కీర్తనలు 34:1-22

  • యెహోవా తన సేవకుల్ని కాపాడతాడు

    • “మనం కలిసి ఆయన పేరును ఘనపరుద్దాం” (3)

    • యెహోవా దూత కాపాడతాడు (7)

    • “యెహోవా మంచివాడని రుచిచూసి తెలుసుకోండి” (8)

    • ‘అతని ఎముకల్లో ఒక్కటి కూడా విరగలేదు’ (20)

దావీదు కీర్తన. దావీదు అబీమెలెకు ముందు పిచ్చివాడిలా నటించినప్పుడు+ అతను దావీదును వెళ్లగొట్టడంతో, దావీదు అక్కడి నుండి వెళ్లిపోయినప్పటిది. א [ఆలెఫ్‌] 34  నేను ఎల్లప్పుడూ యెహోవాను స్తుతిస్తాను;ఆయన స్తుతి నా పెదాల మీద ఎప్పుడూ ఉంటుంది. ב [బేత్‌]  2  నేను యెహోవాను బట్టి గొప్పలు చెప్పుకుంటాను;+సాత్వికులు దాన్ని విని, ఉల్లసిస్తారు. ג [గీమెల్‌]  3  నాతో కలిసి యెహోవాను మహిమపర్చండి;+మనం కలిసి ఆయన పేరును ఘనపరుద్దాం. ד [దాలెత్‌]  4  నేను యెహోవా దగ్గర విచారణ చేశాను, ఆయన నాకు జవాబిచ్చాడు.+ నా భయాలన్నిటి నుండి ఆయన నన్ను రక్షించాడు.+ ה [హే]  5  ఆయన వైపు చూసిన ముఖాలు ప్రకాశించాయి;వాళ్లు ఎప్పటికీ అవమానాలపాలు కారు. ז [జాయిన్‌]  6  ఈ దీనుడు మొరపెట్టినప్పుడు యెహోవా విన్నాడు. అతని బాధలన్నిటి నుండి అతన్ని కాపాడాడు.+ ח [హేత్‌]  7  యెహోవాకు భయపడేవాళ్లందరి చుట్టూ ఆయన దూత కాపలా ఉండి+ వాళ్లను రక్షిస్తాడు.+ ט [తేత్‌]  8  యెహోవా మంచివాడని రుచిచూసి తెలుసుకోండి;+ఆయన్ని ఆశ్రయించేవాళ్లు సంతోషంగా ఉంటారు. י [యోద్‌]  9  యెహోవా పవిత్రులారా, మీరందరూ ఆయనకు భయపడండి,ఆయనకు భయపడేవాళ్లకు ఏ లోటూ ఉండదు.+ כ [కఫ్‌] 10  బలమైన కొదమ సింహాలు కూడా ఆకలితో ఉంటాయి,కానీ యెహోవాను వెదికేవాళ్లకు మంచిదేదీ కొదువ కాదు.+ ל [లామెద్‌] 11  నా కుమారులారా, రండి, నేను చెప్పేది వినండి;నేను మీకు యెహోవా పట్ల భయభక్తులు నేర్పిస్తాను.+ מ [మేమ్‌] 12  సంతోషంగా జీవిస్తూఎన్నో మంచి రోజులు చూడాలని మీలో ఎవరైనా కోరుకుంటున్నారా?+ נ [నూన్‌] 13  అలాగైతే, చెడ్డ మాటలు మాట్లాడకుండా మీరు మీ నాలుకను,+కపటంతో మాట్లాడకుండా మీ పెదాల్ని కాచుకోండి.+ ס [సామెఖ్‌] 14  చెడుకు దూరంగా ఉండండి, మంచి చేయండి;+శాంతిని వెదికి, దాన్ని వెంటాడండి.+ ע [అయిన్‌] 15  యెహోవా కళ్లు నీతిమంతుల్ని చూస్తూ ఉంటాయి,+ఆయన చెవులు వాళ్ల మొరలు వింటాయి.+ פ [పే] 16  కానీ యెహోవా ముఖం చెడు చేసేవాళ్లకు వ్యతిరేకంగా ఉంది,ఆయన వాళ్ల జ్ఞాపకాలన్నిటినీ భూమ్మీద నుండి తుడిచేస్తాడు.+ צ [సాదె] 17  నీతిమంతులు మొరపెట్టినప్పుడు యెహోవా విన్నాడు;+వాళ్ల కష్టాలన్నిటి నుండి ఆయన వాళ్లను కాపాడాడు.+ ק [ఖొఫ్‌] 18  విరిగిన హృదయంగలవాళ్లకు యెహోవా దగ్గరగా ఉంటాడు;+నలిగిన మనస్సుగలవాళ్లను* ఆయన కాపాడతాడు.+ ר [రేష్‌] 19  నీతిమంతునికి ఎన్నో కష్టాలు* వస్తాయి,+అయితే వాటన్నిటి నుండి యెహోవా అతన్ని కాపాడతాడు.+ ש [షీన్‌] 20  ఆయన అతని ఎముకలన్నిటినీ కాపాడుతున్నాడు;వాటిలో ఒక్కటి కూడా విరగలేదు.+ ת [తౌ] 21  విపత్తు దుష్టుల్ని చంపుతుంది;నీతిమంతుల్ని ద్వేషించేవాళ్లు అపరాధులుగా ఎంచబడతారు. 22  తన సేవకుల ప్రాణాల్ని యెహోవా విడిపిస్తున్నాడు;ఆయన్ని ఆశ్రయించే వాళ్లెవ్వరూ అపరాధులుగా ఎంచబడరు.+

అధస్సూచీలు

లేదా “నిరుత్సాహపడినవాళ్లను.”
లేదా “విపత్తులు.”