కీర్తనలు 130:1-8

  • “తీవ్రమైన నిరాశలో ఉండి నీకు ప్రార్థిస్తున్నాను”

    • “నువ్వు తప్పుల్ని గమనిస్తూ ఉంటే” (3)

    • యెహోవా దగ్గర నిజమైన క్షమాపణ దొరుకుతుంది (4)

    • “ఆత్రంగా నా ప్రాణం యెహోవా కోసం ఎదురుచూస్తోంది” (6)

యాత్ర కీర్తన. 130  యెహోవా, తీవ్రమైన నిరాశలో ఉండి నీకు ప్రార్థిస్తున్నాను.+  2  యెహోవా, నా స్వరం విను. సహాయం కోసం నేను పెట్టే మొరల్ని నువ్వు ఆలకించాలి.  3  యెహోవా,* నువ్వు తప్పుల్ని గమనిస్తూ ఉంటే,*యెహోవా, ఎవరు నిలవగలరు?*+  4  అయితే, ప్రజలు నీ మీద భయభక్తులు చూపించేలా,+నీ దగ్గర నిజమైన క్షమాపణ దొరుకుతుంది.+  5  నేను యెహోవా మీద ఆశపెట్టుకుంటున్నాను, నా ప్రాణం ఆయన మీద ఆశపెట్టుకుంటోంది;ఆయన మాట కోసం నేను ఎదురుచూస్తున్నాను.  6  ఉదయం కోసం ఎదురుచూసే కావలివాడి కన్నా,+అవును, ఉదయం కోసం ఎదురుచూసే కావలివాడి కన్నా ఆత్రంగానా ప్రాణం యెహోవా కోసం ఎదురుచూస్తోంది.+  7  ఇశ్రాయేలు యెహోవా కోసం ఎదురుచూస్తూ ఉండాలి,ఎందుకంటే యెహోవా విశ్వసనీయ ప్రేమ చూపిస్తాడు.+ఆయనకున్న విడిపించే శక్తి గొప్పది.  8  ఆయన ఇశ్రాయేలు ప్రజల్ని వాళ్ల తప్పులన్నిటి నుండి విడిపిస్తాడు.

అధస్సూచీలు

అక్ష., “యా.” ఇది యెహోవా పేరుకు సంక్షిప్త రూపం.
లేదా “లెక్కపెట్టుకుంటూ వెళ్తే.”
లేదా “నిర్దోషిగా ఎంచబడతారు?”