ఆ మొదటి ప్రేమను మరలా చూపండి
అధ్యాయం 7
ఆ మొదటి ప్రేమను మరలా చూపండి
ఎఫెసు
1. యేసు తన మొదటి వర్తమానమును ఏ సంఘానికిచ్చాడు, ఆయన అధ్యక్షులకు దేన్ని జ్ఞాపకం చేస్తున్నాడు?
యేసు మొట్టమొదటి వర్తమానం యిచ్చింది పత్మాసు ద్వీపానికి సమీపాన ఆసియా మైనరు ప్రాంతంలో వృద్ధిచెందుతున్న సముద్రతీర పట్టణమగు ఎఫెసులోని సంఘానికే. ఆయన యోహానుకిలా ఆజ్ఞాపిస్తున్నాడు: “ఎఫెసులో ఉన్న సంఘపు దూతకు ఈలాగు వ్రాయుము—ఏడు నక్షత్రములు తన కుడిచేత పట్టుకొని యేడు దీపస్తంభములమధ్య సంచరించువాడు చెప్పు సంగతులు.” (ప్రకటన 2:1) మిగతా ఆరు వర్తమానాలవలె, యేసు యిక్కడ తన అధికారపూర్వక స్థానం విషయం చెబుతున్నాడు. పెద్దలంతా తన రక్షిత కాపుదల క్రింద ఉన్నారని తానన్ని సంఘాలను సందర్శిస్తున్నాడని ఆయన ఎఫెసులోని కాపరులకు జ్ఞాపకం చేస్తున్నాడు. మన 20వ శతాబ్దం వరకును ఆయన యీ ప్రేమాపూర్వక శిరస్సత్వం నిర్వహిస్తూ, పెద్దలను పరిశీలిస్తూ, సంఘంతో సహవసించే వారందరిని దయతో కాయుచూ ఉన్నాడు. అప్పుడప్పుడూ, వెలుగు మరింత ప్రకాశించులాగున సంఘ ఏర్పాట్లను సరిచేస్తూంటాడు. అవును, యేసు దేవుని మందకు ప్రధానకాపరి.—మత్తయి 11:28-30; 1 పేతురు 5:2-4.
2. (ఎ) యేసు ఎఫెసు సంఘాన్ని ఏ శ్రేష్ఠమైన క్రియలనిమిత్తం అభినందించాడు? (బి) అపొస్తలుడైన పౌలిచ్చిన ఏ సలహాకు ఎఫెసులోని పెద్దలు నిజంగా విధేయులయ్యారు?
2 రెండింటిలో మినహా తక్కిన వర్తమానములను మెప్పుకోలు మాటలతో ప్రారంభించి యేసు అందరికి మాదిరి చూపిస్తున్నాడు. ఎఫెసు సంఘానికి ఆయన వర్తమానమిలా వున్నది: “నీ క్రియలను నీ కష్టమును నీ సహనమును నేనెరుగుదును; నీవు దుష్టులను సహింపలేవనియు, అపొస్తలులు కాకయే తాము అపొస్తలులమని చెప్పుకొనువారిని పరీక్షించి వారు అబద్ధికులని నీవు కనుగొంటివనియు, నీవు సహనము కలిగి నా నామము నిమిత్తము భారము భరించి అలయలేదనియు నేనెరుగుదును.” (ప్రకటన 2:2, 3) చాలా సంవత్సరాల క్రితం అపొస్తలుడైన పౌలు ఎఫెసు సంఘ పెద్దలకు “క్రూరమైన తోడేళ్లను” గూర్చి అంటే మందను పాడుచేసే మతభ్రష్టులను గూర్చి హెచ్చరించాడు, ఆయన అలయని మాదిరిని అనుసరిస్తూ “మెలకువగా ఉండుడి” అని ఆ పెద్దలకు చెప్పాడు. (అపొస్తలుల కార్యములు 20:29, 31) ఇప్పుడు యేసు వారిని వారి కష్టం, సహనానికి, అలయనందుకు అభినందిస్తున్నాడు గనుక వారా సలహాను పాటించి ఉండవచ్చును.
