యెహోవా
ఆయన పేరు
యెహోవా అనే పేరుకు “ఆయన అయ్యేలా (జరిగేలా) చేస్తాడు” అనే అర్థం ఉందని చెప్పవచ్చు
తన సేవకుల్ని చూసుకోవడానికి యెహోవా ఏం అవుతాడు లేదా ఎలాంటి పాత్రలు పోషిస్తాడు?
కీర్త 19:14; 68:5; యెష 33:22; 40:11; 2కొ 1:3, 4
కీర్త 118:14; యెష 30:20; యిర్మీ 3:14; జెక 2:5 కూడా చూడండి
దేవుని పేరు పవిత్రపర్చబడడం అత్యంత ప్రాముఖ్యమైన విషయమని ఎందుకు చెప్పవచ్చు?
విశ్వసర్వాధిపతైన యెహోవా మన విధేయతకు ఎందుకు అర్హుడు?
యెహోవాకున్న కొన్ని బిరుదులు
ఆశ్రయదుర్గం—ద్వితీ 32:4; యెష 26:4
తండ్రి—మత్త 6:9; యోహా 5:21
మహాగొప్ప ఉపదేశకుడు—యెష 30:20
మహాదేవుడు—హెబ్రీ 1:3; 8:1
యుగయుగాలకు రాజు—1తి 1:17; ప్రక 15:3
సర్వశక్తిమంతుడు—ఆది 17:1; ప్రక 19:6
సర్వోన్నత ప్రభువు—యెష 25:8; ఆమో 3:7
సర్వోన్నతుడు—ఆది 14:18-22; కీర్త 7:17
సైన్యాలకు అధిపతైన యెహోవా—1స 1:11
యెహోవాకున్న కొన్ని ముఖ్యమైన లక్షణాలు
తాను పవిత్రుణ్ణని యెహోవా ఎలా స్పష్టం చేశాడు, అది తెలుసుకున్న మనం ఏం చేయాలనుకుంటాం?
నిర్గ 28:36; లేవీ 19:2; 2కొ 7:1; 1పే 1:13-16
-
కొన్ని బైబిలు ఉదాహరణలు:
-
యెష 6:1-8—యెషయా ప్రవక్త యెహోవా పవిత్రత గురించి ఒక దర్శనాన్ని చూసినప్పుడు తన అపరిపూర్ణతను బట్టి మొదట్లో ఉక్కిరిబిక్కిరి అయ్యాడు, కానీ పాపులైన మనుషులు కూడా దేవుని దృష్టిలో పవిత్రంగా ఉండగలరని ఒక సెరాపు అతనికి గుర్తుచేశాడు
-
రోమా 6:12-23; 12:1, 2—అపరిపూర్ణతలతో ఎలా పోరాడాలో, ‘పవిత్రతకు సంబంధించి ఎలా ఫలించాలో’ అపొస్తలుడైన పౌలు చెప్పాడు
-
యెహోవా శక్తి ఎంత గొప్పది, ఆయన దాన్ని ఏయే విధాలుగా ఉపయోగిస్తాడు?
నిర్గ 15:3-6; 2ది 16:9; యెష 40:22, 25, 26, 28-31
-
కొన్ని బైబిలు ఉదాహరణలు:
-
ద్వితీ 8:12-18—యెహోవా ఇశ్రాయేలీయుల విషయంలో చాలా రకాలుగా తన శక్తిని ఉపయోగించాడు కాబట్టే వాళ్లు ఎన్నో మంచివాటిని పొందారని మోషే ప్రవక్త గుర్తుచేశాడు
-
1రా 19:9-14—కృంగిపోయిన ఏలీయా ప్రవక్తను ప్రోత్సహించడానికి యెహోవా తన గొప్ప శక్తిని చూపించాడు
-
యెహోవా న్యాయానికి ఏదీ సాటిరాదని ఎందుకు చెప్పవచ్చు?
ద్వితీ 32:4; యోబు 34:10; 37:23; కీర్త 37:28; యెష 33:22
-
కొన్ని బైబిలు ఉదాహరణలు:
-
ద్వితీ 24:16-22—యెహోవా ఎప్పుడు న్యాయం చూపించినా అందులో ఆయన కరుణ, ప్రేమ పరిపూర్ణంగా కనిపిస్తాయని మోషే ధర్మశాస్త్రం స్పష్టం చేసింది
-
2ది 19:4-7—మనుషుల కోసం కాదు యెహోవా కోసం న్యాయం తీర్చాలని రాజైన యెహోషాపాతు తాను నియమించిన న్యాయమూర్తులకు గుర్తుచేశాడు
-
యెహోవా మాత్రమే అత్యంత తెలివిగలవాడని ఎందుకు చెప్పవచ్చు?
కీర్త 104:24; సామె 2:1-8; యిర్మీ 10:12; రోమా 11:33; 16:27
కీర్త 139:14; యిర్మీ 17:10 కూడా చూడండి
-
కొన్ని బైబిలు ఉదాహరణలు:
-
1రా 4:29-34—తన కాలంలో జీవించిన వాళ్లందరి కన్నా సొలొమోను రాజుకు ఎక్కువ తెలివిని ఇచ్చి యెహోవా అతన్ని దీవించాడు
-
లూకా 11:31; యోహా 7:14-18—తెలివి విషయంలో సొలొమోను కన్నా యేసే గొప్పవాడు; అయినా తన తెలివికి మూలం యెహోవాయే అని యేసు వినయంగా గుర్తించాడు
-
ప్రేమే తన ప్రధాన లక్షణమని యెహోవా ఎలా చూపించాడు?
