21వ పాఠం
మంచివార్తను ఎవరు ప్రకటిస్తున్నారు, ఎలా ప్రకటిస్తున్నారు?
త్వరలో, యెహోవా తన రాజ్యం లేదా ప్రభుత్వం ద్వారా మన సమస్యలన్నీ తీసేస్తాడు. అది ఎంత మంచివార్త అంటే దాన్ని అందరూ తెలుసుకోవాలి! తన శిష్యులు ఈ మంచివార్తను అందరికీ చెప్పాలని యేసు కోరుకున్నాడు. (మత్తయి 28:19, 20) యేసు ఇచ్చిన ఆజ్ఞను యెహోవాసాక్షులు ఎలా పాటిస్తున్నారు?
1. మత్తయి 24:14 ఇప్పుడు ఎలా నెరవేరుతోంది?
“ఈ రాజ్య సువార్త భూమంతటా ప్రకటించబడుతుంది” అని యేసు ముందే చెప్పాడు. (మత్తయి 24:14) ఈ ముఖ్యమైన పనిని యెహోవాసాక్షులు సంతోషంగా చేస్తున్నారు. మేము ప్రపంచవ్యాప్తంగా 1,000 కన్నా ఎక్కువ భాషల్లో ఈ మంచివార్తను ప్రకటిస్తున్నాం! ఇంత పెద్ద పని జరగాలంటే సమయం, కృషి అవసరం, అంతేకాదు దాన్ని ఒక పద్ధతి ప్రకారం చేయాలి. యెహోవా సహాయం లేకుండా ఇదంతా జరగదు.
2. ప్రజలకు ప్రకటించడానికి మేము ఎలా కృషిచేస్తాం?
ప్రజలు ఎక్కడ ఉంటే అక్కడ మేము ప్రకటిస్తాం. మొదటి శతాబ్దంలోని క్రైస్తవుల్లాగే మేము ‘ఇంటింటికి’ వెళ్లి ప్రకటిస్తాం. (అపొస్తలుల కార్యాలు 5:42) ఇలా ఒక పద్ధతి ప్రకారం చేయడం వల్ల, ప్రతీ సంవత్సరం లక్షలమందికి ప్రకటించగలుగుతున్నాం. ప్రజలు అన్ని సమయాల్లో ఇంట్లోనే ఉండరు కాబట్టి మేము మార్కెట్, పార్క్, బస్‌స్టాండ్ వంటి చోట్ల కూడా ప్రకటిస్తాం. యెహోవా గురించి, ఆయన చేయాలనుకున్న వాటన్నిటి గురించి వేరేవాళ్లకు చెప్పే అవకాశాల కోసం మేము ఎప్పుడూ చూస్తుంటాం.
3. మంచివార్తను ప్రకటించాల్సిన బాధ్యత ఎవరికి ఉంది?
మంచివార్తను ప్రకటించాల్సిన బాధ్యత నిజ క్రైస్తవులందరికీ ఉంది. మేము ఆ బాధ్యతను తేలిగ్గా తీసుకోం. ఈ పని ప్రజల ప్రాణాల్ని రక్షిస్తుంది కాబట్టి మేము దానికోసం చేయగలిగినదంతా చేస్తాం. (1 తిమోతి 4:16 చదవండి.) ఈ పని చేస్తున్నందుకు మేము డబ్బులు తీసుకోం. ఎందుకంటే, యేసు ఇలా చెప్పాడు: “మీరు ఉచితంగా పొందారు, ఉచితంగా ఇవ్వండి.” (మత్తయి 10:7, 8) మేము చెప్పేది అందరూ వినకపోవచ్చు, అయినా మేము ప్రకటిస్తూనే ఉంటాం. ఎందుకంటే, ప్రకటించడం మా ఆరాధనలో ఒక భాగం. అంతేకాదు, అది యెహోవాను సంతోషపెడుతుంది.
ఎక్కువ తెలుసుకోండి
భూమంతటా ప్రకటించడానికి యెహోవాసాక్షులు ఎంతగా కష్టపడుతున్నారో తెలుసుకోండి. అలాగే, యెహోవా మాకు ఎలా సహాయం చేస్తున్నాడో కూడా చూడండి.
4. ప్రజలందరికీ ప్రకటించడానికి మేము ఎంతో కష్టపడతాం
అన్నిచోట్లా ఉన్న ప్రజలకు ప్రకటించడానికి యెహోవాసాక్షులు ఎంతో కష్టపడతారు. వీడియో చూడండి, తర్వాత ఈ ప్రశ్నను చర్చించండి.
-
ప్రకటించడానికి యెహోవాసాక్షులు ఎంతగా కష్టపడుతున్నారో చూశారు కదా, అందులో మీకు ఏది బాగా నచ్చింది?
మత్తయి 22:39; రోమీయులు 10:13-15 చదవండి, తర్వాత ఈ ప్రశ్నల్ని చర్చించండి:
-
మేము సాటిమనిషిని ప్రేమిస్తాం అని మా పరిచర్య ఎలా చూపిస్తుంది?