3. (ఎ) మనకాలంలో “అబద్ధ అపొస్తలులు” ఎలా మోసగించడానికి వెదికారు? (బి) పేతురు మతభ్రష్టులను గూర్చి ఏ హెచ్చరిక చేశాడు?
3 ప్రభువు దినములో కూడా “శిష్యులను తమవెంట ఈడ్చుకొని పోవలెనని వంకరమాటలు పలుకు” “దొంగ అపొస్తలులు” కనబడ్డారు. (2 కొరింథీయులు 11:13; అపొస్తలుల కార్యములు 20:30; ప్రకటన 1:10) పరస్పర విరుద్ధతగల మతశాఖలన్నిటిలోనూ మంచి ఉందంటూ, దేవునికో సంస్థలేదంటూ, 1914వ సంవత్సరంలో యేసు రాజ్యాధికారం పొందలేదంటారు. వారు 2 పేతురు 3:3, 4 లోని ప్రవచనాన్ని నెరవేరుస్తున్నారు: “అంత్యదినములలో అపహాసకులు అపహసించుచువచ్చి, తమ స్వకీయ దురాశలచొప్పున నడుచుకొనుచు,—ఆయన రాకడను గూర్చిన వాగ్దాన మేమాయెను? పితరులు నిద్రించినది మొదలుకొని సమస్తమును సృష్టి ఆరంభముననున్నట్టే నిలిచి యున్నదే అని చెప్పుదురు.”
4. (ఎ) అపహాసకుల అహం, తిరుగుబాటుతనం ఎలా బహిర్గతమౌతుంది? (బి) అబద్ధాలాడే వ్యతిరేకులయెడల ఎటువంటి చర్యగైకొనడంద్వారా క్రైస్తవులీనాడు తాము ఎఫెసీయుల వలె ఉన్నారని చూపిస్తున్నారు?
4 ఈ అపహాసకులు వారి విశ్వాసాన్ని బహిరంగంగా ప్రకటించాలనే తలంపునే తిరస్కరిస్తారు. (రోమీయులు 10:10) వారు వారి తొలి సహవాసులను గూర్చి అబద్ధాలు ప్రచారం చేయడానికి క్రైస్తవమత సామ్రాజ్య మతగురువుల మద్దతును, వార్తాపత్రికలు, దూరదర్శిని స్టేషన్ల సహాయాన్ని తీసుకున్నారు. నమ్మకమైనవారు వెంటనే దీన్ని పసిగట్టి యీ మోసగాళ్ల మాట, ప్రవర్తన అసత్యమని తెలుసుకున్నారు. ఎఫెసువలె, క్రైస్తవులీనాడు “దుష్టులను సహింపలేరు,” గనుక వారు తమ సంఘాలనుండి అట్టివారిని బహిష్కరిస్తారు. *
5. (ఎ) ఎఫెసీయులకు ఎటువంటి బలహీనత ఉందని యేసు చెప్పాడు? (బి) ఏ మాటలను ఎఫెసీయులు జ్ఞాపకముంచుకొని ఉంటారు?
