అధ్యాయం 13
సమాచారం ఎలా ఉపయోగపడుతుందో చెప్పడం
యెషయా 48:17
ఏమి చేయాలి? మీరు చెప్పే విషయం తమ జీవితాల్లో ఎలా ఉపయోగపడుతుందో అర్థంచేసుకునేలా వినేవాళ్లకు సహాయం చేయండి, నేర్చుకున్నవాటిని ఎలా పాటించాలో చూపించండి.
ఎలా చేయాలి?
-
వినేవాళ్ల గురించి ఆలోచించండి. మీరు చెప్తున్న సమాచారం వాళ్లకు ఎందుకు అవసరమో, దానిలో ఏ విషయం వాళ్లకు బాగా ఉపయోగపడుతుందో ఆలోచించండి.
-
ప్రేక్షకులు ఏమి చేయాలో మీ ప్రసంగం అంతట్లో చెప్తూ ఉండండి. ప్రసంగం మొదటి నుండి, ‘ఇది నా కోసమే’ అని ప్రతీ ప్రేక్షకునికి అనిపించాలి. ఒక్కొక్క ముఖ్యాంశం వివరిస్తూ దాన్ని ఎలా పాటించాలో చెప్పండి. ఏమి పాటించాలో పైపైన కాకుండా నిర్దిష్టంగా చెప్పండి.