కీర్తనలు 40:1-17

  • సాటిలేని దేవునికి కృతజ్ఞతలు చెప్పడం

    • దేవుని పనులు లెక్కలేనన్ని (5)

    • దేవునికి కావల్సింది బలులు కాదు (6)

    • “నీ ఇష్టాన్ని నెరవేర్చడం నాకు సంతోషం” (8)

సంగీత నిర్దేశకునికి సూచన. దావీదు కీర్తన. శ్రావ్యగీతం. 40  యెహోవా కోసం నేను ఓపిగ్గా ఎదురుచూశాను,*సహాయం కోసం నేను పెట్టిన మొరను ఆయన చెవిపెట్టి* ఆలకించాడు.+  2  ఘోషించే నీళ్ల గోతిలో నుండి,లోతైన ఊబిలో నుండి ఆయన నన్ను పైకి లాగాడు. నా పాదాల్ని బండ మీద నిలిపాడు;నా అడుగుల్ని స్థిరపర్చాడు.  3  తర్వాత నా నోట ఒక కొత్త పాటను,+మన దేవుని స్తుతి పాటను పెట్టాడు. అది చూసి చాలామంది సంభ్రమాశ్చర్యాలకు లోనైయెహోవా మీద నమ్మకం ఉంచుతారు.  4  యెహోవా మీద నమ్మకముంచే వ్యక్తి,తిరుగుబాటు చేసేవాళ్లను, అబద్ధాలాడేవాళ్లను అనుసరించని వ్యక్తి సంతోషంగా ఉంటాడు.  5  యెహోవా, నా దేవా,నువ్వు మా కోసం ఎన్నో అద్భుతమైన పనులు చేశావు,మా విషయంలో నీకున్న ఆలోచనలు ఎన్నెన్నో;+ నీకు సాటి ఎవరూ లేరు;+నేను వాటి గురించి వివరించి చెప్పాలని ప్రయత్నిస్తే,అవి నేను లెక్కించలేనన్ని ఉంటాయి!+  6  బలిని, అర్పణను నువ్వు కోరుకోలేదు,*+కానీ నేను వినేలా నువ్వు నా చెవులు తెరిచావు.+ నువ్వు దహనబలుల్ని, పాపపరిహారార్థ బలుల్ని అడగలేదు.+  7  అప్పుడు నేను ఇలా అన్నాను: “ఇదిగో, నేను వచ్చాను. గ్రంథపు చుట్టలో నా గురించి రాయబడింది.+  8  నా దేవా, నీ ఇష్టాన్ని నెరవేర్చడం నాకు సంతోషం,*+నీ ధర్మశాస్త్రం నా అంతరంగంలో ఉంది.+  9  మహా సమాజంలో నేను నీతి సువార్త ప్రకటిస్తాను.+ నా పెదాల్ని మూసుకోను,+యెహోవా, అది నీకు బాగా తెలుసు. 10  నేను నీ నీతిని నా హృదయంలో దాచేయను. నీ నమ్మకత్వాన్ని, రక్షణను ప్రకటిస్తాను. నీ విశ్వసనీయ ప్రేమను, నీ సత్యాన్ని దాచకుండా మహా సమాజంలో తెలియజేస్తాను.”+ 11  యెహోవా, నా మీద కరుణ చూపించకుండా ఉండకు. నీ విశ్వసనీయ ప్రేమ, నీ సత్యం ఎప్పుడూ నన్ను కాపాడాలి.+ 12  లెక్కలేనన్ని విపత్తులు నన్ను చుట్టుముడుతున్నాయి.+ నేను ఎన్నో తప్పులు చేశాను, ఎటు వెళ్లాలో నాకు తెలియట్లేదు;+అవి నా తలవెంట్రుకల కన్నా ఎక్కువగా ఉన్నాయి,నా గుండె జారిపోయింది. 13  యెహోవా, దయచేసి నన్ను కాపాడు.+ యెహోవా, నాకు సహాయం చేయడానికి త్వరగా రా.+ 14  నా ప్రాణం తీయాలని చూసేవాళ్లంతాసిగ్గుపడాలి, అవమానాలపాలు అవ్వాలి. నా ఆపద చూసి సంతోషించేవాళ్లుఅవమానంతో పారిపోవాలి. 15  “ఆహా! ఆహా!” అని నాతో అంటున్నవాళ్లు తమకు జరిగిన అవమానాన్ని బట్టి నివ్వెరపోవాలి. 16  కానీ నిన్ను వెదికేవాళ్లు+నిన్ను బట్టి సంతోషించి, ఉల్లసించాలి.+ నీ రక్షణ కార్యాల్ని ప్రేమించేవాళ్లు “యెహోవా ఘనపర్చబడాలి” అని ఎప్పుడూ చెప్పాలి.+ 17  అయితే నేను నిస్సహాయుణ్ణి, దీనస్థితిలో ఉన్నాను;యెహోవా, నన్ను పట్టించుకో. నా సహాయకుడివి, రక్షకుడివి నువ్వే;+నా దేవా, ఆలస్యం చేయకు.+

అధస్సూచీలు

లేదా “ఎంతగానో ఆశపెట్టుకున్నాను.”
లేదా “వినడానికి కిందికి వంగి.”
లేదా “ఇష్టపడలేదు.”
లేదా “నా కోరిక.”