5 అయిననూ, ఆయన ఏడు సంఘాల్లోని ఐదింటిని గూర్చి చెప్పినట్లే, ఇప్పుడు యేసు ఒక తీవ్రమైన సమస్యనుగూర్చి ప్రత్యేకించి చెబుతున్నాడు. ఆయన ఎఫెసు సంఘస్థులతో యిలా అంటున్నాడు: “అయినను మొదట నీకుండిన ప్రేమను నీవు వదిలితివని నేను నీమీద తప్పు ఒకటి మోపవలసియున్నది.” (ప్రకటన 2:4) వారీ విషయంలో తప్పిపోకుండ వుండాల్సింది, ఎందుకంటే, పౌలు 35 సంవత్సరాల క్రితమే దేవుడు “మనయెడల చూపిన తన మహా ప్రేమను” గూర్చి తెల్పుతూ, వారికిలా ఉపదేశించాడు: “కావున మీరు ప్రియులైన పిల్లలవలె దేవునిపోలి . . . క్రీస్తు మిమ్మును ప్రేమించి(నట్లే) . . . ప్రేమగలిగి నడుచుకొనుడి.” (ఎఫెసీయులు 2:4; 5:1, 2) అంతేకాదు, యేసు మాటలు కూడా వారి హృదయాల్లో చెరగని ముద్రవేసివుండాలి: “మన దేవుడైన ప్రభువు అద్వితీయ ప్రభువు. నీవు నీ పూర్ణహృదయముతోను, నీ పూర్ణాత్మతోను, నీ పూర్ణవివేకముతోను, నీ పూర్ణబలముతోను నీ దేవుడైన ప్రభువును (యెహోవాను, NW.) ప్రేమింపవలెను.” (మార్కు 12:29-31) ఎఫెసు సంఘస్థులు ఆ మొదటి ప్రేమను పోగొట్టుకొన్నారు.
6. (ఎ) సంఘంలో మనం పాతవారమైనా క్రొత్తవారమైనా ఎటువంటి అపాయం, పోకడల విషయంలో మనం జాగ్రత్తగా ఉండాలి? (బి) దేవునియెడల మనకున్న ప్రేమనుబట్టి మనమేమి చేయడానికి పురికొల్పబడాలి?
6 సంఘంలో మనం పాతవారమైనా, క్రొత్తవారమైనా యెహోవా యెడల మనకున్న మొదటి ప్రేమను పోగొట్టుకోకుండ జాగ్రత్తపడాలి. దీన్నెలా పోగొట్టుకోగలం? మన జీవితాల్లో ఉద్యోగ ప్రాధాన్యత, ఎక్కువ ధనాన్ని ఆర్జించాలనే కోరిక లేదా సుఖభోగాలకు మనం పెద్దపీట వేస్తుండవచ్చు. అలా మనం ఆత్మీయమైన మనస్సుగాక శారీరకమైన మనస్సు కల్గివుండొచ్చు. (రోమీయులు 8:5-8; 1 తిమోతి 4:8; 6:9, 10) అటువంటి లక్షణాలేవైనావుంటే, యెహోవా యెడల మనకున్న ప్రేమనుబట్టి వాటిని సవరించుకొని ‘పరలోకమందు మనకొరకు ధనమును దాచుకొనుటకు,’ ‘దేవుని రాజ్యాన్ని నీతిని మొదట వెదకుదాము.’—మత్తయి 6:19-21, 31-33.
7. (ఎ) యెహోవాకు మనంచేసే సేవ దేనితో నడిపించబడాలి? (బి) యోహాను ప్రేమనుగూర్చి ఏం చెప్పాడు?
7 యెహోవాకు మనం చేసే సేవ ఎల్లప్పుడు ఆయన యెడలగల ప్రగాఢమైన ప్రేమనుబట్టి పురికొల్పబడాలి. యెహోవా యేసుక్రీస్తు మనకొరకు చేసిన అన్నింటికి మనం మనఃపూర్వక మెప్పుదలను కల్గివుందాం. యోహాను ఆ తర్వాత యిలా రాశాడు: “మనము దేవుని ప్రేమించితిమనికాదు, తానే మనలను ప్రేమించి, మన పాపములకు ప్రాయశ్చిత్తమై యుండుటకు తన కుమారుని పంపెను; ఇందులో ప్రేమయున్నది.” యోహాను 1 యోహాను 4:10, 16, 21; హెబ్రీయులు 4:12; మరియు 1 పేతురు 4:8: కొలొస్సయులు 3:10-14; ఎఫెసీయులు 4:15 కూడ చూడండి.
