యెహోవా సింహాసనము ఎదుట ఒక గొప్పసమూహం
అధ్యాయం 13
యెహోవా సింహాసనము ఎదుట ఒక గొప్పసమూహం
1. (ఎ) క్రైస్తవ కాలానికి ముందున్న దేవుని సేవకులు లేదా 1,44,000 మంది తమ బహుమానం పొందకముందు వారేమి అనుభవించాలి? (బి) అయితే “మహాశ్రమల” కాలమందు జీవించు గొప్పసమూహమునకు ఏది సాధ్యమౌతుంది?
హేబెలు మొదలుకొని బాప్తిస్మమిచ్చు యోహాను వరకున్న దేవుని నమ్మకమైన సేవకులందరు దేవుని చిత్తం చేయడాన్ని తమ జీవితాల్లో మొదటవుంచిననూ, వారందరు మరణించి పునరుత్థానం కొరకు వేచియుండాల్సి వచ్చింది. పరలోక రాజ్యమందు క్రీస్తుతోవుండే ఆ 1,44,000 మందికూడ తమ బహుమానం పొందుటకు ముందు చనిపోవాలి. అయితే దీనికి భిన్నంగా “మహాశ్రమలనుండి” నిజంగా తప్పింపబడి, మరణించకుండా నిత్యం జీవించే ఉత్తరాపేక్షగల ఒక గొప్పసమూహము ఉంటుందని అపొస్తలుడైన యోహానుకు దర్శనమందు చూపబడింది.—ప్రక. 7:9-17.
“గొప్పసమూహమును” గుర్తించుట
2. ప్రకటన 7:9 లోని “గొప్పసమూహపు” గుర్తింపును స్పష్టంగా అర్థంచేసుకోవడానికి ఏది నడిపింది?
2 శతాబ్దాలపాటు ఈ “గొప్పసమూహపు” గుర్తింపు అర్థంకాలేదు. అయితే సంబంధిత ప్రవచనాల ప్రగతిశీల అవగాహన అందుకు మార్గాన్ని సిద్ధపరచింది. మత్తయి 25:31-46 లో యేసుచెప్పిన ఉపమానమందలి “గొఱ్ఱెలు,” యోహాను 10:16 లో ఆయన సూచించిన “వేరే గొఱ్ఱెలు” ఈ భూమిపై నిత్యం నివసించే అవకాశమున్న ప్రస్తుతం జీవించే ప్రజలని 1923 లో గ్రహించడం జరిగింది. యెహెజ్కేలు 9:1-11 లో వర్ణింపబడిన లేఖకుని సిరాబుడ్డిగల వ్యక్తిద్వారా తమ లలాటముల గురుతువేయబడిన వారు మత్తయి 25వ అధ్యాయమందలి “గొఱ్ఱెలని” 1931 లో గుర్తింపబడింది. ఆ పిమ్మట, ప్రకటన 7:9-17నందలి “గొప్పసమూహము” లేదా “గొప్ప ప్రజావాహిని” అనేవారు యేసుచెప్పిన మేకలు, గొఱ్ఱెలు అనే ఉపమానమందలి “గొఱ్ఱెలు” ఒకరేనని 1935 లో అర్థం చేసుకోబడింది. కొంతమంది అప్పటికే తమనుతాము గొర్రెవంటి వారిగా కనుబర్చుకుంటున్నారని 1923 లోనే గ్రహింపబడిననూ, 1935 వరకు వారి సంఖ్య వేగంగా వృద్ధికాలేదు. దైవానుగ్రహంగల ‘వేరే గొఱ్ఱెలకు’ సంబంధించిన “గొప్పసమూహపు” వారని గుర్తింపబడటానికి ప్రయత్నించేవారు నేడు అక్షరార్థంగా లక్షలసంఖ్యలో ఉన్నారు.
