యెషయా 64:1-12

  • పశ్చాత్తాపంతో చేసిన ప్రార్థన కొనసాగింపు (1-12)

    • యెహోవా ‘మా కుమ్మరి’ (8)

64  నీ ముందు పర్వతాలు కంపించేలానువ్వు ఆకాశాన్ని చీల్చుకొని కిందికి దిగివస్తే,  2  అగ్ని గచ్చపొదల్ని కాల్చేసినీళ్లను మరిగించినట్టు నువ్వు దిగివస్తే,నీ శత్రువులకు నీ పేరు తెలుస్తుంది,దేశాలు నీ ముందు భయంతో వణుకుతాయి!  3  మేము ఊహించడానికి కూడా భయపడే సంభ్రమాశ్చర్య కార్యాలు నువ్వు చేసినప్పుడు+నువ్వు దిగివచ్చావు, నీ ముందు పర్వతాలు కంపించాయి.+  4  తన కోసం కనిపెట్టుకొని* ఉన్నవాళ్ల తరఫున చర్య తీసుకునేనీలాంటి దేవుడి గురించి ప్రాచీనకాలం నుండి ఎవ్వరూ వినలేదు, గమనించలేదు,ఏ కన్నూ అలాంటి దేవుణ్ణి చూడలేదు.+  5  నిన్ను గుర్తుపెట్టుకొని, నీ మార్గాల్ని అనుసరిస్తూ సంతోషంగా సరైనవాటిని చేసేవాళ్లను+ కలుసుకోవడానికి నువ్వు వచ్చావు.ఇదిగో! మేము పాపం చేస్తూ ఉన్నప్పుడు నీకు కోపమొచ్చింది,+ మేము చాలాకాలం పాటు అలా పాపాలు చేశాం.రక్షణ పొందడానికి ఇప్పుడు మేము అర్హులమేనా?  6  మేమంతా అపవిత్రుడైన వ్యక్తిలా తయారయ్యాం,మా నీతికార్యాలన్నీ మైలగుడ్డలా* ఉన్నాయి.+ మేమంతా ఆకులా వాడిపోతాం,మా తప్పులు గాలిలా మమ్మల్ని కొట్టుకొనిపోతాయి.  7  నీ పేరు ఎత్తి ప్రార్థించేవాళ్లు ఎవరూ లేరు,నిన్ను గట్టిగా పట్టుకునేలా తమను తాము పురికొల్పుకునేవాళ్లు ఎవరూ లేరు;ఎందుకంటే, నువ్వు మా నుండి నీ ముఖాన్ని దాచుకున్నావు,+మా తప్పుల వల్ల మేము కరిగిపోయేలా చేస్తున్నావు.  8  కానీ యెహోవా, నువ్వే మా తండ్రివి.+ మేము బంకమట్టి, నువ్వు మా కుమ్మరివి;*+మేమంతా నీ చేతి పని.  9  యెహోవా, మా మీద మరీ అంత కోప్పడకు,+మా తప్పుల్ని ఎల్లకాలం గుర్తుంచుకోకు. దయచేసి మా వైపు చూడు, మేమంతా నీ ప్రజలమే కదా. 10  నీ పవిత్ర నగరాలు ఎడారిలా మారిపోయాయి. సీయోను ఎడారిగా మారింది,యెరూషలేము పాడుబడ్డ భూమిలా తయారైంది.+ 11  పవిత్రమైన, మహిమాన్వితమైన* మా మందిరం,మా పూర్వీకులు నిన్ను స్తుతించిన మందిరం,అగ్నితో కాల్చేయబడింది,+మాకు ప్రియమైనవన్నీ శిథిలాలుగా మిగిలాయి. 12  యెహోవా, ఇంత జరిగినా నువ్వు ఇంకా చర్య తీసుకోవా? మౌనంగా ఉండి మమ్మల్ని ఇంతలా బాధలు పడనిస్తావా?+

అధస్సూచీలు

లేదా “ఓపిగ్గా ఎదురుచూస్తూ.”
లేదా “రుతుస్రావపు గుడ్డలా.”
లేదా “రూపకర్తవు.”
లేదా “సుందరమైన.”