కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

16వ పాఠం

భూమ్మీద ఉన్నప్పుడు యేసు ఏం చేశాడు?

భూమ్మీద ఉన్నప్పుడు యేసు ఏం చేశాడు?

చాలామంది యేసును ఒక చిన్న పిల్లవాడిలా, ఒక ప్రవక్తలా, లేదా చనిపోతున్న వ్యక్తిలా ఊహించుకుంటారు. అయితే, యేసు భూమ్మీద గడిపిన జీవితాన్ని పరిశీలించడం ద్వారా మనం ఆయన గురించి ఎక్కువ తెలుసుకోవచ్చు. యేసు భూమ్మీద ఉన్నప్పుడు చేసిన కొన్ని ముఖ్యమైన పనులు ఏంటో, అవి మనకెలా సహాయం చేస్తాయో ఈ పాఠంలో చూస్తాం.

1. యేసు చేసిన పనుల్లో అన్నిటికన్నా ముఖ్యమైన పని ఏంటి?

యేసు చేసిన పనుల్లో అన్నిటికన్నా ముఖ్యమైనది, ‘దేవుని రాజ్యం గురించిన మంచివార్తను ప్రకటించడం.’ (లూకా 4:43 చదవండి.) దేవుడు ఒక రాజ్యాన్ని లేదా ప్రభుత్వాన్ని స్థాపిస్తాడని, అది మన సమస్యలన్నిటినీ తీసేస్తుందని యేసు ప్రకటించాడు. a ఆయన మూడున్నర సంవత్సరాల పాటు ఆ మంచివార్తను ప్రకటించడంలో ఎంతో కష్టపడ్డాడు.—మత్తయి 9:35.

2. యేసు చేసిన అద్భుతాలు ఏం రుజువు చేశాయి?

దేవుడు యేసు ద్వారా చేసిన ఎన్నో “శక్తివంతమైన పనుల్ని, అద్భుతాల్ని” బైబిలు వివరిస్తుంది. (అపొస్తలుల కార్యాలు 2:22) దేవుడు ఇచ్చిన శక్తితో యేసు తుఫానును ఆపాడు, వేలమందికి ఆహారం పెట్టాడు, రోగుల్ని బాగుచేశాడు, ఆఖరికి చనిపోయినవాళ్లను కూడా బ్రతికించాడు. (మత్తయి 8:23-27; 14:15-21; మార్కు 6:56; లూకా 7:11-17) యేసు చేసిన అద్భుతాలు, ఆయన్ని దేవుడే పంపించాడని రుజువు చేశాయి. అంతేకాదు, యెహోవాకు మన సమస్యలన్నీ తీసేసే శక్తి ఉందని అవి చూపించాయి.

3. యేసు జీవించిన విధానం నుండి మనం ఏం నేర్చుకోవచ్చు?

యేసు అన్ని సందర్భాల్లో యెహోవా మాట విన్నాడు. (యోహాను 8:29 చదవండి.) వ్యతిరేకత ఉన్నా సరే, చనిపోయే వరకు యేసు తన తండ్రి చెప్పిన పనుల్ని నమ్మకంగా చేశాడు. కష్టమైన పరిస్థితుల్లో కూడా మనుషులు దేవుణ్ణి సేవించగలరు అని యేసు నిరూపించాడు. అలా, మనం ‘నమ్మకంగా తన అడుగుజాడల్లో నడవాలని మనకు ఆదర్శాన్ని ఉంచాడు.’1 పేతురు 2:21.

ఎక్కువ తెలుసుకోండి

యేసు మంచివార్తను ఎలా ప్రకటించాడో, అద్భుతాల్ని ఎలా చేశాడో పరిశీలించండి.

4. యేసు మంచివార్త ప్రకటించాడు

యేసు మట్టిరోడ్ల మీద వందల కిలోమీటర్లు నడిచి, వీలైనంత ఎక్కువమందికి మంచివార్త ప్రకటించాడు. లూకా 8:1 చదవండి, తర్వాత ఈ ప్రశ్నల్ని చర్చించండి:

  • యేసు తన దగ్గరికి వచ్చినవాళ్లకు మాత్రమే ప్రకటించాడా?

  • ప్రజలకు ప్రకటించడానికి యేసు ఎంతగా కృషిచేశాడు?

మెస్సీయ మంచివార్త ప్రకటిస్తాడని దేవుడు ముందే చెప్పాడు. యెషయా 61:1, 2 చదవండి, తర్వాత ఈ ప్రశ్నల్ని చర్చించండి:

  • యేసు ఈ ప్రవచనాన్ని ఎలా నెరవేర్చాడు?

  • నేడు ప్రజలు మంచివార్తను వినాల్సిన అవసరం ఉందంటారా?

5. యేసు విలువైన పాఠాల్ని బోధించాడు

దేవుని రాజ్యం గురించిన మంచివార్త ప్రకటించడంతోపాటు, ప్రజలకు ఉపయోగపడే విలువైన పాఠాల్ని కూడా యేసు బోధించాడు. ఉదాహరణకు, కొండ మీది ప్రసంగం అని పిలిచే ఒక ప్రసంగంలో యేసు చెప్పిన కొన్ని విషయాల్ని చూడండి. మత్తయి 6:14, 34; 7:12 చదవండి, తర్వాత ఈ ప్రశ్నల్ని చర్చించండి:

  • జీవితంలో ఉపయోగపడే ఏ సలహాల్ని యేసు ఇక్కడ చెప్పాడు?