యింకా మనకిలా రాస్తున్నాడు: “దేవుడు ప్రేమాస్వరూపియై యున్నాడు; ప్రేమయందు నిలిచియుండువాడు దేవునియందు నిలిచియున్నాడు, దేవుడు వానియందు నిలిచియున్నాడు.” యెహోవా, ప్రభువైన యేసుక్రీస్తు, మరియు జీవంగల దేవునివాక్యంయెడల మనకున్న ప్రేమను మనమెన్నటికీ వాడబార నీయకుందాము. మనం ఆసక్తితోచేసే దేవుని సేవలోనేగాక, “దేవుని ప్రేమించువాడు తన సహోదరునికూడ ప్రేమింపవలెనను ఆజ్ఞ”కు విధేయులగుటవల్ల కూడ ఈ ప్రేమను మనం చూపగలము.—“ఆ మొదటి క్రియలను చేయుము”
8. ఎఫెసీయులు ఎలా ప్రవర్తించాలని యేసు చెప్పాడు?
8 ఆ ఎఫెసీయులు అనుగ్రహాన్ని పోగొట్టుకోకుండా ఉండాలనుకుంటే, వారికి మొదట వున్న ప్రేమను వారు మళ్లీ కనబరచాలి. యేసు వారితో యిలా అంటున్నాడు: “నీవు ఏ స్థితిలోనుండి పడితివో అది జ్ఞాపకము చేసికొని మారుమనస్సుపొంది ఆ మొదటి క్రియలను చేయుము. అట్లుచేసి నీవు మారు మనస్సు పొందితేనే సరి; లేనియెడల నేను నీయొద్దకు వచ్చి నీ దీపస్తంభమును దాని చోటనుండి తీసివేతును.” (ప్రకటన 2:5) ఆ మాటలను ఎఫెసు సంఘంలోని క్రైస్తవులెలా స్వీకరించారు? మనకు తెలియదు. వారు పశ్చాత్తాపపడి, యెహోవాయెడల తమకున్న ప్రేమ తిరిగి మేల్కొనేలా చేసికొనడంలో విజయం సాధించారనుకుందాము. వారలా చేసివుండకపోతే, అప్పుడు వారి దీపం ఆర్పివేయబడి, వారి దీపస్తంభం తీసివేయబడి వుంటుంది. సత్యాన్ని ప్రకాశింపజేయడానికి తమకున్న ఆధిక్యతను కోల్పోయి వుంటారు.
9. (ఎ) యేసు ఎఫెసీయులకు ఎటువంటి ప్రోత్సాహకరమైన మాట కల్గివుండెను? (బి) యేసు ఎఫెసీయులకిచ్చిన సలహాను యోహాను కాలం తర్వాత సంఘాలెలా లక్ష్యపెట్టడంలో విఫలమయ్యాయి?
9 అయినను, యేసు ఎఫెసీయులను ప్రోత్సాహించే యీ మాటలు చెబుతున్నాడు: “అయితే ఈ యొకటి నీలో ఉన్నది, నీకొలాయితుల క్రియలు నీవు ద్వేషించు చున్నావు; నేనుకూడా వీటిని ద్వేషించుచున్నాను.” (ప్రకటన 2:6) ప్రభువైన యేసుక్రీస్తు ద్వేషిస్తున్నట్లే, కనీసం వారు మతభేదాలను ద్వేషించారు. అయిననూ, సంవత్సరాలు గడిచే కొలది, అనేక సంఘాలు యేసు మాటల్ని లక్ష్యపెట్టలేదు. యెహోవా యెడలను, సత్యంయెడలను, ఒకరియెడల ఒకరును ప్రేమను చూపడం లోపించినందున వారు ఆత్మీయ అంధకారంలో పడ్డారు. వారు తగవులాడే తెగలుగా ముక్కలయ్యారు. బైబిలును కాపీలుచేసే “క్రైస్తవులు,” తమకు యెహోవాయెడల ప్రేమ లోపించినందున, గ్రీకు బైబిల్ చేతివ్రాత ప్రతులనుండి దేవుని నామాన్నే తీసివేశారు. ప్రేమ లోపించినందువల్ల, క్రైస్తవత్వం పేరుతో నరకాగ్ని, పాపవిమోచనలోకం, మరియు త్రిత్వంవంటి బబులోను, గ్రీకుమత సిద్ధాంతాలను బోధించుటకు కూడ అవకాశమేర్పడింది. దేవునియెడల, సత్యంయెడల ప్రేమలేనందున, క్రైస్తవులని చెప్పుకున్న వారంతా దేవుని రాజ్యాన్నిగూర్చి ప్రకటించడం మానేశారు. వారీ భూమ్మీద తమసొంత రాజ్యాన్ని ఏర్పాటు చేసుకున్న స్వార్థపరులైన మతగురువుల తరగతి అధీనంలోకి వచ్చారు.—1 కొరింథీయులు 4:8 పోల్చండి.