3. వారు ‘సింహాసనము ఎదుట నిలువబడ్డారనుట’ ఎందుకు వారు పరలోక తరగతనే భావమివ్వదు?
3 ప్రకటనలో అదే అధ్యాయమందు అంతకుముందు సూచింపబడిన ఆత్మీయ ఇశ్రాయేలీయుల సభ్యులగు 1,44,000 మందినుండి ఈ “గొప్పసమూహపు” వారు వేరుగా చూపబడ్డారు. యోహాను తన దర్శనమందు ఈ “గొప్పసమూహము” పరలోకమందున్నట్లు చూడలేదు. దేవుని ‘సింహాసనము ఎదుట (గ్రీకు: యినోపియన్ టౌ త్రోనౌ, “సింహాసనపు కనుదృష్టిలో”) నిలువబడుట’ అంటే దానర్థం వారు పరలోకమందు ఉండాలని కాదు. పరలోకంనుండి నరులను తాను కన్నులారా చూస్తున్నానని మనకుచెబుతున్న దేవుని “కనుదృష్టిలో” మాత్రమే వారి స్థానంవుంది. (ప్రక. 7:9; కీర్త. 11:4; కీర్తన 100:1, 2; ఆలాగే లూకా 1:74, 75; అపొస్తలుల కార్యములు 10:33 కూడా పోల్చండి, రాజ్యాంతస్సంబంధ అనువాదం, ఆంగ్లం) అదేవిధంగా, మత్తయి 25:31, 32 లో వర్ణింపబడినట్లు క్రీస్తు సింహాసనం ఎదుట (అక్షరార్థంగా, “ఆయనయెదుట”) ఉండుటకు సమస్త జనములు పరలోకంలో ఉండాల్సిన అవసరం లేదు. భూమినుండి పరలోకానికి తీసుకోబడిన వారిసంఖ్య ప్రత్యేకంగా వెల్లడిచేయబడిన, ప్రకటన 7:4-8 మరియు 14:1-4లతో పోల్చుట ద్వారా, ‘యెవడును లెక్కింపజాలని ఈ గొప్పసమూహము’ పరలోకపు తరగతికి చెందినదికాదనే వాస్తవం కనబడుతోంది.
4. (ఎ) వారు తప్పించుకునే “మహాశ్రమలు” ఏవి? (బి) ప్రకటన 7:11, 12 లో చెప్పబడినట్లుగా, ఎవరు “గొప్పసమూహమును” గమనించి, ఆరాధనలో వారితోపాటు భాగం వహిస్తారు?
4 “గొప్పసమూహమును” గుర్తిస్తూ యోహానిలా వ్రాశాడు: “వీరు మహాశ్రమలనుండి వచ్చినవారు.” వారు తప్పించుకొనే శ్రమలు నిజానికి భూమిపై ప్రక. 7:13, 14; మత్త. 24:21) మహా భయంకరమైన ఆ యెహోవా దినాన్నుండి తప్పించుకొనే వారికి తమ విడుదలకు ఎవరు బాధ్యులనే విషయంలో ఏమాత్రం సందేహం ఉండదు. తమ రక్షణకై వారు దేవునికి, గొర్రెపిల్లకు కృతజ్ఞతాస్తుతి చెల్లించినప్పుడు, యోహాను తన దర్శనంలో చూసినట్లుగా పరలోకమందలి నమ్మకమైన ప్రాణులందరు అద్వితీయ సత్యదేవుని ఆరాధనలో వారితోపాటు తమ స్వరాలుకూడ కలిపి ఇలా అంటారు: “ఆమేన్; యుగయుగములవరకు మా దేవునికి స్తోత్రమును మహిమయు జ్ఞానమును కృతజ్ఞతా స్తుతియు ఘనతయు శక్తియు బలమును కలుగును గాక. . . . ఆమేన్.”—ప్రక. 7:11, 12.