-
మంచివార్త ప్రకటించేవాళ్ల గురించి యెహోవా ఏం అనుకుంటున్నాడు?—15వ వచనం చూడండి.
5. మేము దేవుని తోటి పనివాళ్లం
యెహోవా మా పనిని నడిపిస్తున్నాడని చాలా అనుభవాలు చూపిస్తున్నాయి. ఉదాహరణకు, న్యూజిలాండ్‌లో పౌల్ అనే సహోదరుడు ఒక రోజు మధ్యాహ్నం ఇంటింటికి వెళ్లి ప్రకటిస్తున్నప్పుడు ఒకామెను కలిశాడు. ఆ రోజు ఉదయమే ఆమె యెహోవా పేరు ఉపయోగించి ప్రార్థిస్తూ, తన దగ్గరికి ఎవరినైనా పంపించమని అడిగింది. “సరిగ్గా మూడు గంటల తర్వాత నేను ఆమె ఇంటి తలుపు తట్టాను” అని పౌల్ చెప్తున్నాడు.
1 కొరింథీయులు 3:9 చదవండి, తర్వాత ఈ ప్రశ్నను చర్చించండి:
-
పైన చెప్పిన లాంటి అనుభవాలు, యెహోవాయే ప్రకటనా పనిని నడిపిస్తున్నాడని ఎలా చూపిస్తున్నాయి?
అపొస్తలుల కార్యాలు 1:8 చదవండి, తర్వాత ఈ ప్రశ్నను చర్చించండి:
-
ప్రకటనా పని చేయడానికి యెహోవా సహాయం ఎందుకు అవసరం?
మీకు తెలుసా?
వారం మధ్యలో జరిగే మీటింగ్స్‌లో మేము ఎలా ప్రకటించాలో నేర్చుకుంటాం. మీరు ఎప్పుడైనా ఆ మీటింగ్‌కి వచ్చారా? అక్కడ ఇచ్చే శిక్షణ గురించి మీకేం అనిపిస్తుంది?
6. ప్రకటించమని దేవుడు ఇచ్చిన ఆజ్ఞను మేము పాటిస్తాం
మొదటి శతాబ్దంలో, యేసు శిష్యులు ప్రకటిస్తున్నప్పుడు శత్రువులు ఆపడానికి ప్రయత్నించారు. అప్పుడు ఆ క్రైస్తవులు, చట్టాన్ని ఉపయోగించుకుని మంచివార్త ప్రకటించే తమ హక్కును కాపాడుకున్నారు. (ఫిలిప్పీయులు 1:7) నేడు యెహోవాసాక్షులు కూడా అదే చేస్తున్నారు. a
అపొస్తలుల కార్యాలు 5:27-42 చదవండి, తర్వాత ఈ ప్రశ్నను చర్చించండి:
-
మేము ఎందుకు ప్రకటించడం ఆపం?—29, 38, 39 వచనాలు చూడండి.
కొంతమంది ఇలా అడుగుతారు: “యెహోవాసాక్షులు ఎందుకు ఇంటింటికి వెళ్తారు?”
-
వాళ్లకు మీరేం చెప్తారు?
ఒక్కమాటలో
అన్ని దేశాల ప్రజలకు మంచివార్త ప్రకటించమని యేసు తన శిష్యులకు చెప్పాడు. ఈ పనిలో యెహోవా తన ప్రజలకు సహాయం చేస్తున్నాడు.
మీరేం నేర్చుకున్నారు?
-
మంచివార్తను ఎవరు ప్రకటిస్తున్నారు?
-
మేము సాటిమనిషిని ప్రేమిస్తాం అని మా పరిచర్య ఎలా చూపిస్తుంది?
-
ప్రకటనా పని సంతోషాన్ని ఇస్తుందని మీరు అనుకుంటున్నారా? ఎందుకు?
ఇవి కూడా చూడండి
పెద్దపెద్ద నగరాల్లో యెహోవాసాక్షులు ప్రజలకు ఎలా ప్రకటిస్తున్నారో చూడండి.
శరణార్థులకు యెహోవాసాక్షులు ఎలా సహాయం చేశారో చూడండి.
జీవితాన్ని పరిచర్యకు అంకితం చేస్తే ఎంత సంతోషంగా ఉంటుందో ఒకామె మాటల్లో వినండి.
కోర్టు ఇచ్చిన కొన్ని ముఖ్యమైన తీర్పుల వల్ల మంచివార్త ప్రకటించడం ఎలా తేలికైందో తెలుసుకోండి.
“రాజ్య ప్రచారకులు కోర్టును ఆశ్రయించడం” (దేవుని రాజ్యం పరిపాలిస్తోంది!, 13వ అధ్యాయం)
a ప్రకటించమనే ఆజ్ఞను దేవుడే ఇచ్చాడు. కాబట్టి, యెహోవాసాక్షులు మంచివార్త ప్రకటించడానికి మానవ అధికారుల అనుమతి అవసరం లేదు.