అధ్యాయం 6
లేఖనాన్ని స్పష్టంగా వివరించడం
యోహాను 10:33-36
ఏమి చేయాలి? ఒక లేఖనం చదివి, వేరే అంశంలోకి వెళ్లిపోకండి. ఆ లేఖనానికి, మీరు చెప్తున్న విషయానికి మధ్య ఉన్న సంబంధం ఏమిటో వినేవాళ్లకు అర్థమయ్యేలా చూడండి.
ఎలా చేయాలి?
-
లేఖనంలోని ముఖ్యమైన పదాలను నొక్కిచెప్పండి. లేఖనం చదివి, అందులో మీ ముఖ్యాంశానికి సంబంధమున్న పదాలను నొక్కిచెప్పండి. దాని కోసం, మీరు ఆ పదాలను మళ్లీ చెప్పవచ్చు లేదా వినేవాళ్లు ఆ పదాలను గుర్తించేలా ఒక ప్రశ్న వేయవచ్చు.
-
లేఖనంలో గుర్తుంచుకోవాల్సిన విషయం నొక్కిచెప్పండి. కొన్నిసార్లు మీరు లేఖనాన్ని పరిచయం చేయడానికి కొన్ని మాటలు చెప్పివుండవచ్చు లేదా ప్రశ్నలు వేసివుండొచ్చు. అలాంటప్పుడు లేఖనంలోని ముఖ్యమైన పదాలకు ఆ పరిచయ మాటలతో ఎలాంటి సంబంధం ఉందో వివరించండి.
-
తేలిగ్గా అర్థమయ్యేలా వివరించండి. ముఖ్యాంశంతో సంబంధంలేని అనవసరమైన వివరాలు చెప్పకండి. మీరు చెప్తున్న సమాచారం గురించి వినేవాళ్లకు ఎంతవరకు తెలుసో, ఇంకా ఏ వివరాలు చెప్తే సరిపోతుందో ఆలోచించండి.