10. క్రైస్తవమత సామ్రాజ్యం యొక్క మతపరిస్థితి 1918 లో ఎలా ఉంది?
10 దేవుని యింటితోనే 1918 లో తీర్పు ప్రారంభమైనప్పుడు, వివిధ శాఖలున్న క్రైస్తవమత సామ్రాజ్య మతగురువులు మొదటి ప్రపంచ యుద్ధానికి బహిరంగ మద్దతునిస్తూ, యిరువైపులనున్న కాథోలిక్కులను, ప్రొటెస్టెంటులను పరస్పరం చంపుకొమ్మని ఉద్బోధించారు. (1 పేతురు 4:17) నీకొలాయతు గుంపు చేసేపనులను ద్వేషించిన ఎఫెసు సంఘంవలెగాక, క్రైస్తవమత సామ్రాజ్యశాఖలు దీర్ఘకాలంగా విరుద్ధమైన, దైవవ్యతిరేక సిద్ధాంతాలతో చిన్నాభిన్నమయ్యాయి, మరియు తన శిష్యులు దాని సంబంధులు కాకూడదని యేసు చెప్పిన యీలోకంతోనే వారి మతగురువులు ఎంతో స్నేహంచేశారు. (యోహాను 15:17-19) దేవుని రాజ్యమే బైబిలు మూలాంశమని తెలియని వారి సంఘాలు, లేఖనానుసారమైన సత్యాన్ని ప్రకాశింపజేసే దీపస్తంభాలు కాలేదు, వాటి సభ్యులు యెహోవా ఆత్మీయ మందిరంలో సభ్యులుకాలేదు. వారిలో ప్రముఖులైన [స్త్రీ] పురుషులు నక్షత్రాలు కాలేదుగాని “ధర్మవిరోధి” సభ్యులని బయలుపర్చబడ్డారు.—2 థెస్సలొనీకయులు 2:3; మలాకీ 3:1-3.
11. (ఎ) ప్రపంచమందలి ఏ క్రైస్తవ గుంపు యేసు ఎఫెసు సంఘంతో చెప్పిన మాటల్ని 1918 లో పాటించింది? (బి) యోహాను తరగతి 1919 సంవత్సరం నుండి ఏమి చేస్తుంది?
11 అయితే యోహాను తరగతి, యెహోవాయెడల, ఆయనను మహాసక్తితో సేవించుటకు నడిపిన సత్యంయెడలగల ప్రేమతో ఆ మొదటి ప్రపంచయుద్ధపు అల్లకల్లోల కాలంనుండి బయటపడ్డారు. వాచ్‌టవర్ సొసైటీ మొదటి ప్రెసిడెంట్ చార్లెస్ టి. రస్సల్ 1916వ సంవత్సరంలో మరణించిన తదనంతరం మత్తయి 25:21, 23) యేసు రాజ్యాధికారంతోవచ్చే తన అదృశ్య ప్రత్యక్షతను గూర్చి యిచ్చిన సూచనయొక్క నెరవేర్పును వారు ప్రపంచ సంఘటనలనుబట్టి, వారి స్వానుభవంద్వారా గుర్తించారు. యేసు యిచ్చిన ఆ గొప్ప ప్రవచనంలో యింకను నెరవేరవలసిన దానిలో భాగం వహించుటకై వారు 1919వ సంవత్సరం నుండి ముందుకేగారు: “ఈ రాజ్యసువార్త సకల జనములకు సాక్ష్యార్థమై లోకమందంతటను ప్రకటింపబడును; అటు తరువాత అంతము వచ్చును.” (మత్తయి 6:9, 10: 24:3-14) యెహోవాయెడల వారికున్న ప్రేమ ఏదోవిధంగా లోపిస్తూ ఉన్నట్లయితే, అప్పటినుండి వారు నాశనానికే పరుగెత్తేవారు.
