అధ్యాయం 10
స్వరాన్ని, వేగాన్ని మార్చడం
సామెతలు 8:4, 7
ఏమి చేయాలి? మీ స్వరాన్ని, వేగాన్ని మారిస్తే విషయాలను స్పష్టంగా చెప్పగలుగుతారు, వినేవాళ్ల హృదయాన్ని కదిలించగలుగుతారు.
ఎలా చేయాలి?
-
స్వరాన్ని పెంచండి లేదా తగ్గించండి. ముఖ్యాంశాలను నొక్కిచెప్పడానికి, వినేవాళ్లను కదిలించడానికి స్వరాన్ని పెంచండి. బైబిల్లో ఉన్న తీర్పు సందేశాలను చదువుతున్నప్పుడు కూడా స్వరాన్ని పెంచండి. ఆసక్తి పెంచడానికి లేదా భయాన్ని, దుఃఖాన్ని, ఆందోళనను తెలియజేయడానికి స్వరాన్ని తగ్గించండి.
-
స్వరాన్ని మార్చండి. పరిమాణాన్ని (size) లేదా దూరాన్ని సూచిస్తున్నప్పుడు పదాల్ని సాగదీసి చెప్పవచ్చు. ఉదాహరణకు, “పెద్ద ఊరు” అని చెప్తున్నప్పుడు “పె” అనే అక్షరాన్ని సాగదీసి పలకవచ్చు.
-
వేగాన్ని మార్చండి. ఉత్సాహాన్ని తెలియజేయడానికి వేగంగా మాట్లాడండి. ముఖ్యమైన విషయాలు చెప్తున్నప్పుడు నిదానంగా మాట్లాడండి.