కీర్తనలు 20:1-9

  • దేవుని అభిషిక్త రాజుకు రక్షణ

    • కొందరు రథాల మీద, గుర్రాల మీద ఆధారపడతారు, ‘మనం మాత్రం యెహోవా పేరున మొరపెట్టుకుంటాం’ (7)

సంగీత నిర్దేశకునికి సూచన. దావీదు శ్రావ్యగీతం. 20  కష్టం వచ్చిన రోజున యెహోవా నీకు జవాబివ్వాలి. యాకోబు దేవుని పేరు నిన్ను కాపాడాలి.+  2  పవిత్ర స్థలం నుండి ఆయన నీకు సహాయం పంపించాలి,+సీయోను+ నుండి ఆయన నిన్ను ఆదుకోవాలి.  3  నువ్వు అర్పించిన కానుకలన్నీ ఆయన గుర్తుంచుకోవాలి;నీ దహనబలి కొవ్వును ఆయన స్వీకరించాలి. (సెలా)  4  ఆయన నీ హృదయ కోరికలు తీర్చాలి,+నీ ప్రణాళికలన్నీ* సఫలం చేయాలి.  5  నీ రక్షణ కార్యాల్ని బట్టి మేము ఆనందంగా కేకలు వేస్తాం;+మా దేవుని పేరున మా పతాకాలు ఎత్తుతాం.+ యెహోవా నీ విన్నపాలన్నిటినీ అనుగ్రహించాలి.  6  యెహోవా తన అభిషిక్తుణ్ణి+ కాపాడతాడని ఇప్పుడు నాకు తెలుసు. తన కుడిచేతితో గొప్ప రక్షణను* ఇవ్వడం ద్వారా+ఆయన తన పవిత్ర పరలోకం నుండి అతనికి జవాబిస్తాడు.  7  కొంతమంది రథాల మీద, మరికొంతమంది గుర్రాల మీద ఆధారపడతారు,+మనం మాత్రం మన దేవుడైన యెహోవా పేరున మొరపెట్టుకుంటాం.+  8  వాళ్లు కుప్పకూలి పడిపోయారు,కానీ మనం లేచి బలం పుంజుకున్నాం.+  9  యెహోవా, రాజును కాపాడు!+ సహాయం కోసం మేము మొరపెట్టే రోజున మాకు జవాబివ్వు.+

అధస్సూచీలు

లేదా “ఆలోచనలన్నీ.”
లేదా “విజయాలు.”