ఆయనే పూజనీయుడనడం ద్వారా మతాంతర్భేదాన్ని కల్గించడానికి ప్రయత్నించిన వారిని వారెదిరించారు. హింసలు, వ్యతిరేకతల మూలంగా క్రమశిక్షణ పొందినవారై, యీ క్రైస్తవగుంపు తమ యజమానుని నుండి “భళా”మంచి దాసుడా అనే స్పష్టమైన తీర్పుపొంది, ఆయన ఆనందంలో పాలుపంచుకొనడానికి ఆహ్వానాన్ని అందుకున్నారు. (12. (ఎ) మరి 1922 లో జరిగిన ఓ చారిత్రాత్మక సమావేశంలో ఏ ఆహ్వానం వచ్చింది? (బి) నిజమైన క్రైస్తవులు 1931 లో ఏ పేరుపెట్టుకున్నారు, మరివారు దేనికొరకు పశ్చాత్తాపపడ్డారు?
12 సెప్టెంబరు 5-13, 1922 లో అమెరికాలోని ఓహాయో నందలి సిడార్ పాయింట్‌లో జరిగిన సమావేశానికి ఈ క్రైస్తవులకు చెందిన 18,000 మంది హాజరైనపుడు ఓ ఆహ్వానం వెలువడింది: “సర్వోన్నతుని కుమారులారా, సేవకు బయలు దేరండి! . . . యెహోవాయే దేవుడని, యేసుక్రీస్తు రాజులకు రాజును ప్రభువులకు ప్రభువునై వున్నాడని లోకం తెలుసుకోవాలి. . . . గనుక రాజును ఆయన రాజ్యాన్ని ప్రకటించుడి, ప్రకటించుడి, ప్రకటించుడి.” యెహోవా ప్రశస్తమైన నామం మరెంతో ప్రఖ్యాతి గావించబడింది. అమెరికాలోని ఓహాయోనందలి కొలంబస్ నందు 1931 లో జరిగిన సమావేశానికి హాజరైన ఈ క్రైస్తవులు, యెషయా ప్రవచనంలో దేవుడు తెల్పిన యెహోవాసాక్షులు అనే పేరు పెట్టుకొని, అలా పిలువబడుటకు ఆనందించారు. (యెషయా 43:10, 12) మార్చి 1, 1939 సంచిక నుండి సంస్థయొక్క ప్రధాన పత్రిక పేరును ది వాచ్‌టవర్ అనౌన్సింగ్ జెహోవాస్ కింగ్‌డమ్, అని మార్చారు, ఆ విధంగా, మన సృష్టికర్తకు, ఆయన రాచరికపు ప్రభుత్వానికి ప్రథమ గౌరవాన్ని యిచ్చినట్లయింది. యెహోవాసాక్షులు, యెహోవాయెడలగల పునరుత్పన్నమైన ప్రేమతో, ఆయన మహోన్నత నామాన్ని, రాజ్యాన్ని మహిమపరచి, ఘనపర్చడంలో ముందెప్పుడైనా విఫలులైతే దాని విషయంలో పశ్చాత్తాపపడ్డారు.—కీర్తన 106:6, 47, 48.
