యెషయా 47:1-15

  • బబులోను కూలిపోవడం (1-15)

    • జ్యోతిష్యుల సంగతి బయటపెట్టడం (13-15)

47  బబులోను కన్యా,+కిందికి దిగివచ్చి ధూళిలో కూర్చో. కల్దీయుల కుమారీ,సింహాసనం లేని చోట నేలమీద కూర్చో.+ఎందుకంటే, ప్రజలు ఇంకెప్పుడూ నిన్ను సుకుమారి, గారాలపట్టి అని అనరు.  2  తిరుగలి తీసుకొని పిండి విసురు. నీ ముసుగు తీసేయి. నీ కాళ్ల మీద వేలాడుతున్న వస్త్రం పైకెత్తి నదులు దాటు.  3  నువ్వు దిగంబరిగా చేయబడతావు. నీకు కలిగే అవమానాన్ని అందరూ చూస్తారు. నేను పగ తీర్చుకుంటాను,+ నా దారికి ఎవరూ అడ్డురారు.*  4  “మమ్మల్ని తిరిగి కొంటున్నదిఇశ్రాయేలు పవిత్ర దేవుడు;ఆయన పేరు సైన్యాలకు అధిపతైన యెహోవా.”+  5  కల్దీయుల కూతురా,నువ్వు అక్కడ మౌనంగా కూర్చొని, చీకట్లోకి వెళ్లు;+ప్రజలు ఇంకెప్పుడూ నిన్ను రాజ్యాలకు దొరసాని* అని అనరు.+  6  నా ప్రజల మీద నాకు చాలా కోపమొచ్చింది.+ నేను నా స్వాస్థ్యాన్ని మలినపర్చాను,+వాళ్లను నీ చేతికి అప్పగించాను.+ కానీ నువ్వు వాళ్ల మీద కరుణ చూపించలేదు.+ ముసలివాళ్ల మీద కూడా నువ్వు బరువైన కాడిని మోపావు.+  7  “నేను ఎప్పటికీ దొరసానిగానే* ఉంటాను” అని నువ్వు అనుకున్నావు.+ నువ్వు ఈ విషయాల మీద మనసు పెట్టలేదు;చివరికి ఏమౌతుందో ఆలోచించలేదు.  8  సుఖాల్ని ప్రేమించేదానా,+సురక్షితంగా కూర్చొని, “నాలాంటివాళ్లు ఎవ్వరూ లేరు, నేను తప్ప ఇంకెవ్వరూ లేరు.+ నేను విధవరాలిని అవ్వను. నాకు ఎన్నడూ పుత్రశోకం కలగదు” అని హృదయంలో అనుకుంటున్నదానా,+ ఈ మాటలు విను.  9  వైధవ్యం, పుత్రశోకం రెండూ అకస్మాత్తుగా, ఒకేరోజు నీకు కలుగుతాయి.+ నువ్వు ఎన్నో మంత్రతంత్రాలు చేస్తున్నావు, శక్తివంతమైన మంత్రాలు పలుకుతున్నావు+ కాబట్టి,*అవి పూర్తిస్థాయిలో నీ మీదికి వస్తాయి.+ 10  నువ్వు నీ దుష్టత్వాన్ని నమ్ముకున్నావు. “ఎవరూ నన్ను చూడట్లేదు” అనుకున్నావు. నీ తెలివి, జ్ఞానమే నిన్ను తప్పుదారి పట్టించాయి,“నాలాంటివాళ్లు ఎవ్వరూ లేరు, నేను తప్ప ఇంకెవ్వరూ లేరు” అని నీ హృదయంలో అనుకుంటున్నావు. 11  కానీ నీ మీదికి విపత్తు ముంచుకొస్తుంది,నీ మంత్రాలేవీ దాన్ని ఆపలేవు.* నీకు పెద్ద కష్టం వస్తుంది; నువ్వు దాన్ని తప్పించుకోలేవు. నీకెన్నడూ తెలియని నాశనం హఠాత్తుగా నీ మీదికి వస్తుంది.+ 12  కాబట్టి, నువ్వు బాల్యం నుండి కష్టపడి చేస్తూ ఉన్నమంత్రాల్ని, ఎన్నో మంత్రవిద్యల్ని+ చేస్తూనే ఉండు. అవి నీకు మేలు చేస్తాయేమో;వాటితో నువ్వు ప్రజల్ని భయపెట్టగలుగుతావేమో. 13  అనేకమంది సలహాదారుల వల్ల నువ్వు అలసిపోయావు. ఇప్పుడు వాళ్లను లేచి నిన్ను కాపాడమను.వాళ్లు ఆకాశాన్ని పూజిస్తారు,* నక్షత్రాల్ని గమనిస్తారు,+నీ మీదికి రాబోయేవాటి గురించిన సంగతుల్నిఅమావాస్య రోజుల్లో నీకు తెలియజేస్తారు. 14  ఇదిగో! వాళ్లు కొయ్యకాలు* లాంటివాళ్లు. అగ్ని వాళ్లను దహించేస్తుంది. వాళ్లు అగ్నిజ్వాల శక్తి నుండి తమను తాము కాపాడుకోలేరు. అవి వెచ్చదనమిచ్చే బొగ్గులు కాదు,అది చలి కాచుకునే మంట కాదు. 15  నీ బాల్యం నుండి నువ్వు ఎవరితోనైతే శ్రమించావోఆ మంత్రగాళ్లు* నీ విషయంలో అలా తయారౌతారు. వాళ్లు దారితప్పి, చెదిరిపోయి ఒక్కొక్కరు ఒక్కో వైపు* వెళ్లిపోతారు. నిన్ను కాపాడేవాళ్లు ఎవ్వరూ ఉండరు.+

అధస్సూచీలు

లేదా “నాకు ఎదురొచ్చే ఎవరి మీదా దయ చూపించను” అయ్యుంటుంది.
లేదా “రాణి.”
లేదా “రాణిగానే.”
లేదా “అయినా” అయ్యుంటుంది.
లేదా “ఏ మంత్రంతో దాన్ని ఆపాలో నీకు తెలీదు.”
లేదా “ఆకాశాన్ని విభజించే మనుషులు; జ్యోతిష్యులు” అయ్యుంటుంది.
పంట కోసిన తర్వాత నేలమీద మిగిలే కాడల దుబ్బు.
లేదా “పాములోళ్లు.”
అక్ష., “తమ సొంత ప్రాంతానికి.”