కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

56వ పాఠం

సంఘంలో అందరితో ఐక్యంగా ఉండండి

సంఘంలో అందరితో ఐక్యంగా ఉండండి

తోటి ఆరాధకుల మధ్య ఉన్నప్పుడు, దావీదు రాజుకు అనిపించినట్టే మనకు కూడా అనిపిస్తుంది: “సహోదరులు ఐక్యంగా కలిసిమెలిసి జీవించడం ఎంత మంచిది! ఎంత మనోహరమైనది!” (కీర్తన 133:1) మన మధ్య ఐక్యత దానంతట అదే రాలేదు. మనలో ప్రతీ ఒక్కరం దాని కోసం కృషి చేస్తున్నాం.

1. దేవుని ప్రజల మధ్య ఉన్న ప్రత్యేకత ఏంటి?

మీరు వేరే దేశంలో మీటింగ్‌కి హాజరైతే, బహుశా అక్కడి భాష మీకు అర్థం కాకపోవచ్చు కానీ, మీకు మీ సంఘంలో ఉన్నట్టే అనిపించవచ్చు. ఎందుకంటే, మనం ఎక్కడికి వెళ్లినా ఒకే రకమైన ప్రచురణలు ఉపయోగించి బైబిల్ని అధ్యయనం చేస్తాం. అలాగే ఒకరి మీద ఒకరం ప్రేమ చూపించుకోవడానికి కృషి చేస్తాం. ప్రపంచంలో ఎక్కడున్నా, మనందరం ‘యెహోవా పేరు ఉపయోగించి ప్రార్థిస్తాం, ఐక్యంగా ఆయన్ని సేవిస్తాం.’జెఫన్యా 3:9.

2. ఐక్యతను కాపాడడానికి మీరేం చేయవచ్చు?

“మనస్ఫూర్తిగా ఒకరి మీద ఒకరు ప్రగాఢమైన ప్రేమ చూపించుకోండి” అని బైబిలు చెప్తుంది. (1 పేతురు 1:22) ఈ సలహాను మీరు ఎలా పాటించవచ్చు? వేరేవాళ్ల లోపాల మీద మనసుపెట్టే బదులు, వాళ్లలో ఉన్న మంచి లక్షణాల్ని చూడండి. సంఘంలో మీలాంటి ఇష్టాలున్న వాళ్లతోనే స్నేహం చేసే బదులు, అన్నిరకాల వాళ్లతో పరిచయం పెంచుకోండి. అంతేకాదు వీళ్లు ఎక్కువ, వాళ్లు తక్కువ అనే ఆలోచన మీలో ఉంటే, దాన్ని తీసేసుకోవడానికి గట్టిగా ప్రయత్నించండి.—1 పేతురు 2:17 చదవండి. a

3. తోటి క్రైస్తవునితో మనస్పర్థలు వచ్చినప్పుడు మీరేం చేస్తారు?

మనం ఐక్యంగా ఉంటాం. కానీ, మనం అపరిపూర్ణులం కాబట్టి కొన్నిసార్లు ఒకరినొకరం నొప్పించుకుంటాం, బాధ పెట్టుకుంటాం. అందుకే బైబిలు ఇలా చెప్తుంది: “ఒకరినొకరు క్షమించుకుంటూ ఉండండి. . . . యెహోవా మిమ్మల్ని మనస్ఫూర్తిగా క్షమించినట్టే మీరూ క్షమించాలి.” (కొలొస్సయులు 3:13 చదవండి.) మనం యెహోవాను లెక్కలేనన్నిసార్లు బాధపెట్టాం, అయినా ఆయన మనల్ని క్షమించాడు. కాబట్టి మనం కూడా మన సహోదరుల్ని క్షమించాలని ఆయన కోరుతున్నాడు. మీరు ఎవరినైనా బాధపెట్టారని అనిపిస్తే, సమాధానపడడానికి మీరే చొరవ తీసుకోండి.—మత్తయి 5:23, 24 చదవండి. b

ఎక్కువ తెలుసుకోండి

సంఘంలో ఐక్యత, శాంతి ఉండడానికి మీరేం చేయవచ్చో తెలుసుకోండి.

సమాధానపడడానికి మీరేం చేస్తారు?

4. అందర్నీ సమానంగా చూడండి

మనం మన సహోదరులందర్నీ ప్రేమించాలని కోరుకుంటాం. అయితే కొన్నిసార్లు వేరే భాష, జాతి, సంస్కృతికి చెందిన వాళ్లను ప్రేమించడం కష్టంగా ఉండవచ్చు. మరి మనకు ఏది సహాయం చేస్తుంది? అపొస్తలుల కార్యాలు 10:34, 35 చదవండి, తర్వాత ఈ ప్రశ్నల్ని చర్చించండి:

  • యెహోవా అన్నిరకాల ప్రజల్ని సమానంగా చూస్తున్నాడు. కాబట్టి వేరే భాష, జాతి, సంస్కృతికి చెందిన వాళ్లను మీరు ఎలా చూడాలి?

  • వేటిని బట్టి మీ ప్రాంతంలోని వాళ్లు కొందర్ని తక్కువగా చూస్తారు? అలాంటి ఆలోచనను మీరు ఎందుకు తీసేసుకోవాలి?

2 కొరింథీయులు 6:11-13 చదవండి, తర్వాత ఈ ప్రశ్నను చర్చించండి:

  • మీరు హద్దులు పెట్టుకోకుండా, సహోదర సహోదరీలందరి మీద ఎలా ప్రేమ చూపించవచ్చు?

