మొదటిసారి మాట్లాడేటప్పుడు
పాఠం 6
ధైర్యం చూపించండి
సూత్రం: “మన దేవుని సహాయంతో మేము ధైర్యం కూడగట్టుకుని, . . . మీకు దేవుని గురించిన మంచివార్తను ప్రకటించాం.”—1 థెస్స. 2:2.
యేసు ఏం చేశాడు?
1. వీడియో చూడండి, లేదా లూకా 19:1-7 చదవండి. తర్వాత ఈ ప్రశ్నల్ని చర్చించండి:
యేసు నుండి మనం ఏం నేర్చుకోవచ్చు?
2. పక్షపాతం లేకుండా ప్రతీ ఒక్కరికి దేవుని రాజ్యం గురించిన మంచివార్త ప్రకటించాలంటే మనకు ధైర్యం అవసరం.
యేసులా ఉందాం
3. యెహోవా మీద ఆధారపడండి. ప్రకటించడానికి పవిత్రశక్తి యేసుకు సహాయం చేసినట్టే మీకు కూడా సహాయం చేస్తుంది. (మత్త. 10:19, 20; లూకా 4:18) మీకు కొంతమందితో మాట్లాడడానికి భయంగా అనిపిస్తే ధైర్యం కోసం యెహోవాను అడగండి.—అపొ. 4:29.
4. ఎదుటి వ్యక్తి గురించి ముందే ఒక నిర్ణయానికి వచ్చేయకండి. మనం కొందరి ఆర్థిక స్థితి, జీవన విధానం, మత నమ్మకాలు, కనిపించే తీరును బట్టి వాళ్లతో మాట్లాడడానికి వెనుకాడుతుండవచ్చు. కానీ గుర్తుపెట్టుకోండి:
5. ధైర్యంగా ఉంటూనే, నేర్పుగా జాగ్రత్తగా మాట్లాడండి. (మత్త. 10:16) వాదనలకు దిగకండి. ఏదైనా ప్రమాదాన్ని పసిగట్టినా లేదా ఎదుటి వ్యక్తి మీతో మాట్లాడడానికి ఇష్టపడకపోయినా గౌరవపూర్వకంగా మీ మాటల్ని ముగించండి.—సామె. 17:14.