కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

పత్రిక ముఖ్యాంశం | దేవుని అత్యంత గొప్ప బహుమానాన్ని మీరు అందుకుంటారా?

దేవుడు ఇచ్చిన అత్యంత గొప్ప బహుమానానికి మీరు ఎలా స్పందిస్తారు?

దేవుడు ఇచ్చిన అత్యంత గొప్ప బహుమానానికి మీరు ఎలా స్పందిస్తారు?

‘క్రీస్తు ప్రేమ మమ్మల్ని బలంగా పురికొల్పుతోంది . . . బ్రతికి ఉన్నవాళ్లు ఇకమీదట తమకోసం జీవించకుండా, తమకోసం చనిపోయి బ్రతికించబడిన వ్యక్తి కోసం జీవించాలి.’—2 కొరింథీయులు 5:14, 15.

ఒక గొప్ప బహుమానానికి మనం ఖచ్చితంగా కృతజ్ఞత చూపించాలి. ఆ విషయంలో యేసు ఒక పాఠం నేర్పించాడు. ఆ కాలంలో చికిత్సలేని జబ్బుతో బాధపడుతున్న పదిమందిని యేసు బాగుచేశాడు. ఆ పదిమందిలో ఒకరు మాత్రమే “దేవుణ్ణి బిగ్గరగా మహిమపరుస్తూ వెనక్కి తిరిగొచ్చాడు.” అప్పుడు యేసు ఇలా అడిగాడు: “పదిమందీ శుద్ధులయ్యారు కదా? మరి మిగతా తొమ్మిదిమంది ఎక్కడ?” (లూకా 17:12-17) ఇందులో పాఠం ఏమిటి? వేరేవాళ్లు మనకు ఏదైన మంచి చేస్తే మనం దాన్ని తొందరగా మర్చిపోయే అవకాశం ఉంది.

విమోచన క్రయధనం వేరే బహుమానాల్లా కాదు. ఇలాంటి బహుమానాన్ని ఎవరూ ఎప్పుడూ ఇవ్వలేదు. మరి, దేవుడు మనకోసం చేసిన ఈ ఏర్పాటుకు మనం ఎలా ప్రతిస్పందించాలి?

  • బహుమానం ఇచ్చిన దేవుని గురించి తెలుసుకోండి. విమోచన క్రయధనం ఉన్నంతమాత్రాన ఏమి చేయకుండానే నిత్యజీవం రాదు. యేసు ప్రార్థిస్తున్నప్పుడు దేవునితో ఇలా చెప్పాడు: “ఒకేఒక్క సత్య దేవుడివైన నిన్నూ, నువ్వు పంపించిన యేసుక్రీస్తునూ తెలుసుకోవడమే శాశ్వత జీవితం.” (యోహాను 17:3) చిన్నప్పుడు మీ ప్రాణాన్ని ఒకతను కాపాడాడు అని మీకు ఎవరైనా చెప్తే, అతని గురించి మీరు ఇంకా తెలుసుకోరా? మిమ్మల్ని ఎందుకు కాపాడాడో తెలుసుకోరా? మీ ప్రాణాలను కాపాడే బహుమానాన్ని ఇచ్చిన యెహోవా దేవుడు, తన గురించి మీరు తెలుసుకోవాలని కోరుకుంటున్నాడు. అంతేకాదు ఆయనతో మీకు ఒక దగ్గరి సంబంధం ఉండాలని కూడా కోరుకుంటున్నాడు. “దేవునికి దగ్గరవ్వండి, అప్పుడు ఆయన మీకు దగ్గరౌతాడు” అని బైబిలు చెప్తుంది.—యాకోబు 4:8.

  • విమోచన క్రయధనం మీద విశ్వాసం చూపించండి. “కొడుకు మీద విశ్వాసం చూపించే వ్యక్తి శాశ్వత జీవితం పొందుతాడు.” (యోహాను 3:36) విశ్వాసం చూపించడం ఎలా? క్రియల్లో. విమోచన క్రయధనం మీద విశ్వాసం చూపించడానికి క్రియలు అవసరం. (యాకోబు 2:17) ఎలాంటి క్రియలు? మీరు ముందుకొచ్చి తీసుకుంటేనే బహుమానం మీ సొంతం అవుతుంది. అలానే విమోచన క్రయధనాన్ని మీరు ముందుకొచ్చి తీసుకోవాలి. ఎలా? మీరు ఎలా జీవించాలని దేవుడు కోరుతున్నాడో నేర్చుకుని అలా జీవించండి. a క్షమాపణ కోసం, స్వచ్ఛమైన మనస్సాక్షి కోసం దేవునికి ప్రార్థన చేయండి. విమోచన క్రయధనం మీద విశ్వాసం చూపించే వాళ్లందరికీ శాంతి, భద్రత, సమృద్ధి ఉన్న నిత్య భవిష్యత్తు ఖచ్చితంగా ఉంటుందనే బలమైన నమ్మకంతో దేవునికి ప్రార్థించండి.—హెబ్రీయులు 11:1.

  • యేసు మరణ జ్ఞాపకార్థ ఆచరణకు హజరవ్వండి. విమోచన క్రయధన ఏర్పాటును మనం గుర్తుంచుకోవడానికి సంవత్సరానికి ఒకసారి చేసే ఒక ఆచరణను యేసు స్థాపించాడు. ఆ ఆచరణ గురించి యేసు ఇలా చెప్పాడు: “నన్ను గుర్తుచేసుకోవడానికి దీన్ని చేస్తూ ఉండండి.” (లూకా 22:19) యెహోవాసాక్షులు మంగళవారం, ఏప్రిల్‌ 11, 2017న సూర్యాస్తమయం తర్వాత యేసు మరణాన్ని గుర్తు చేసుకుంటారు. ఆ కార్యక్రమం దాదాపు గంటసేపు ఉంటుంది. అందులో యేసు మరణానికి ఉన్న ప్రాముఖ్యత గురించి, దానివల్ల ఇప్పుడూ, భవిష్యత్తులో వచ్చే ప్రయోజనాల గురించి వివరించే ప్రసంగం ఉంటుంది. పోయిన సంవత్సరం, ప్రపంచవ్యాప్తంగా దాదాపు 2 కోట్ల మంది యేసు మరణ జ్ఞాపకార్థానికి వచ్చారు. దేవుడు ఇచ్చిన అత్యంత గొప్ప బహుమానానికి ప్రతిస్పందిస్తూ ఈ కార్యక్రమానికి మాతోపాటు హాజరవ్వమని మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాము.

a దేవుని గురించి తెలుసుకుని, ఆయనకు దగ్గరవ్వడానికి ఆయన వాక్యాన్ని అధ్యయనం చేయడం చాలా అవసరం. దీన్ని ఎలా చేయాలో తెలుసుకోవాలంటే యెహోవాసాక్షులను అడగండి లేదా మా వెబ్‌సైట్‌ www.jw.org చూడండి.