కీర్తనలు 15:1-5

  • యెహోవా గుడారంలో ఎవరు అతిథిగా ఉండగలరు?

    • అతను తన హృదయంలో సత్యం మాట్లాడతాడు (2)

    • లేనిపోనివి కల్పించి చెప్పడు (3)

    • నష్టం కలిగినా వాగ్దానాన్ని నిలబెట్టుకుంటాడు (4)

దావీదు శ్రావ్యగీతం. 15  యెహోవా, నీ గుడారంలో ఎవరు అతిథిగా ఉండగలరు? నీ పవిత్ర పర్వతం మీద ఎవరు నివసించగలరు?+  2  మచ్చ లేకుండా జీవిస్తూ,*+సరైనది చేస్తూ,+తన హృదయంలో సత్యాన్ని మాట్లాడే వ్యక్తే కదా.+  3  అతను తన నాలుకతో లేనిపోనివి కల్పించి చెప్పడు,+తన పొరుగువానికి ఏ కీడూ చేయడు,+తన స్నేహితుల పేరు చెడగొట్టడు.*+  4  అతనికి నీచుడంటే అసహ్యం,+యెహోవాకు భయపడేవాళ్లను అతను ఘనపరుస్తాడు. నష్టం కలిగినా, అతను తన వాగ్దానాన్ని* నిలబెట్టుకుంటాడు.+  5  అతను తన డబ్బును వడ్డీకి ఇవ్వడు,+నిర్దోషులకు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పడానికి లంచం తీసుకోడు.+ అలాంటి వ్యక్తి ఎప్పటికీ కదిలించబడడు.*+

అధస్సూచీలు

లేదా “యథార్థంగా నడుస్తూ.”
లేదా “స్నేహితుల్ని అవమానించడు.”
అక్ష., “ఒట్టును.”
లేదా “తడబడడు.”