఇంపైన* సువాసన వచ్చేలా దహనబలి అర్పించడానికి వీటిని మీరు తీసుకురావాలి: ఒక కోడెదూడ, ఒక పొట్టేలు, ఏడు ఏడాది మగ గొర్రెపిల్లలు. వాటిలో ఏ లోపం ఉండకూడదు.+ 9  వాటి ధాన్యార్పణగా నూనె కలిపిన మెత్తని పిండిని తీసుకురావాలి. కోడెదూడకైతే ఈఫాలో మూడు పదోవంతుల పిండిని, పొట్టేలుకైతే రెండు పదోవంతుల పిండిని, 10  ఏడు మగ గొర్రెపిల్లల్లో ఒక్కో దానికి ఒక్కో పదోవంతు పిండిని తీసుకురావాలి. 11  అలాగే పాపపరిహారార్థ బలిగా ఒక మేకపిల్లను తీసుకురావాలి. ప్రాయశ్చిత్త రోజున అర్పించే పాపపరిహారార్థ బలితో+ పాటు; ఎప్పుడూ అర్పించే దహనబలి, దాని ధాన్యార్పణ, పానీయార్పణలతో పాటు దీన్ని కూడా అర్పించాలి. 12  “ ‘ఏడో నెల, 15వ రోజున మీరు పవిత్ర సమావేశం జరుపుకోవాలి. ఆ రోజు మీరు కష్టమైన ఏ పనీ చేయకూడదు. ఏడురోజుల పాటు మీరు యెహోవాకు పండుగ జరుపుకోవాలి.+ 13  యెహోవాకు ఇంపైన* సువాసన వచ్చేలా అగ్నితో అర్పించే అర్పణగా దహనబలి+ అర్పించడానికి వీటిని మీరు తీసుకురావాలి: 13 కోడెదూడలు, 2 పొట్టేళ్లు, 14 ఏడాది మగ గొర్రెపిల్లలు. వాటిలో ఏ లోపం ఉండకూడదు.+ 14  వాటి ధాన్యార్పణగా నూనె కలిపిన మెత్తని పిండిని తీసుకురావాలి. 13 కోడెదూడల్లో ఒక్కోదానికి ఈఫాలో మూడు పదోవంతుల పిండిని, 2 పొట్టేళ్లలో ఒక్కోదానికి రెండు పదోవంతుల పిండిని, 15  అలాగే 14 మగ గొర్రెపిల్లల్లో ఒక్కోదానికి ఒక్కో పదోవంతు పిండిని తీసుకురావాలి. 16  అలాగే పాపపరిహారార్థ బలి కోసం ఒక మేకపిల్లను తీసుకురావాలి. ఎప్పుడూ అర్పించే దహనబలి, దాని ధాన్యార్పణ, పానీయార్పణలతో పాటు వీటిని అర్పించాలి.+ 17  “ ‘రెండో రోజు 12 కోడెదూడలు, 2 పొట్టేళ్లు, 14 ఏడాది మగ గొర్రెపిల్లలు తీసుకురావాలి. వాటిలో ఏ లోపం ఉండకూడదు.+ 18  అలాగే కోడెదూడలకు, పొట్టేళ్లకు, మగ గొర్రెపిల్లలకు వాటివాటి సంఖ్య ప్రకారం ఎప్పుడూ అర్పించే పద్ధతిలోనే వాటి ధాన్యార్పణను, పానీయార్పణలను అర్పించాలి. 19  అంతేకాదు పాపపరిహారార్థ బలి కోసం ఒక మేకపిల్లను తీసుకురావాలి. ఎప్పుడూ అర్పించే దహనబలి, దాని ధాన్యార్పణ, పానీయార్పణలతో పాటు వీటిని అర్పించాలి.+ 20  “ ‘మూడో రోజు 11 కోడెదూడలు, 2 పొట్టేళ్లు, 14 ఏడాది మగ గొర్రెపిల్లలు తీసుకురావాలి. వాటిలో ఏ లోపం ఉండకూడదు.+ 21  అలాగే కోడెదూడలకు, పొట్టేళ్లకు, మగ గొర్రెపిల్లలకు వాటివాటి సంఖ్య ప్రకారం ఎప్పుడూ అర్పించే పద్ధతిలోనే వాటి ధాన్యార్పణను, పానీయార్పణలను అర్పించాలి. 22  అంతేకాదు పాపపరిహారార్థ బలి కోసం ఒక మేకను తీసుకురావాలి. ఎప్పుడూ అర్పించే దహనబలి, దాని ధాన్యార్పణ, పానీయార్పణలతో పాటు వీటిని అర్పించాలి.+ 23  “ ‘నాలుగో రోజు 10 కోడెదూడలు, 2 పొట్టేళ్లు, 14 ఏడాది మగ గొర్రెపిల్లలు తీసుకురావాలి. వాటిలో ఏ లోపం ఉండకూడదు.+ 24  అలాగే కోడెదూడలకు, పొట్టేళ్లకు, మగ గొర్రెపిల్లలకు వాటివాటి సంఖ్య ప్రకారం ఎప్పుడూ అర్పించే పద్ధతిలోనే వాటి ధాన్యార్పణను, పానీయార్పణలను అర్పించాలి. 