క్రితమెన్నడూ సంభవించనంత మహాగొప్ప శ్రమలైవుంటాయి. (రక్షణార్హతకు తగినట్లు పరీక్షింపబడుట
5. (ఎ) భద్రపర్చబడే “గొప్పసమూహములో” భాగస్థులైయుండుటకు అవసరమైన దానిని మనమెలా తీర్మానించగలము? (బి) ఈ పేరా చివర్లో ఇవ్వబడిన ప్రశ్నలకు సమాధానమిచ్చుట ద్వారా “మహాశ్రమలు” తప్పించుకోవడానికి ఏది అవసరమో వివరించండి.
5 “గొప్పసమూహమును” భద్రపర్చుట యెహోవా నీతి కట్టడల కనుగుణ్యంగానే జరుగుతుంది. విడుదల గావింపబడే వారి లక్షణాల్ని గుర్తించడానికి కావాల్సిన స్పష్టమైన సూచనలు వారినిగూర్చి తెలిపే బైబిలు ప్రవచనార్థక ఉల్లేఖనాలందు పొందుపర్చబడ్డాయి. అలా నీతిని ప్రేమించు వారికిప్పుడు రక్షింపబడు దృక్కోణముతో వాటి ప్రకారము ప్రవర్తించుట సాధ్యమే. ప్రస్తావింపబడే లేఖనాల్ని మనమిప్పటికే చూశాము. అయితే ఇవ్వబడిన అదనపు లేఖనాల సహాయంతో వాటినిప్పుడు జాగ్రత్తగా విశ్లేషించి ఈ ప్రవచనార్థక వర్ణనలకు తగినవారిగా ఉండుటకు మీరేమిచేయాలో ఆలోచించండి.
యోహాను 10:16 నందు “వేరే గొఱ్ఱెలు” సూచింపబడ్డారు
యేసు స్వరాన్ని ఒకవ్యక్తి నిజంగా వినుట అంటే దానిభావమేమి? (యోహా. 10:27; మత్త. 9:9; ఎఫె. 4:17-24)
క్రీస్తును మన ‘ఏకైక కాపరిగా’ అంగీకరిస్తున్నామని మనమెలా చూపగలము? (మత్త. 23:10, 11)
మేకలు, గొఱ్ఱెలను గూర్చి యేసుచెప్పిన ఉపమానమందలి “గొఱ్ఱెలు” (మత్త. 25:31-46)
వీరు మేలుచేసియుండగల్గిన క్రీస్తు “సహోదరులు” ఎవరు? (ఎట్టి కష్టభరితమైన పరిస్థితుల్లో వారు భూమిపైనున్న క్రీస్తు సహోదరుల పక్షమున నిలిచారు? మరియు వారు ఏ సేవకు తమ యథార్థమైన మద్దతునిస్తున్నారు? (ప్రక. 12:12, 17; మత్త. 24:14; 28:19, 20)
రక్షణకొరకు లేఖకుని సిరాబుడ్డిగల మనుష్యునిచే గురుతు వేయబడిన వ్యక్తులు (యెహె. 9:1-11)
సాదృశ్య యెరూషలేము, లేదా క్రైస్తవమత సామ్రాజ్యమందు జరుగుతున్న హేయకృత్యాలతో తమకు పొత్తులేదని వారెలా చూపిస్తారు? (ప్రక. 18:4, 5)
నామకార్థ క్రైస్తవులనుండి వారిని వేరుపరచి, రక్షింపబడువారి వరుసలో వారినుంచే “గురుతు”నందు ఏమి చేర్చబడింది? (1 పేతు. 3:21; మత్త. 7:21-27; యోహా. 13:35)
6. “గొప్పసమూహమును” గూర్చిన యోహాను వర్ణన వారిని అర్థం చేసుకొనుటకు మనకెలా సహాయపడుతుంది?