“జయించువానికి”
13. (ఎ) ఎఫెసీయులు ‘జయిస్తే’ వారికి ఎటువంటి దీవెనలు వేచి యుండెను? (బి) ఎఫెస్సీనందలి క్రైస్తవులెలా ‘జయించ’గలిగారు?
13 చివరకు, యేసు తానిచ్చిన యితర వర్తమానమువలెనే, నమ్మకత్వానికి తగిన ప్రతిఫలంగా పరిశుద్ధాత్మ యేసుక్రీస్తు ద్వారా పనిచేస్తుందని చెబుతున్నాడు. ఎఫెసీయులతో ఆయనిలా అంటున్నాడు: “చెవిగలవాడు ఆత్మ సంఘములతో చెప్పుచున్నమాట వినునుగాక. జయించు వానికి దేవుని పరదైసులో ఉన్న జీవవృక్ష ఫలములు భుజింప నిత్తును.” (ప్రకటన 2:7) ఆ వర్తమానం యేసు యిష్టానుసారంగా కాకుండ, సర్వోన్నతుడగు ప్రభువైన యెహోవా నుండి ఆయన పరిశుద్ధాత్మ, లేక చురుకైన శక్తిద్వారానే వచ్చిందని వినే చెవులుగలవారు దాన్ని లక్ష్యపెట్టడానికి వేగిరపడాలి. మరి వారెలా ‘జయించగలరు’? మరణంవరకు యథార్థతను కాపాడుకొని, “ధైర్యము తెచ్చుకొనుడి, నేను లోకమును జయించియున్నానని,” చెప్పిన యేసు అడుగుజాడల్లో నడుచుకోవడం ద్వారా వారు లోకాన్ని జయించగలరు.—యోహాను 8:28; 16:33; 1 యోహాను 5:4 కూడ చూడండి.
14. యేసు తెల్పిన “దేవుని పరదైసు” నిశ్చయంగా దేనిని సూచిస్తుంది?
ఎఫెసీయులు 1:5-12; ప్రకటన 14:1, 4) కాబట్టి, ఇది నిశ్చయంగా యీ విజయులు ఆక్రమించుకొనబోయే పరలోక పరదైసువంటి ప్రాంతాన్ని సూచిస్తూండవచ్చు. అక్కడ, “దేవుని పరదైసులో,” అవును నిజంగా యెహోవా సముఖంలోనే, వారు జీవఫలాన్ని తింటున్నట్లు సూచించబడిన రీతిగా, అమర్త్యమనే వరాన్ని పొందిన యీ విజయులు యుగయుగాలు జీవిస్తారు.
14 మరి ఆ అభిషక్త క్రైస్తవులు, ఎఫెసులోని క్రైస్తవులవంటివారు, భూపరదైసులో జీవించే నిరీక్షణ లేనందువల్ల ఎలా “దేవుని పరదైసులో ఉన్న జీవవృక్ష ఫలములు” తినే దీవెనలందుకుంటారు? ఇది భూపరదైసు మాత్రంకాదు, ఎందుకంటే, ఎఫెసు సంఘస్థులతో సహా యీ 1,44,000 మంది అభిషక్త క్రైస్తవులు, ఆత్మీయ కుమారులుగా గొఱ్ఱెపిల్లయైన క్రీస్తుయేసుతోపాటు పరలోకపు సీయోను పర్వతముపై పరిపాలన చేయడానికి మనుష్యులలోనుండి కొనబడ్డారు. (15. జయించుడని యేసు యిచ్చిన ప్రోత్సాహకరమైన మాటలు యీనాటి గొప్పసమూహానికెందుకంత మంచి ఆసక్తిని కల్గిస్తున్నాయి?