25  అంతేకాదు పాపపరిహారార్థ బలి కోసం ఒక మేకపిల్లను తీసుకురావాలి. ఎప్పుడూ అర్పించే దహనబలి, దాని ధాన్యార్పణ, పానీయార్పణలతో పాటు వీటిని అర్పించాలి.+ 26  “ ‘ఐదో రోజు 9 కోడెదూడలు, 2 పొట్టేళ్లు, 14 ఏడాది మగ గొర్రెపిల్లలు తీసుకురావాలి. వాటిలో ఏ లోపం ఉండకూడదు.+ 27  అలాగే కోడెదూడలకు, పొట్టేళ్లకు, మగ గొర్రెపిల్లలకు వాటివాటి సంఖ్య ప్రకారం ఎప్పుడూ అర్పించే పద్ధతిలోనే వాటి ధాన్యార్పణను, పానీయార్పణలను అర్పించాలి. 28  అంతేకాదు పాపపరిహారార్థ బలి కోసం ఒక మేకను తీసుకురావాలి. ఎప్పుడూ అర్పించే దహనబలి, దాని ధాన్యార్పణ, పానీయార్పణలతో పాటు వీటిని అర్పించాలి.+ 29  “ ‘ఆరో రోజు 8 కోడెదూడలు, 2 పొట్టేళ్లు, 14 ఏడాది మగ గొర్రెపిల్లలు తీసుకురావాలి. వాటిలో ఏ లోపం ఉండకూడదు.+ 30  అలాగే కోడెదూడలకు, పొట్టేళ్లకు, మగ గొర్రెపిల్లలకు వాటివాటి సంఖ్య ప్రకారం ఎప్పుడూ అర్పించే పద్ధతిలోనే వాటి ధాన్యార్పణను, పానీయార్పణలను అర్పించాలి. 31  అంతేకాదు పాపపరిహారార్థ బలి కోసం ఒక మేకను తీసుకురావాలి. ఎప్పుడూ అర్పించే దహనబలి, దాని ధాన్యార్పణ, పానీయార్పణలతో పాటు వీటిని అర్పించాలి.+ 32  “ ‘ఏడో రోజు 7 కోడెదూడలు, 2 పొట్టేళ్లు, 14 ఏడాది మగ గొర్రెపిల్లలు తీసుకురావాలి. వాటిలో ఏ లోపం ఉండకూడదు.+ 33  అలాగే కోడెదూడలకు, పొట్టేళ్లకు, మగ గొర్రెపిల్లలకు వాటివాటి సంఖ్య ప్రకారం ఎప్పుడూ అర్పించే పద్ధతిలోనే వాటి ధాన్యార్పణను, పానీయార్పణలను అర్పించాలి. 34  అంతేకాదు పాపపరిహారార్థ బలి కోసం ఒక మేకను తీసుకురావాలి. ఎప్పుడూ అర్పించే దహనబలి, దాని ధాన్యార్పణ, పానీయార్పణలతో పాటు వీటిని అర్పించాలి.+ 35  “ ‘ఎనిమిదో రోజున మీరు ప్రత్యేక సమావేశం జరుపుకోవాలి. ఆ రోజు మీరు కష్టమైన ఏ పనీ చేయకూడదు.+ 36  యెహోవాకు ఇంపైన* సువాసన వచ్చేలా అగ్నితో అర్పించే అర్పణగా దహనబలి అర్పించడానికి వీటిని మీరు తీసుకురావాలి: ఒక కోడెదూడ, ఒక పొట్టేలు, ఏడు ఏడాది మగ గొర్రెపిల్లలు. వాటిలో ఏ లోపం ఉండకూడదు.+ 37  అలాగే కోడెదూడకు, పొట్టేలుకు, మగ గొర్రెపిల్లలకు వాటివాటి సంఖ్య ప్రకారం ఎప్పుడూ అర్పించే పద్ధతిలోనే వాటి ధాన్యార్పణను, పానీయార్పణలను అర్పించాలి. 38  అంతేకాదు పాపపరిహారార్థ బలి కోసం ఒక మేకను తీసుకురావాలి. ఎప్పుడూ అర్పించే దహనబలి, దాని ధాన్యార్పణ, పానీయార్పణలతో పాటు వీటిని అర్పించాలి.+ 39  “ ‘మీరు దహనబలులుగా,+ ధాన్యార్పణలుగా,+ పానీయార్పణలుగా,+ సమాధాన బలులుగా+ అర్పించే మొక్కుబడి అర్పణలు,+ స్వేచ్ఛార్పణలు+ కాకుండా ఆయా పండుగలప్పుడు+ వీటిని యెహోవాకు అర్పించాలి.’ ” 40  యెహోవా తనకు ఆజ్ఞాపించిన ప్రతీది మోషే ఇశ్రాయేలీయులకు చెప్పాడు.

అధస్సూచీలు

లేదా “శాంతపర్చే.”
లేదా “శాంతపర్చే.”
లేదా “మిమ్మల్ని మీరు బాధించుకోవాలి.” సాధారణంగా ఇది ఉపవాసం ఉండడంతో పాటు, కొన్నిటిని త్యాగం చేయడాన్ని సూచిస్తుందని అర్థమౌతోంది.
లేదా “శాంతపర్చే.”
లేదా “శాంతపర్చే.”
లేదా “శాంతపర్చే.”