కీర్తనలు 86:1-17
దావీదు ప్రార్థన.
86 యెహోవా, నేను కష్టాల్లో ఉన్నాను, దీనస్థితిలో ఉన్నాను,నా ప్రార్థన విను,* నాకు జవాబివ్వు.+
2 నేను విశ్వసనీయంగా ఉన్నాను, నా ప్రాణం కాపాడు,
నిన్ను నమ్ముకున్న నీ సేవకుణ్ణి రక్షించు,నువ్వే నా దేవుడివి.+
3 యెహోవా, నా మీద దయ చూపించు,రోజంతా నీకే నేను మొరపెట్టుకుంటున్నాను.
4 నీ సేవకుణ్ణి సంతోషపెట్టు,ఎందుకంటే యెహోవా, నీ వైపే నేను తిరుగుతున్నాను.
5 యెహోవా, నువ్వు మంచివాడివి,+ క్షమించడానికి సిద్ధంగా ఉంటావు;+నీకు మొరపెట్టే వాళ్లందరి మీద అపారమైన విశ్వసనీయ ప్రేమ చూపిస్తావు.
6 యెహోవా, నా ప్రార్థన విను;సహాయం కోసం నేను చేస్తున్న విన్నపాలు ఆలకించు.
7 కష్టకాలంలో నేను నీకు ప్రార్థిస్తాను,+నువ్వు నాకు జవాబిస్తావు.
8 యెహోవా, దేవుళ్లలో నీలాంటి దేవుడు ఎవ్వరూ లేరు,+నీ పనులు సాటిలేనివి.+
9 యెహోవా, నువ్వు చేసిన దేశాలన్నీ వచ్చినీ ముందు వంగి నమస్కారం చేస్తాయి,+
నీ పేరును మహిమపరుస్తాయి.+
10 ఎందుకంటే నువ్వు గొప్పవాడివి, అద్భుతమైన పనులు చేస్తావు;+నువ్వు మాత్రమే దేవుడివి.+
11 యెహోవా, నీ మార్గాన్ని నాకు బోధించు.+
నేను నీ సత్యంలో నడుస్తాను.+
నీ పేరుకు భయపడేలా నాకు ఏక హృదయం* దయచేయి.+
12 యెహోవా, నా దేవా, నా నిండు హృదయంతో నిన్ను స్తుతిస్తున్నాను,+నీ పేరును నిరంతరం మహిమపరుస్తాను.
13 ఎందుకంటే, నా మీద నీకున్న విశ్వసనీయ ప్రేమ గొప్పది,సమాధి* లోతుల్లో నుండి నువ్వు నా ప్రాణాన్ని కాపాడావు.+
14 దేవా, అహంకారులు నా మీదికి లేస్తున్నారు;+క్రూరుల గుంపు నా ప్రాణం తీయాలని చూస్తోంది,నువ్వంటే వాళ్లకు లెక్కేలేదు.*+
15 కానీ యెహోవా, నువ్వు కరుణ, కనికరం* గల దేవుడివి,ఓర్పు,* అపారమైన విశ్వసనీయ ప్రేమ, నమ్మకత్వం గల* దేవుడివి.+
16 నా వైపు తిరిగి, నా మీద దయ చూపించు.+
నీ సేవకునికి నీ బలాన్ని ఇవ్వు,+నీ దాసురాలి కుమారుణ్ణి కాపాడు.
17 నీ మంచితనానికి సూచన* నాకు చూపించు.అప్పుడు, నన్ను ద్వేషించేవాళ్లు దాన్ని చూసి సిగ్గుపడతారు.
యెహోవా, నాకు సహాయం చేసేది, నన్ను ఓదార్చేది నువ్వే.
అధస్సూచీలు
^ లేదా “కిందికి వంగి, విను.”
^ లేదా “అవిభాగిత హృదయం.”
^ లేదా “వాళ్లు నిన్ను తమ ముందు ఉంచుకోలేదు.”
^ లేదా “దయ.”
^ లేదా “కోప్పడే విషయంలో నిదానించేవాడివి.”
^ లేదా “సత్యవంతుడివైన.”
^ లేదా “రుజువు.”