5. మనస్ఫూర్తిగా క్షమించండి, సమాధానపడండి

మనం యెహోవాను క్షమించాల్సిన పరిస్థితి ఎప్పుడూ రాదు, అయినా ఆయన మనల్ని మనస్ఫూర్తిగా క్షమిస్తున్నాడు. కీర్తన 86:5 చదవండి, తర్వాత ఈ ప్రశ్నల్ని చర్చించండి:

  • యెహోవా క్షమాగుణం గురించి ఈ వచనం ఏం చెప్తుంది?

  • యెహోవా క్షమాగుణం పట్ల మీరు కృతజ్ఞతతో ఉన్నారా? ఎందుకు?

  • ఏ పరిస్థితుల్లో ఇతరులతో సమాధానపడడం మనకు కష్టంగా అనిపించవచ్చు?

మనం యెహోవాలాగే క్షమాగుణాన్ని చూపిస్తూ, సహోదర సహోదరీలతో ఎలా ఐక్యంగా ఉండవచ్చు? సామెతలు 19:11 చదవండి, తర్వాత ఈ ప్రశ్నను చర్చించండి:

  • ఎవరైనా మీకు చిరాకు తెప్పిస్తే లేదా బాధపెడితే, మీరేం చేయవచ్చు?

కొన్నిసార్లు మనమే వేరేవాళ్లను బాధపెడతాం. అలాంటప్పుడు మనం ఏం చేయాలి? వీడియో చూడండి, తర్వాత ఈ ప్రశ్నను చర్చించండి.

  • ఈ వీడియోలో ఉన్న సహోదరి, సమాధానపడడానికి ఏం చేసింది?

6. మీ సహోదర సహోదరీల్లో మంచిని చూడండి

మనం మన సహోదర సహోదరీలకు దగ్గరయ్యే కొద్దీ, వాళ్లలో ఉన్న మంచే కాదు లోపాలు కూడా కనిపిస్తాయి. అయితే, మనం వాళ్లలో ఉన్న మంచి మీదే ఎలా మనసుపెట్టవచ్చు? వీడియో చూడండి, తర్వాత ఈ ప్రశ్నను చర్చించండి.

  • సహోదర సహోదరీల్లో మంచి లక్షణాలు చూడడానికి మీకు ఏది సహాయం చేస్తుంది?

యెహోవా మనలో ఉన్న మంచి లక్షణాల మీద మనసుపెడతాడు. 2 దినవృత్తాంతాలు 16:9ఎ చదవండి, తర్వాత ఈ ప్రశ్నను చర్చించండి:

  • యెహోవా మీలో ఉన్న మంచి లక్షణాల మీద మనసుపెడతాడు అని తెలుసుకున్నప్పుడు మీకెలా అనిపిస్తుంది?

అందమైన వజ్రంలో కూడా లోపాలు ఉంటాయి, అయినా అది విలువైనదే. అదేవిధంగా, మన సహోదర సహోదరీలందరిలో లోపాలు ఉంటాయి, అయినా వాళ్లు యెహోవాకు విలువైనవాళ్లే

కొంతమంది ఇలా అంటారు: “అతన్ని క్షమించడానికి నాకు మనసు రావట్లేదు.”

  • మనం వేరేవాళ్లను క్షమించడానికి ఎందుకు సిద్ధంగా ఉండాలి?

ఒక్కమాటలో

క్షమించడానికి సిద్ధంగా ఉండడం ద్వారా, మీ సహోదర సహోదరీలందర్నీ ప్రేమించడం ద్వారా సంఘంలో ఐక్యతను కాపాడడానికి మీరు సహాయం చేయవచ్చు.

మీరేం నేర్చుకున్నారు?

  • వీళ్లు ఎక్కువ, వాళ్లు తక్కువ అనే ఆలోచనను మీరు ఎలా తీసేసుకోవచ్చు?

  • తోటి క్రైస్తవునితో మనస్పర్థలు వచ్చినప్పుడు మీరేం చేస్తారు?

  • యెహోవాలాగే మీరు కూడా వేరేవాళ్లను క్షమించాలని అనుకుంటున్నారా? ఎందుకు?

ఇలా చేసి చూడండి:

ఇవి కూడా చూడండి

వేరేవాళ్లకు తీర్పు తీర్చకుండా ఉండడానికి యేసు చెప్పిన ఉదాహరణ ఎలా సహాయం చేస్తుందో చూడండి.

దూలాన్ని తీసేయండి (7:01)

మన తప్పేమీ లేకపోయినా మనం క్షమాపణ చెప్పాలా?

“క్షమాపణ చెప్పడం సమాధానపడడానికి కీలకం” (కావలికోట, నవంబరు 1, 2002)

ఇతరుల మీద పక్షపాతం చూపించకుండా ఉండాలని కొంతమంది ఎలా నేర్చుకున్నారో చూడండి.

పైకి కనిపించే వాటిని బట్టి తీర్పు తీర్చకండి (5:06)

సంఘంలో శాంతి పాడవ్వకముందే, మనస్పర్థల్ని ఎలా పరిష్కరించుకోవచ్చో తెలుసుకోండి.

“అభిప్రాయభేదాల్ని ప్రేమతో పరిష్కరించుకోండి” (కావలికోట, మే 2016)

a తమ వల్ల వేరేవాళ్లకు అంటువ్యాధి సోకకుండా క్రైస్తవులు ప్రేమతో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారో అదనపు సమాచారంలో 6వ పాయింట్‌ చూడండి.

b వ్యాపారపరమైన, చట్టపరమైన విషయాల్ని ఎలా పరిష్కరించుకోవచ్చో తెలుసుకోవడానికి అదనపు సమాచారంలో 7వ పాయింట్‌ చూడండి.