కీర్తనలు 87:1-7
-
సీయోను సత్యదేవుని నగరం
-
సీయోనులో పుట్టినవాళ్లు (4-6)
-
కోరహు కుమారుల కీర్తన.+ శ్రావ్యగీతం. గీతం.
87 ఆయన నగర పునాది పవిత్ర పర్వతాల్లో ఉంది.+
2 యాకోబు డేరాలన్నిటి కన్నాసీయోను ద్వారాలంటే యెహోవాకు చాలా ఇష్టం.+
3 సత్యదేవుని నగరమా, నీ గురించి గొప్పగొప్ప సంగతులు చెప్పుకుంటున్నారు.+ (సెలా)
4 రాహాబును,*+ బబులోనును నన్ను తెలుసుకున్న* వాటిగా పరిగణిస్తాను;ఫిలిష్తియ, తూరు, కూషులను చూడండి.
వాటి ప్రజల్లో ప్రతీ ఒక్కరి గురించి నేను, “ఇతను అక్కడ పుట్టాడు” అని అంటాను.
5 సీయోను గురించి ప్రజలు,
“ప్రతీ ఒక్కరు ఆ నగరంలో పుట్టారు” అని చెప్పుకుంటారు.
సర్వోన్నతుడు ఆ నగరాన్ని బలంగా స్థాపిస్తాడు.
6 ప్రజల పేర్లు నమోదు చేస్తున్నప్పుడు,
“ఇతను అక్కడ పుట్టాడు” అని యెహోవా ప్రకటిస్తాడు. (సెలా)
7 గాయకులు,+ నాట్యం* చేసేవాళ్లు,+
“నా ఊటలన్నీ నీలోనే ఉన్నాయి”*+ అని అంటారు.
అధస్సూచీలు
^ ఐగుప్తును సూచిస్తుండవచ్చు.
^ లేదా “గుర్తించిన.”
^ లేదా “గుండ్రంగా తిరుగుతూ నాట్యం.”
^ లేదా “నాకైతే, అన్నిటికీ మూలం నువ్వే.”