6ప్రకటన 7:9-15 లో “గొప్పసమూహమును” గూర్చిన వర్ణన అదనంగా మరిన్ని ప్రాముఖ్యమైన వివరాలను అందిస్తున్నది. “మహాశ్రమల” తర్వాత ఆ “గొప్పసమూహపు” సభ్యులు ఎలా కనబడతారో చెబుతూ లేఖనాలు వారు భద్రపర్చబడటానికి నడిపిన వాస్తవాలవైపు కూడ మన దృష్టిని మళ్లిస్తున్నాయి.
7. “మహాశ్రమలకు” ముందు వారేమిచేశారు, ఇదెలా సూచింపబడింది?
7 వారు ప్రతి జనము, ప్రతి వంశము, ప్రతి ప్రజ, ఆయాభాషలు మాటలాడువారిలో నుండి వచ్చిననూ, వారు సింహాసనాసీనుడైన యెహోవాను విశ్వ సర్వాధిపతిగా గుర్తిస్తూ, ఐకమత్యముతో ఆ “సింహాసనము ఎదుట” నిలువబడియున్నట్లు చూపబడ్డారు. తమ జీవన విధానం ద్వారా ఆయన పరిపాలనను తాము యథార్థముగా సమర్థించేవారని వారు నిరూపించారు. “గొఱ్ఱెపిల్ల రక్తములో తమ వస్త్రములను ఉదుకుకొని వాటిని తెలుపు” చేసికొన్నారనే వాస్తవం, వారు దేవుని గొర్రెపిల్లగా యేసుయిచ్చిన విలువైన పాపపరిహారార్థ బలి అవసరతను గుర్తిస్తున్నారని సూచిస్తున్నది. (యోహా. 1:29; 1 యోహా. 2:2) ఆ బలి ఆధారముగా విశ్వాసముతో వారు దేవునికి తమను సమర్పించుకొని, దానికి చిహ్నార్థకముగా నీటి బాప్తిస్మము పొందారు మరియు వారి తెల్లని వస్త్రములు చిత్రీకరించిన్నట్లు వారిప్పుడు దేవునియెదుట నిర్మలమైన స్థానాన్ని కలిగియున్నారు. దేవుని కుమారునియందలి తమ విశ్వాసాన్ని బహిరంగముగా తెలియజేయుటలో వారు వెనుదీయలేదు. (మత్త. 10:32, 33) దీనియంతటి కనుగుణ్యముగా, వారాయన ఆరాధికులుగా ‘రాత్రింబగళ్లు దేవుని సేవిస్తూ’ దేవుని ఆలయంలో, లేక విశ్వ ఆరాధనా మందిరములో ఉన్నట్లుగా చూపబడ్డారు. ఆ విధముగా వారు సత్యారాధనకు యథార్థ మద్దతుదారులుగా, ఆయన రాజ్యమును ప్రకటించువారిగా చరిత్ర సృష్టించారు.—యెష. 2:2, 3.
8. ఈ సమాచారము మనకు ప్రయోజనమివ్వాలంటే, మనమేమి చేయాలి?
8 ఈ ప్రవచనార్థక చిత్రాల వివరాలు మీకు సరిపోతాయా? ఇక్కడ వర్ణింపబడిన దానికనుగుణ్యంగా మీ జీవితాన్ని మరింత సన్నిహితంగా చేయాల్సిన మార్గాలేమైనా ఉన్నాయా? అట్లయిన, అలాచేయాల్సిన సమయమిదే!
ఆత్మీయ పరదైసులో జీవించుట
9. “గొప్పసమూహము” ఇప్పుడు సహితం అనుభవిస్తున్న ఆత్మీయాశీర్వాదాల్ని యోహానెలా వర్ణిస్తున్నాడు?
