కీర్తనలు 94:1-23

  • ప్రతీకారం తీర్చుకోమని దేవునికి ప్రార్థన

    • ‘దుష్టులు ఎంతకాలం ఉంటారు?’ (3)

    • యెహోవా సరిదిద్దితే సంతోషంగా ఉంటారు (12)

    • దేవుడు తన ప్రజల్ని విడిచిపెట్టడు (14)

    • “చట్టం పేరుతో సమస్యలు సృష్టించడం” (20)

94  ప్రతీకారం తీర్చుకునే దేవా, యెహోవా,+ప్రతీకారం తీర్చుకునే దేవా, ప్రకాశించు!   భూలోక న్యాయాధిపతీ,+ లే. గర్విష్ఠులకు తగిన శాస్తి చేయి.+   ఎంతకాలం యెహోవా,ఎంతకాలం దుష్టులు ఉల్లసిస్తూ ఉంటారు?+   వాళ్లు పిచ్చి వాగుడు వాగుతారు, అహంకారంగా మాట్లాడతారు;తప్పుచేసే వాళ్లంతా తమ గురించి గొప్పలు చెప్పుకుంటారు.   యెహోవా, వాళ్లు నీ ప్రజల్ని నలగ్గొడుతున్నారు,+నీ స్వాస్థ్యాన్ని బాధిస్తున్నారు.   వాళ్లు విధవరాలిని, పరదేశిని చంపుతారు,తండ్రిలేని పిల్లల్ని హత్య చేస్తారు.   “యెహోవా* చూడట్లేదు;+యాకోబు దేవుడు దీన్ని పట్టించుకోవట్లేదు” అని వాళ్లు అనుకుంటున్నారు.+   బుద్ధిలేని ప్రజలారా, ఈ విషయం అర్థంచేసుకోండి;మూర్ఖులారా, మీరు ఎప్పటికైనా లోతైన అవగాహన చూపిస్తారా?+   చెవిని తయారుచేసిన దేవుడు వినలేడా? కంటిని తయారుచేసిన దేవుడు చూడలేడా?+ 10  దేశాల్ని సరిదిద్దే దేవుడు క్రమశిక్షణ ఇవ్వలేడా?+ ప్రజలకు జ్ఞానాన్ని బోధించేది ఆయనే!+ 11  మనుషుల ఆలోచనలు యెహోవాకు తెలుసు,అవి వ్యర్థమైనవని ఆయనకు తెలుసు.+ 12  యెహోవా,* నువ్వు సరిదిద్దే మనిషి,నీ ధర్మశాస్త్రంతో నువ్వు బోధించే వ్యక్తి ధన్యుడు;*+ 13  దుష్టుల కోసం గుంట తవ్వబడే వరకు,+కష్టకాలంలో నువ్వు అతనికి మనశ్శాంతి దయచేస్తావు. 14  ఎందుకంటే యెహోవా తన ప్రజల్ని విడిచిపెట్టడు,+తన స్వాస్థ్యాన్ని+ వదిలేయడు. 15  ఎందుకంటే తీర్పు మళ్లీ న్యాయంగా ఉంటుంది,హృదయంలో నిజాయితీ ఉన్నవాళ్లంతా దాన్ని పాటిస్తారు. 16  దుష్టులకు వ్యతిరేకంగా నా కోసం ఎవరు లేస్తారు? తప్పుచేసే వాళ్లకు వ్యతిరేకంగా ఎవరు నా తరఫున నిలబడతారు? 17  యెహోవా నాకు సహాయం చేసుండకపోతే,నేను త్వరగా నశించిపోయేవాణ్ణి.+ 18  “నా పాదం జారుతోంది” అని నేను అనుకున్నప్పుడు, యెహోవా, నీ విశ్వసనీయ ప్రేమ నన్ను ఆదుకుంటూ వచ్చింది.+ 19  ఆందోళనలు* నన్ను ఉక్కిరిబిక్కిరి చేసినప్పుడు*నువ్వే నన్ను ఓదార్చావు, ఊరడించావు.+ 20  చట్టం* పేరుతో సమస్యలు సృష్టించడానికి ప్రయత్నిస్తూ+దుష్ట పరిపాలకులు* నీతో సంధి చేసుకోగలరా? 21  వాళ్లు నీతిమంతుల మీద క్రూరమైన దాడులు చేస్తూ+అమాయకులకు మరణశిక్ష విధిస్తారు.+ 22  అయితే యెహోవాయే నాకు సురక్షితమైన ఆశ్రయంగా* ఉంటాడు,నా దేవుడే నా ఆశ్రయదుర్గం.*+ 23  ఆయన, వాళ్ల దుష్ట పనులు వాళ్లమీదికే వచ్చేలా చేస్తాడు.+ వాళ్ల చెడుతనంతోనే వాళ్లను నాశనం చేస్తాడు. మన దేవుడైన యెహోవా వాళ్లను నాశనం చేస్తాడు.+

అధస్సూచీలు

అక్ష., “యా.” ఇది యెహోవా పేరుకు సంక్షిప్త రూపం.
అక్ష., “యా.” ఇది యెహోవా పేరుకు సంక్షిప్త రూపం.
లేదా “సంతోషంగా ఉంటాడు.”
లేదా “కలవరపెట్టే ఆలోచనలు.”
లేదా “నాలో ఎక్కువైనప్పుడు.”
లేదా “శాసనం.”
లేదా “సింహాసనం.”
లేదా “ఎత్తైన స్థలంగా.”
అక్ష., “నేను ఆశ్రయించే నా బండరాయి.”