  • ఆ సలహాలు ఇప్పటికీ ఉపయోగపడతాయని మీకు అనిపిస్తుందా?

6. యేసు అద్భుతాలు చేశాడు

యెహోవా ఇచ్చిన శక్తితో యేసు ఎన్నో అద్భుతాలు చేశాడు. అలాంటి ఒక అద్భుతం గురించి తెలుసుకోవడానికి, మార్కు 5:25-34 చదవండి లేదా వీడియో చూడండి. తర్వాత ఈ ప్రశ్నల్ని చర్చించండి.

  • అనారోగ్యంతో ఉన్న స్త్రీ ఏ విషయాన్ని బలంగా నమ్మింది?

  • ఈ అద్భుతం విషయంలో మీకు ఏది బాగా నచ్చింది?

యోహాను 5:36 చదవండి, తర్వాత ఈ ప్రశ్నను చర్చించండి:

  • యేసు చేసిన అద్భుతాలు ఆయన గురించి ఏమని ‘సాక్ష్యం ఇచ్చాయి’?

మీకు తెలుసా?

యేసు జీవితం గురించిన చాలా వివరాలు బైబిల్లోని నాలుగు సువార్త పుస్తకాల్లో ఉన్నాయి. అవి ఏంటంటే మత్తయి, మార్కు, లూకా, యోహాను. ప్రతీ పుస్తకం యేసు గురించి మిగతా సువార్త పుస్తకాల్లో లేని కొన్ని ఆసక్తికరమైన వివరాల్ని చెప్తుంది. కాబట్టి ఆ నాలుగు పుస్తకాల్ని చదివితే, యేసు జీవితం గురించి మనకు చక్కని అవగాహన వస్తుంది.

  • మత్తయి 

    ఇది సువార్త పుస్తకాల్లో మొదట రాసినది. ఈ పుస్తకం యేసు బోధల్ని, మరిముఖ్యంగా దేవుని రాజ్యం గురించి ఆయన బోధించిన విషయాల్ని నొక్కిచెప్తుంది.

  • మార్కు

    ఇది సువార్త పుస్తకాల్లో అన్నిటికన్నా చిన్నది. ఈ పుస్తకం యేసు జీవితంలో జరిగిన ఎన్నో సంఘటనల్ని కొన్ని మాటల్లో, కళ్లకు కట్టినట్టు చెప్తుంది.

  • లూకా

    ఈ పుస్తకం ముఖ్యంగా ప్రార్థన గురించి, యేసు స్త్రీలను గౌరవించడం గురించి చెప్తుంది.

  • యోహాను 

    ఈ పుస్తకం యేసు తన దగ్గరి స్నేహితులతో, ఇతరులతో మాట్లాడిన చాలా విషయాల గురించి చెప్తుంది. యేసు ఎలాంటివాడో అర్థం చేసుకోవడానికి ఆ విషయాలు సహాయం చేస్తాయి.

కొంతమంది ఇలా అంటారు: “యేసు కేవలం ఒక మంచి మనిషి మాత్రమే.”

  • మీకేం అనిపిస్తుంది?

ఒక్కమాటలో

యేసు దేవుని రాజ్యం గురించి ప్రకటించాడు, అద్భుతాలు చేశాడు, అన్ని సందర్భాల్లో యెహోవా మాట విన్నాడు.

మీరేం నేర్చుకున్నారు?

  • యేసు చేసిన పనుల్లో అన్నిటికన్నా ముఖ్యమైన పని ఏంటి?

  • యేసు చేసిన అద్భుతాలు ఏం రుజువు చేశాయి?

  • జీవితంలో ఉపయోగపడే ఏ సలహాల్ని యేసు చెప్పాడు?

ఇలా చేసి చూడండి:

ఇవి కూడా చూడండి

యేసు చేసిన అద్భుతాలు నిజంగా జరిగాయని మనం ఎందుకు నమ్మవచ్చో తెలుసుకోండి.

“యేసు చేసిన అద్భుతాలు—వాటినుండి మీరు ఏమి నేర్చుకోవచ్చు?” (కావలికోట, జూలై 15, 2004)

యేసు ఇతరుల్ని ఎంతగా పట్టించుకునేవాడో తెలుసుకున్నాక, ఒకాయన తన జీవితాన్ని ఎలా మార్చుకున్నాడో చదవండి.

“నేను నా గురించి మాత్రమే ఆలోచించేవాడిని” (కావలికోట ఆర్టికల్‌)

యేసు పరిచర్యలో ఏ సంఘటనలు ముందు జరిగాయో, ఏవి తర్వాత జరిగాయో ఒక వరుసలో చదవండి.

“యేసు భూజీవితంలోని ముఖ్యమైన సంఘటనలు” (పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం, అనుబంధం A7)

a 31 నుండి 33 పాఠాల్లో దేవుని రాజ్యం గురించి ఎక్కువగా తెలుసుకుంటాం.