లెసన్ 65
ఎస్తేరు తన ప్రజలను కాపాడుతుంది
పర్షియా పట్టణమైన షూషనులో ఎస్తేరు అనే యూదురాలు నివసించేది. చాలా సంవత్సరాల క్రితం, ఆమె కుటుంబాన్ని నెబుకద్నెజరు యెరూషలేము నుండి తెచ్చేశాడు. ఆమె బంధువైన మొర్దెకై ఆమెను పెంచాడు. అతను పర్షియా రాజైన అహష్వేరోషు సేవకుడు.
రాజైన అహష్వేరోషు కొత్త రాణి కావాలని అనుకున్నాడు. అతని సేవకులు ఆ దేశంలో ఉన్న అందమైన స్త్రీలను రాజు కోసం తెస్తారు, వాళ్లలో ఎస్తేరు కూడా ఉంది. వాళ్లందరిలో రాజు ఎస్తేరును రాణిగా ఎన్నుకున్నాడు. తాను యూదురాలు అని ఎవరితో చెప్పవద్దని మొర్దెకై ఎస్తేరుతో చెప్తాడు.
గర్విష్ఠియైన హామాను అనే అతను అధిపతులందరిపై నాయకుడిగా ఉన్నాడు. అందరూ అతనికి వంగి నమస్కారం చేయాలని కోరుకునేవాడు. మొర్దెకై అలా చేసేవాడు కాదు. అందుకని హామానుకు చాలా కోపం వచ్చి అతనిని చంపేయాలని అనుకున్నాడు. మొర్దెకై ఒక యూదుడని హామాను తెలుసుకున్నప్పుడు ఆ దేశంలో ఉన్న యూదులు అందర్నీ చంపేయాలని పథకం వేస్తాడు. ఆయన రాజుతో ఇలా చెప్పాడు: ‘యూదులు ప్రమాదకరమైన వాళ్లు. నువ్వు వాళ్లను చంపేయాలి.’ అహష్వేరోషు అతనితో, ‘నువ్వు ఏమి చేయాలని అనుకుంటే అది చెయ్యి,’ అని చెప్పి, శాసనం తయారు చేసే అధికారాన్ని అతనికి ఇస్తాడు. అదారు నెల 13వ రోజున యూదులందరినీ ప్రజలు చంపేయాలి అనే శాసనాన్ని హామాను తయారుచేశాడు. యెహోవా ఈ విషయాలను గమనిస్తున్నాడు.
ఎస్తేరుకు ఆ శాసనం గురించి తెలీదు. మొర్దెకై ఆమెకు ఒక ప్రతిని పంపించి ఇలా చెప్తాడు: ‘వెళ్లి, రాజుతో మాట్లాడు.’ ఎస్తేరు ఇలా చెప్పింది: ‘రాజు పిలవకుండా ఆయన దగ్గరకు వెళ్లేవాళ్లను చంపేస్తారు. రాజు నన్ను 30 రోజులుగా పిలవలేదు, కానీ నేను వెళ్తాను. ఆయన రాజ దండాన్ని చూపిస్తే నేను బ్రతుకుతాను, చూపించకపోతే చచ్చిపోతాను.’
ఎస్తేరు రాజభవనానికి వెళ్లింది. రాజు ఆమెను చూసి, తన రాజ దండాన్ని చూపిస్తాడు. ఆమె ఆయన దగ్గరకు వెళ్లినప్పుడు రాజు ఇలా అడుగుతాడు: ‘ఏమి కావాలి ఎస్తేరు చెప్పు?’ ఆమె ఇలా చెప్పింది: ‘మీరు,
హామాను విందుకు రావాలని కోరుకుంటున్నాను.’ వాళ్లు వచ్చినప్పుడు, ఇంకో విందుకు కూడా రమ్మని ఎస్తేరు అడుగుతుంది. రెండవ విందులో రాజు మళ్లీ ‘ఏమి కావాలి ఎస్తేరు చెప్పు?’ అని అడుగుతాడు. ఆమె ఇలా చెప్తుంది: ‘నన్ను, నా ప్రజలను ఎవరో చంపబోతున్నారు. దయచేసి మమ్మల్ని కాపాడండి.’ రాజు ‘మిమ్మల్ని ఎవరు చంపాలని అనుకుంటున్నారు?’ అని అడుగుతాడు. అప్పుడు ఆమె ‘చెడ్డవాడైన ఈ హామానే’ అని చెప్తుంది. అహష్వేరోషుకు చాలా కోపం వచ్చి, వెంటనే అతన్ని చంపేయమని చెప్తాడు.కానీ హామాను శాసనాన్ని ఎవరూ కొట్టివేయలేరు, రాజు కూడా. కాబట్టి రాజు మొర్దెకైని అధిపతుల మీద నాయకుడిని చేసి కొత్త శాసనాన్ని చేసే అధికారం ఇస్తాడు. యూదుల మీద దాడి జరిగినప్పుడు వాళ్లను వాళ్లు కాపాడుకునే శాసనాన్ని మొర్దెకై తయారు చేస్తాడు. అదారు నెల 13వ రోజున యూదులు వాళ్ల శత్రువులను ఓడిస్తారు. అప్పటినుండి వాళ్లు ప్రతీ సంవత్సరం ఆ విజయాన్ని పండుగలా జరుపుకుంటారు.
“నా కారణంగా మిమ్మల్ని అధిపతుల ముందుకు, రాజుల ముందుకు తీసుకెళ్తారు. అప్పుడు వాళ్లకు, అలాగే అన్యజనులకు నా గురించి సాక్ష్యమిచ్చే అవకాశం మీకు దొరుకుతుంది.”—మత్తయి 10:18