ఆరాధన
ఆరాధనకు ఎవరు మాత్రమే అర్హులు?
నిర్గ 34:14; ద్వితీ 5:8-10; యెష 42:8
-
కొన్ని బైబిలు ఉదాహరణలు:
-
మత్త 4:8-10—ఒక్కసారి తనను ఆరాధిస్తే ఈ లోక రాజ్యాలన్నిటినీ ఇచ్చేస్తానని సాతాను యేసుకు చెప్పాడు, కానీ యేసు దానికి ఒప్పుకోకుండా యెహోవాను మాత్రమే ఆరాధించాలని చెప్పాడు
-
ప్రక 19:9, 10—అపొస్తలుడైన యోహాను ఒక శక్తివంతమైన దేవదూతను ఆరాధించడానికి ప్రయత్నించినప్పుడు ఆ దూత దానికి ఒప్పుకోలేదు
-
మనం ఎలా ఆరాధించాలని యెహోవా కోరుకుంటున్నాడు?
-
కొన్ని బైబిలు ఉదాహరణలు:
-
యెష 1:10-17—ఒకపక్క తనను ఆరాధిస్తూనే మరోపక్క చెడు పనులు చేస్తూ ఉండేవాళ్లను యెహోవా అసహ్యించుకుంటాడు
-
మత్త 15:1-11—బైబిలు ప్రమాణాల కన్నా మనుషుల ఆచారాలకే ఎక్కువ ప్రాముఖ్యతను ఇచ్చే ఆరాధనను యెహోవా అంగీకరించడని యేసు చెప్పాడు
-
పరిస్థితులు అనుకూలించకపోతే తప్ప, మనం ఎందుకు క్రమంగా సహోదర సహోదరీలతో కలిసి యెహోవాను ఆరాధించాలి?
కీర్త 133:1-3 కూడా చూడండి
-
కొన్ని బైబిలు ఉదాహరణలు:
-
అపొ 2:40-42—మొదటి శతాబ్దంలోని క్రైస్తవులు ప్రార్థించడానికి, సహవసించడానికి అలాగే పవిత్రశక్తి ప్రేరేపించిన బోధలను అధ్యయనం చేయడానికి కలుసుకునేవాళ్లు
-
1కొ 14:26-40—సంఘకూటాలు ప్రోత్సాహకరంగా క్రమపద్ధతిలో జరగాలని, అప్పుడే అక్కడ బోధించే విషయాలు అందరూ అర్థం చేసుకొని, నేర్చుకుంటారని అపొస్తలుడైన పౌలు చెప్పాడు
-
మనం చేసే ఆరాధన యెహోవా అంగీకరించాలంటే ఏం చేయాలి?
-
కొన్ని బైబిలు ఉదాహరణలు:
-
హెబ్రీ 11:6—మనం యెహోవాను సంతోషపెట్టే విధంగా ఆరాధించాలంటే విశ్వాసం ఖచ్చితంగా ఉండాలని అపొస్తలుడైన పౌలు వివరించాడు
-
యాకో 2:14-17, 24-26—విశ్వాసాన్ని చేతల్లో చూపించాలని యేసు తమ్ముడైన యాకోబు చెప్పాడు; విశ్వాసం ఉంటే దాన్ని మన పనుల్లో చూపిస్తాం
-