9 ఆ “గొప్పసమూహములో” భాగముగా రక్షింపబడుటకు నిరీక్షించువారిలో మీరూ ఒకరా? యెహోవా నీతిమార్గాల ప్రకారము మీ జీవితాన్ని మీరు మార్చుకుంటే, మీరప్పుడు నిస్సందేహంగా ఆత్మీయ పరదైసని యుక్తముగా చెప్పబడిన వాగ్దాన పరిస్థితుల్ని ఇప్పటికే అనుభవించనారంభించిన వారై ఉంటారు. అపొస్తలుడైన యోహానుకిలా తెలుపబడింది: “వారికి ఇకమీదట ఆకలియైనను దాహమైనను ఉండదు, సూర్యుని యెండయైనను ఏ వడగాలియైనను వారికి తగులదు, ఏలయనగా సింహాసన మధ్యమందుండు గొఱ్ఱెపిల్ల వారి కాపరియై, జీవజలముల బుగ్గలయొద్దకు వారిని నడిపించును, దేవుడే వారి కన్నులనుండి ప్రతి బాష్పబిందువును తుడిచివేయును.” (ప్రక. 7:16, 17) మీ విషయంలో ఇది నిజమని ఎలా నిరూపించబడింది?
10. (ఎ) ఆత్మీయ భావమందు “గొప్పసమూహము” ఎలా ‘ఆకలిదప్పులు’ కలిగివుండరు? (బి) దీనిని మీరనుభవించారా?
10 మంచి కాపరియగు యేసుక్రీస్తు ప్రేమపూర్వక కాపుదల క్రిందికి రాకముందు, నీతికొరకు మీరు ఆకలిదప్పులతో ఉన్నారా? (మత్తయి 5:6 పోల్చండి.) అట్లయిన, మీరు కోరిన దానిని యెహోవా మాత్రమే తన కుమారుని ద్వారా దయచేయగలడు. యెహోవా నీతి మార్గాలను అనగా దుష్టులను నాశనంచేసే ఆయన సంకల్పాన్ని గూర్చి, ఆదాము సంతానానికి రక్షణను సాధ్యపర్చుటలో ఆయనచూపిన కృపను గూర్చి మీరు నేర్చుకున్నప్పుడు, నిస్సందేహంగా మీరు జీవితంలో మొదటిసారి నిజమైన సంతృప్తిననుభవించారు. దేవుని సంస్థ ఆయన వాక్యంనుండి అందజేసే ఆత్మీయాహారం, నీరు మీకింకనూ సంతృప్తినిస్తున్నాయి. (యెష. 65:13, 14) మీరు క్రీస్తుద్వారా దేవునికి సమర్పించుకున్న వారైతే జీవితంలో మీకిప్పుడు ఓ నిజమైన సంకల్పముంది. (యోహాను 4:32-34 పోల్చండి.) గొర్రెపిల్ల వారిని [గొప్పసమూహమును] “జీవజలముల బుగ్గలయొద్దకు నడిపించును” గనుక, మీయెదుట పరదైసు భూమిపై నిత్యజీవమనుభవించు ఆనందదాయకమైన ఉత్తరాపేక్ష ఉన్నది.
11. (ఎ) “సూర్యుని యెండయైననూ ఏ వడగాలియైననూ వారికి తగులదనుట” ఏ విధముగా నిజము? (బి) ఇది మీకెంత ప్రాముఖ్యము?
11 ఆ మంచికాపరి “గొప్పసమూహము”నకు చెందిన నమ్మకమైన “గొఱ్ఱెలను” కాపాడుతూ, సురక్షితంగా నడిపిస్తాడు కూడ. అందుకే, “సూర్యుని యెండయైననూ ఏ వడగాలియైననూ వారికి తగులదని” అలంకారార్థంగా చెప్పవచ్చును. అంటే “గొప్పసమూహపు” వారిలో ఒకరిగా మీకు లోకంనుండి హింసరాదని దానర్థంకాదు. బదులుగా, దేవుని అయిష్టతనే తీక్షణమైన వేడినుండి మీరు రక్షింపబడతారని అది సూచిస్తుంది. మరియు దుష్టులపై దైవిక నాశనమనే జడివానను ఆయన కురిపించినప్పుడు అది మీకు నాశనాన్ని తీసుకురాదు. అనుగ్రహపూర్వకమైన ఈ సంబంధం నిరంతరం కొనసాగుతుంది.—యెహె. 38:22, 23; కీర్తన 11:6; 85:3, 4 పోల్చండి.
