కీర్తనలు 53:1-6

  • మూర్ఖుల వర్ణన

    • “యెహోవా లేడు” (1)

    • “మంచి చేసేవాళ్లు ఎవ్వరూ లేరు” (3)

సంగీత నిర్దేశకునికి సూచన; మాహలతు* అనే శైలిలో పాడాలి. మాస్కిల్‌.* దావీదు కీర్తన. 53  “యెహోవా లేడు” అని మూర్ఖులు* తమ హృదయంలో అనుకుంటారు.+ వాళ్ల అవినీతి పనులు చెడ్డగా, అసహ్యంగా ఉంటాయి;మంచి చేసేవాళ్లు ఎవ్వరూ లేరు.+  2  అయితే లోతైన అవగాహన ఉన్నవాళ్లు, యెహోవాను వెతుకుతున్నవాళ్లు+ ఎవరైనా ఉన్నారేమోననిదేవుడు పరలోకం నుండి మనుషుల్ని చూస్తున్నాడు.+  3  వాళ్లంతా దారితప్పారు;అందరూ చెడిపోయారు. మంచి చేసేవాళ్లు ఎవ్వరూ లేరు,కనీసం ఒక్కడు కూడా లేడు.+  4  తప్పుచేసే వాళ్లెవ్వరికీ అర్థం కావడం లేదా? రొట్టెను తింటున్నట్టు వాళ్లు నా ప్రజల్ని మింగేస్తున్నారు. వాళ్లు యెహోవాకు ప్రార్థన చేయరు.+  5  కానీ వాళ్లు తీవ్రంగా భయపడతారు,ముందెన్నడూ లేనంతగా భయపడతారు,*ఎందుకంటే, నీ మీద దాడి చేసేవాళ్ల* ఎముకల్ని దేవుడు చెదరగొడతాడు. నువ్వు వాళ్లను సిగ్గుపడేలా చేస్తావు, ఎందుకంటే యెహోవా వాళ్లను తిరస్కరించాడు.  6  సీయోను+ నుండి ఇశ్రాయేలుకు రక్షణ రావాలి! బందీలుగా ఉన్న తన ప్రజల్ని యెహోవా మళ్లీ సమకూర్చినప్పుడు,యాకోబు సంతోషించాలి, ఇశ్రాయేలు ఉల్లసించాలి.

అధస్సూచీలు

పదకోశం చూడండి.
పదకోశం చూడండి.
లేదా “తెలివితక్కువవాళ్లు.”
లేదా “భయపడాల్సిందేమీ లేని చోట భయపడతారు” అయ్యుంటుంది.
అక్ష., “నిన్ను ముట్టడించేవాళ్ల.”