15 మరి యీ 1,44,000 మంది అభిషక్తులకు భూమ్మీద నమ్మకంగా మద్దతునిస్తున్నవారి సంగతేమిటి? తోటి సాక్షులుగావున్న ఓ గొప్పసమూహం కూడ జయిస్తారు. అయితే వారి నిరీక్షణ భూపరదైసులో ప్రవేశించాలనే, అచ్చట వారు “జీవజలముల నది” నుండి త్రాగుతారు, ఆ నదికిరువైపుల నాటబడిన “వృక్షముయొక్క ఆకుల” నుండి వారు స్వస్థత పొందుతారు. (ప్రకటన 7:4, 9, 17; 22:1, 2) ఈ గుంపులో నీవును ఒకరివైనట్లయితే, యెహోవా యెడల నీకున్న మనఃపూర్వక ప్రేమను నీవుకూడ వ్యక్తంచేస్తూ, విశ్వాసపందెంలో విజయం సాధించవచ్చు. అలా భూపరదైసులో నిత్యజీవం పొందే సంతోషాన్ని సంపాదించుకోవచ్చును.—1 యోహాను 2:13, 14 పోల్చండి.
[అధస్సూచీలు]
^ పేరా 4 అబద్ధ అపొస్తలులను గూర్చిన చారిత్రాత్మక వివరాలకొరకు యీ పుస్తక ప్రచురణకర్తలవద్ద లభ్యమయ్యే రీజనింగ్ ఫ్రం ది ప్చర్స్ అనే పుస్తకంలో 37-44 వరకున్న పేజీలను చూడండి.
[అధ్యయన ప్రశ్నలు]
[-36వ పేజీలోని బాక్సు]
యెహోవాకు ఆయన కుమారునికి ప్రేమాపూర్వక స్తుతి
పాటల పుస్తకంలో అంటే 1905 లో యెహోవా ప్రజలు తయారు చేసుకున్నదానిలో, యెహోవాదేవుని స్తుతించే పాటలకన్నా యేసును స్తుతించేవి రెండింతలుగా ఉండేవి. మరి 1928 లో ప్రచురించబడిన సంవత్సరం పాటల పుస్తకంలో యేసును స్తుతించే పాటలెన్ని ఉండేవో, యెహోవాను స్తుతించేవి కూడ అన్నేఉండేవి. గాని, ఇటీవల 1984 సంవత్సరంలో తయారైన పాటల పుస్తకంలో, యేసు కన్న యెహోవాను స్తుతించే పాటలే నాలుగు రెట్లు ఎక్కువగా ఉన్నాయి. ఇది యేసు స్వయంగా చెప్పిన మాటలకు అనుగుణ్యంగా వుంది. “తండ్రి నాకంటె గొప్పవాడు.” (యోహాను 14:28) యెహోవా యెడల ప్రేమ ప్రధానంగా ఉండాలి, ఆ తర్వాత యేసు యెడల ప్రగాఢమైన ప్రేమను కల్గివుండుటతోపాటు దేవుని ప్రధాన యాజకునిగాను, రాజుగాను ఆయనకున్న స్థానానికి, ఆయన ప్రశస్తమైన బలినిమిత్తం అభినందన కల్గిగుండాలి.
[34వ పేజీలోని చిత్రం]
యేసు సలహాయిచ్చే పద్ధతి
(ప్రకటనలోని అధ్యాయాలు వచనాలు యివ్వబడ్డాయి)
సంఘానికి వర్తమానం సలహాయిచ్చే అధికారం తొలుత అభినందన తెల్పడం సమస్యను స్పష్టంగా గుర్తించుట సరిదిద్దుట మరియు⁄లేక
ప్రోత్సాహమిచ్చుట తద్వారా కలిగే దీవెనలు
ఎఫెసు 2:1 2:2, 3 2:4 2:5, 6 2:7
స్ముర్న 2:8 2:9 — 2:10 2:11
పెర్గము 2:12 2:13 2:14, 15 2:16 2:17
తుయతైర 2:18 2:19 2:20, 21 2:24, 25 2:26-28
సార్దీస్ 3:1 — 3:1, 2 3:3, 4 3:5
ఫిలదెల్ఫియ 3:7 3:8 — 3:8-11 3:12
లవొదికయ 3:14 — 3:15-17 3:18-20 3:21