12. ఇప్పుడుకూడ మీ కన్నులనుండి బాష్పబిందువులు ఎలా తుడిచివేయబడుతున్నాయి?
12 ఆ “గొప్పసమూహపు” వారిలో నిజంగా మీరొకరైతే సంతోషానికిగల అద్భుతమైన కారణాలు మీవేగదా! దుష్టులు పూర్తిగా తొలగింపబడి ఆ పిమ్మట మీ శరీరం, మనస్సు పాప ప్రభావాలనుండి నిజంగా విడిపింపబడుటను చూసే అద్భుతమైన నిరీక్షణను మీరు కలిగివుంటారు. అయితే ప్రస్తుతమందు దేవుని విషయంలో అజ్ఞానులుగానున్న ప్రజలనుభవించే దుఃఖం కీర్త. 144:15బి) ఈ విధంగా మీరిప్పటికే ఈ వాగ్దాన నెరవేర్పును అనుభవింపనారంభించిన వారౌతారు: “దేవుడే వారి కన్నులనుండి ప్రతి బాష్పబిందువును తుడిచివేయును.”
సహితం మిమ్మల్ని బాధించదు. యెహోవా దేవుడుగానున్న ప్రజలకు మాత్రమే చెందిన సంతోషాన్ని మీరు తెలుసుకోవడం ఆరంభించారు. (13. క్రీస్తు వెయ్యేండ్ల పరిపాలన పురోగమిస్తుండగా ఆత్మీయ పరదైసు ఆనందాలకు ఏవికూడ చేర్చబడతాయి?
13 ఈ విధానాంతము నుండి “గొప్పసమూహము” భద్రపరచబడునట్లే, ఆత్మీయ పరదైసుకూడ భద్రపర్చబడుతుంది. వారిలో మీరూ ఒకరైతే, క్రీస్తు వెయ్యేండ్ల పరిపాలన పురోగమిస్తుండగా క్రొవ్వినవాటితో ఇవ్వబడు ఆత్మీయ విందును మీరును ఎడతెగక ఆరగిస్తారు. దేవుని తిరుగులేని సంకల్పం మహాద్భుతంగా నెరవేరడం మీరు చూసేకొలది ఆయనను గూర్చిన మీ జ్ఞానం మరింత పెరుగుతుంది. సత్యారాధనలో మీతో ఏకమగుటకు మృతులనుండి అనేకులను ఆహ్వానించుటలో భాగం వహిస్తుండగా మీ ఆనందం పెరుగుతుంది. అప్పుడనుగ్రహించబడే భౌతిక ఆశీర్వాదాలు దేవుని యథార్థ సేవకులందరికి ప్రత్యేకంగా ఎంతో అమూల్యమైనవి గనుక అవి యెహోవా ప్రేమకు తార్కాణములుగా పరిగణింపబడతాయి.—యెష. 25:6-9; యాకో. 1:17.
పునఃసమీక్షా చర్చ
• “గొప్పసమూహమును” బైబిలు ఏ అసాధారణ సంఘటనతో ముడిపెడుతున్నది, ఎలా?
• దైవానుగ్రహంగల ఆ “గొప్పసమూహము”లో చేర్చబడాలని మనం నిజంగా కోరుకుంటే, మనమిప్పుడే ఏంచేయాలి?
• ఆత్మీయ పరదైసు ఆశీర్వాదాలు మీకెంత ప్రాముఖ్యం?
[అధ్యయన ప్రశ్నలు]