యోహా 3:16; రోమా 8:32; 1యో 4:8-10, 19
జెఫ 3:17; యోహా 3:35 కూడా చూడండి
-
కొన్ని బైబిలు ఉదాహరణలు:
-
మత్త 10:29-31—యేసు పిచ్చుకల ఉదాహరణ ఉపయోగించి యెహోవా తన మానవ సేవకుల్లో ప్రతీ ఒక్కర్ని ప్రేమిస్తున్నాడని, విలువైనవాళ్లుగా చూస్తున్నాడని చెప్పాడు
-
మార్కు 1:9-11—సాధారణంగా పిల్లలు అమ్మానాన్నల ప్రేమను, ఆమోదాన్ని కోరుకుంటారు, అలాగే తాము చేసినవాటిని వాళ్లు గుర్తించాలని ఆశిస్తారు. యెహోవా కూడా యేసుకు అవే అంటే తన ప్రేమను, ఆమోదాన్ని, గుర్తింపును ఇచ్చాడు
-
యెహోవాను ప్రేమించడానికి ఇంకొన్ని కారణాలు ఏంటి? ఆయనకున్న ఎన్నో మంచి లక్షణాల గురించి బైబిలు చెప్తుంది. వాటిలో కొన్ని . . .
ఆయన అన్నీ చూస్తాడు—2ది 16:9; సామె 15:3
ఎప్పటికీ ఉనికిలో ఉంటాడు; ఆది, అంతం లేనివాడు—కీర్త 90:2; 93:2
ఓర్పు గలవాడు—యెష 30:18; 2పే 3:9
కనికరం గలవాడు—యెష 49:15; 63:9; జెక 2:8
కరుణ గలవాడు—నిర్గ 34:6
దయ గలవాడు—లూకా 6:35; రోమా 2:4
నీతిమంతుడు—కీర్త 7:9
పెద్ద మనసు గలవాడు—కీర్త 104:13-15; 145:16
మహిమాన్వితుడు—ప్రక 4:1-6
మలా 3:6; యాకో 1:17
మార్పులేనివాడు; నమ్మదగినవాడు—వినయస్థుడు—కీర్త 18:35
విశ్వసనీయుడు—ప్రక 15:4
వైభవం గలవాడు—కీర్త 8:1; 148:13
శాంతిపరుడు—ఫిలి 4:9
సంతోషం గలవాడు—1తి 1:11
యెహోవా గురించి మరింత తెలుసుకునే కొద్దీ ఏం చేయాలనిపిస్తుంది?
యెహోవాను ఆరాధించడం
యెహోవా మనం చేయగలిగే వాటికి మించి కోరడని ఎలా చెప్పవచ్చు?
ద్వితీ 10:12; మీకా 6:8; 1యో 5:3
-
కొన్ని బైబిలు ఉదాహరణలు:
-
ద్వితీ 30:11-14—మోషే ధర్మశాస్త్రంలో ఉన్న నియమాలు ఇశ్రాయేలీయులు పాటించలేనంత కష్టమైనవి కావు
-
మత్త 11:28-30—అచ్చం తన తండ్రిలా ఉన్న యేసు, తను సేదదీర్పును ఇచ్చే యజమానినని తన అనుచరులకు అభయాన్ని ఇచ్చాడు
-
యెహోవా మన స్తుతికి ఎందుకు అర్హుడు?
కీర్త 105:1, 2; యెష 43:10-12, 21
యిర్మీ 20:9; లూకా 6:45; అపొ 4:19, 20 కూడా చూడండి
-
కొన్ని బైబిలు ఉదాహరణలు:
-
కీర్త 104:1, 2, 10-20, 33, 34—యెహోవాను స్తుతిస్తూ పాటలు పాడడానికి కీర్తనకర్తకు సృష్టిలో ఎన్నో కారణాలు కనిపించాయి
-
కీర్త 148:1-14—సృష్టిలో ఉన్న ప్రతీది అలాగే దేవదూతలందరూ యెహోవాను స్తుతిస్తున్నారు, మనం కూడా అలానే చేయాలి
-
మన ప్రవర్తన ద్వారా కూడా మనం యెహోవా గురించి ఎలా సాక్ష్యం ఇవ్వవచ్చు?
మత్త 5:16; యోహా 15:8; 1పే 2:12
యాకో 3:13 కూడా చూడండి
మనం యెహోవాకు ఎందుకు దగ్గరవ్వాలి?
యెహోవాకు దగ్గరవ్వడానికి వినయం ఎలా సహాయం చేస్తుంది?
యెహోవాకు దగ్గరవ్వడానికి బైబిలు చదవడం, ధ్యానించడం ఎలా సహాయం చేస్తాయి?
యెహోవా గురించి నేర్చుకున్నవాటిని పాటించడం ఎందుకు ప్రాముఖ్యం?
మనం ఎందుకు యెహోవా దగ్గర ఏదీ దాచకూడదు?
యోబు 34:22; సామె 28:13; యిర్మీ 23:24; 1తి 5:24, 25
-
కొన్ని బైబిలు ఉదాహరణలు:
-
2రా 5:20-27—గేహజీ తన పాపాన్ని దాచడానికి ప్రయత్నించాడు కానీ ఎలీషా ప్రవక్తకు నిజమేంటో తెలిసేలా యెహోవా చేశాడు
-
అపొ 5:1-11—పవిత్రశక్తిని మోసం చేయడానికి ప్రయత్నించినందుకు యెహోవా అననీయ, సప్పీరాలు చేసిన తప్పును బట్టబయలు చేసి, వాళ్లను శిక్షించాడు
-